హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న వనితా విజయ్‌కుమార్‌ కూతురు! | Vanitha Vijayakumar Daughter Jovika To Debut As Heroine, Latest Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Vanitha Vijaykumar: వనిత కూతుర్ని చూశారా? 18 ఏళ్లకే హీరోయిన్‌గా..

Published Wed, Aug 23 2023 2:24 PM | Last Updated on Wed, Aug 23 2023 3:07 PM

Vanitha Vijayakumar Daughter Jovika to debut as heroine - Sakshi

వనితా విజయ్‌కుమార్‌.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ ఉంటుందీ నటి. తమిళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌తో ఫేమస్‌ అయిన వనిత అటు బుల్లితెర, ఇటు వెండితెరపై నటిగా సత్తా చాటుతోంది. తెలుగులోనూ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. వనితకు.. విజయ్‌ శ్రీ హరి అనే తనయుడితోపాటు జోవిక విజయ్‌కుమార్‌ అనే కూతురు కూడా ఉంది. ఇటీవలే జోవిక 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది.

హీరో ఎవరని కాకుండా కథ..
ఇది చూసిన అభిమానులు కోలీవుడ్‌కు మరో హీరోయిన్‌ దొరికేసింది అని కామెంట్లు పెడుతున్నారు. అటు వనితా విజయ్‌ కుమార్‌ కూడా జరగబోయేది అదేనని వత్తాసు పలుకుతోంది. 'నా కూతురు జోవిక కచ్చితంగా సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే మేము కొన్ని కథలు వింటున్నాం. అయితే తను హీరోయిన్‌గా చేయాలా? ముఖ్యమైన పాత్రలో నటించాలా? అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. మరీ ముఖ్యంగా సినిమాలో ఎవరు హీరో? అన్నదాన్ని పక్కనపెట్టి కథ బాగుందా? లేదా? అన్నదానిపైనే ఫోకస్‌ చేస్తున్నాం. తన ఎంట్రీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది' అని చెప్పుకొచ్చింది.

స్టార్స్‌ శిక్షణ తీసుకున్న ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్‌
కాగా జోవిక ముంబైలోని అనుపమ్‌ ఖేర్‌ యాక్టింగ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాదిపాటు శిక్షణ తీసుకుంది. దీపికా పదుకొణె, ప్రీతి జింటా, హృతిక్‌ రోషన్‌, వరుణ్‌ ధావన్‌ వంటి ఎందరో స్టార్స్‌ ఈ స్కూలులో శిక్షణ తీసుకున్నవాళ్లే! మరి జోవిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందా? ముఖ్య పాత్రలో మెరవనుందా? అనేది చూడాలి! ఇదిలా ఉంటే వనితా విజయ్‌ కుమార్‌ తెలుగులో చివరగా నరేష్-పవిత్రా లోకేష్ 'మళ్లీ పెళ్లి'  సినిమాలో నటించింది.

చదవండి: మెగాస్టార్‌ గ్లామరస్‌గా కనిపించిన సినిమా భోళా శంకర్‌.. ఆరోజు ఆయన్ను తొక్కేయాలనుకున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement