ప్రేరణపై పగబట్టిన పృథ్వీ.. నామినేషన్స్‌లో తొమ్మిదిమంది! | Bigg Boss Telugu 8: Seventh Week Nominations List | Sakshi
Sakshi News home page

ప్రేరణపై పగబట్టిన పృథ్వీ.. నామినేషన్స్‌లో తనూ ఉండాల్సిందేనంటూ..

Published Mon, Oct 14 2024 4:24 PM | Last Updated on Mon, Oct 14 2024 4:46 PM

Bigg Boss Telugu 8: Seventh Week Nominations List

బిగ్‌బాస్‌ ఈరోజు నామినేషన్స్‌ కాస్త వెరైటీగా ఉండేలా ప్లాన్‌ చేశాడు. హౌస్‌మేట్స్‌ భవిష్యత్తును ప్రేరణ, హరితేజ చేతిలో పెట్టారు. హారన్‌ మోగిన ప్రతిసారి వీళ్లలో ఎవరైతే ముందుగా హ్యాట్‌ పట్టుకుంటారో వారికి నామినేషన్స్‌లో కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. హౌస్‌మేట్స్‌ ఇద్దర్ని నామినేట్‌ చేస్తే అందులో ఎవరిని సేవ్‌ చేయాలి? ఎవర్ని నామినేషన్‌లోకి పంపాలి? అనేది టోపీ అందుకున్న వ్యక్తి నిర్ణయిస్తారన్నమాట!

ఆమె నా అసిస్టెంటా?
తాజాగా ఈ నామినేషన్స్‌కు సంబంధించి ఓ ప్రోమో రిలీజైంది. బీబీ హోటల్‌ టాస్క్‌లో సరిగా ఆడలేదంటూ గంగవ్వ.. పృథ్వీని నామినేట్‌ చేసింది. ఆ టాస్క్‌లో మహారాణి (గంగవ్వ) దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన నయనిని నా పర్ఫామెన్స్‌ గురించి అడగండి అన్నాడు పృథ్వీ.. ఇంతలో గంగవ్వ.. ఆమె నా దగ్గరే సరిగా ఉండలేకపోయింది, తను నా అసిస్టెంటా? అని నయనిపైనా ఫైర్‌ అయింది.

పగబట్టిన పృథ్వీ
ఇక గంగవ్వ చెప్పినదానితో ప్రేరణ ఏకీభవించింది. అలా పృథ్వీ నామినేట్‌ అయ్యాడు. కానీ అందుకు కారణమైన ప్రేరణపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రేరణ నామినేట్‌ కావాల్సిందే అన్నాడు. ఇది గమనించిన ప్రేరణ.. అతడిని ఎలాగైనా ఆపమని నిఖిల్‌తో చెప్పింది. నువ్వు తనకు సాయం చేస్తే నీకు, నాకూ పెద్ద గొడవ అవుతుందని హెచ్చరించాడు. మరి నిఖిల్‌ ఎటువైపు నిలబడ్డాడన్నది ఆసక్తికరంగా మారింది.

నామినేషన్స్‌లో తొమ్మిదిమంది
ఇకపోతే ఈ ఏడోవారం నిఖిల్‌, పృథ్వీ, గౌతమ్‌, యష్మి, నబీల్‌, తేజ, మణికంఠ, అవినాష్‌, ప్రేరణ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇమ్యూనిటీ షీల్డ్‌తో ఒకర్ని స్వాప్‌ చేసే ఛాన్స్‌ రావడంతో రాయల్‌ టీమ్‌ అవినాష్‌ను సేవ్‌ చేసి అతడి స్థానంలో హరితేజను నామినేషన్స్‌లోకి పంపారు. అలా ఈ వారం మొత్తం తొమ్మిదిమంది నామినేషన్స్‌లో ఉన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement