సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్‌ | Vanitha Vijaykumar Comments On Samantha And Naga Chaitanya Divorce | Sakshi
Sakshi News home page

Samantha: సామ్‌కు మద్ధతుగా నిలిచిన వనితా విజయ్‌కుమార్‌

Published Mon, Oct 11 2021 4:54 PM | Last Updated on Mon, Oct 11 2021 7:33 PM

Vanitha Vijaykumar Comments On Samantha And Naga Chaitanya Divorce - Sakshi

Vanitha Vijaykumar Supports Samantha:  సమంత-నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విడాకులకు సమంతనే కారణం అంటూ ఆమెను టార్గెట్‌ చేస్తున్నారు. సమంత పిల్లలు వద్దనుకుందని, ఇప్పటికే రెండుసార్లు అబార్షన్‌ కూడా చేయించుకుంది అంటూ చాలా దారుణంగా సామ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ఇక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ఆమెపై అసత్య ప్రచారాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. చదవండి: జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ

సామ్‌-చై  విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో సమంతదే తప్పు అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రకుల్‌ ప్రీత్‌ సహా పలువురు సెలబ్రిటీలు సమంతకు మద్దతుగా నిలిచారు. తాజాగా వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్‌ సైతం సామ్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్టును షేర్‌ చేసుకుంది.

'సమాజం అన్నది అవాస్తవం సామ్‌. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవితం చాలా విలువైంది. ఏం జరిగినా దాని వెనుక ఓ కారణం ఉండే ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్లు' అంటూ వనితా విజయ్‌కుమార్‌ పేర్కొంది. 
చదవండి:  సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement