Vanitha Vijayakumar Is In Love Again | Vanitha Vijayakumar Latest News | మళ్లీ ప్రేమలో పడ్డా - Sakshi
Sakshi News home page

మళ్లీ ప్రేమలో పడ్డా 

Dec 19 2020 6:37 AM | Updated on Dec 19 2020 3:38 PM

Vanitha Vijayakumar Is In Love Again - Sakshi

'మళ్లీ ప్రేమలో పడ్డాను' అంటూ నటి వనిత విజయకుమార్‌ తెలిపారు. సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. ఈమె చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో సంచలన నటిగా ముద్ర వేసుకున్నారు. గత ఏడాది బిగ్‌ బాస్‌ రియాలిటీ గేమ్‌ షో సీజన్‌ 3లో పాల్గొని వార్తల్లో నానారు. గత జూన్‌లో పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నారు. చదవండి: (అతిథులు వీళ్లేనా బాస్‌?)

ఆ వివాహ జీవితం కూడా ఎంతో కాలం సజావుగా సాగలేదు. పీటర్‌ పాల్‌ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనిత విజయ్‌ కుమార్‌ను రెండో పెళ్లి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ప్రస్తుతం టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నటి వనిత విజయకుమార్‌ తాను మళ్లీ ప్రేమలో పడ్డానని గురువారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె ఎవరి ప్రేమలో పడ్డాను అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో ఆమె గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారం ట్రోల్‌ అవుతుంది.  చదవండి: (భర్తతో వనితా విజయ్‌ కుమార్‌కు విభేదాలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement