1.25 కోట్ల నష్ట పరిహారంతో బెదిరింపు | Lakshmi Ramakrishnan Notice to Vanitha Vijaykumar Tamil nadu | Sakshi
Sakshi News home page

రూ.1.25 కోట్ల నష్ట పరిహారంతో బెదిరింపు

Published Fri, Jul 31 2020 7:43 AM | Last Updated on Fri, Jul 31 2020 7:55 AM

Lakshmi Ramakrishnan Notice to Vanitha Vijaykumar Tamil nadu - Sakshi

నటి లక్ష్మీరామకృష్ణన్, వనిత

సినిమా: నటి వనితా విజయకుమార్, నటి,దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్‌ మధ్య వివాదం ఇప్పట్లో సమసేలా లేదు. ఇప్పుటికే అనుచిత వ్యాఖ్యలతో దూషించుకున్న వీరు ఇప్పుడు సమన్లు, బెదిరింపుల వరకూ వెళుతున్నారు. ఈ వివరాలు చూస్తే నటి వనిత ఇటీవల పీటర్‌పాల్‌ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ వివాదానికి  తెరలేచింది. వనిత మూడో వివాహం చేసుకోవడాన్ని లక్ష్మీరామకృష్ణన్‌తో పాటు కస్తూరి తీవ్రంగా విమర్శించారు. దీంతో వనిత వారిపై ఎదురుదాడికి దిగింది. అలా లక్ష్మీరామకృష్ణన్‌  వ్యక్తిగత జీవితం గురించి విమర్శించింది. (వనితపై వరుస కేసులు)

దీంతో లక్ష్మీరామకృష్ణన్‌ లాయర్‌ ద్వారా వనితకు నోటీసులు జారీ చేయించింది. దాని కాపీని స్థానిక వడపళని మహిళా పోలీస్‌స్టేషన్‌కు, వడపళని అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌కు,  చెన్నై మహిళా సంఘానికి పంపింది. ఈ నోటీస్‌పై వనిత స్పందిస్తూ లక్ష్మీరామకృష్ణన్‌ రూ.1.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ బెదిరిస్తూ తనకు నోటీసులు పంపినట్లు వెటకారంగా పేర్కొంది. ఆమె పంపిన నోటీస్‌ కోర్టు ద్వారా వచ్చింది కాదని చెప్పింది. దానికి బదులుగా తానూ లక్ష్మీ రామకృష్ణన్‌కు నోటీస్‌ పంపినట్లు వనిత పేర్కొంది. లక్ష్మీరామకృష్ణన్‌ బెదిరింపులకు బెదిరిపోయేది లేదని, చట్టపరంగానే ఎదుర్కొంటానని వనిత పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement