నాన్న వల్లే నా జీవితం నాశనం అయింది: వనితా విజయ్‌ కుమార్‌ | Vanitha Vijayakumar Sensational Comments On Her Father Vijay Kumar | Sakshi
Sakshi News home page

నాన్న వల్లే నా జీవితం నాశనం అయింది: వనితా విజయ్‌ కుమార్‌

Published Sun, Feb 25 2024 8:39 AM | Last Updated on Sun, Feb 25 2024 11:48 AM

Vanitha Vijayakumar Sensational Comments On Her Father Vijay Kumar - Sakshi

నటి వనితా విజయ్‌ కుమార్‌.. సినిమాలకంటే వ్యక్తిగత విషయాలవల్లే ఎక్కువగా పాపులర్‌ అయింది. ప్రముఖ నటుడు విజయ్‌ కుమార్‌ వారసురాలిగా చంద్రలేఖ సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత. అందులో దళపతి విజయ్‌కి జోడిగా నటించి మంచి మార్కులు సాధించింది. దేవి సినిమాలతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న సమయంలోనే 2000లో నటుడు ఆకాష్‌ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది.

ఆ తర్వాత ఏడాదికే ఆకాశ్‌కు విడాకులు ఇచ్చి..ఆనంద్‌ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని..అతన్ని దూరం పెట్టేసింది. గతేడాదిలో మేలో పీటర్‌ పాల్‌ మృతి చెందగా.. అతను తన భర్తే కాదని, తమకు పెళ్లే జరగలేదని చెప్పి అందరికి షాకిచ్చింది.  

ప్రస్తుతం వనితా తన ఇద్దరి కూతుళ్లతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. విజయ్‌ కుమార్‌ ఫ్యామిలీ ఆమెను దూరం పెట్టింది. ఇటీవల విజయ్‌ కుమార్‌ మనువరాలు దియా పెళ్లి జరిగింది. ఆ వేడుకకు విజయ్‌ కుమార్‌ ఇద్దరు భార్యల పిల్లలు.. బంధువులు వెళ్లారు. కానీ వనితకు మాత్రం ఆహ్వానం అందలేదట.

ఇదిలా ఉంతే తన తండ్రి గురించి వనితా విజయ్‌ కుమార్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.  ఓ ఇంటర్వ్యూలో వనితా మాట్లాడుతూ.. ‘మా నాన్న ఓ ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి మాట్లాడుతూ.. నా పేరు తప్ప అందరి పేర్లు చెప్పాడు. నా పేరు పలకడానికి కూడా ఆయన ఇష్టం లేదు.  ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా.. నేను మాత్రం ఆయన కూతురినే అనే విషయం ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం నా జీవితం ఇలా అయిందంటే..అందుకు కారణం మా నాన్న. ఆయన వల్లే నా జీవితం నాశనం అయింది. ఆయన మాటలు వినడం వల్లే నేను ఇలా తయారయ్యాను’ అని వనితా కుమార్‌ అన్నారు. అయితే ఈ వాఖ్యలు చాలా రోజుల క్రితం చేయగా..ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement