
నటి వనితా విజయ్ కుమార్ పేరు చెప్పగానే మూడు పెళ్లిళ్ల విషయమే గుర్తొస్తుంది. ఈ ఏడాది మే నెలలో ఈమె మూడో భర్త పీటర్ పాల్ చనిపోయాడు. అయితే అతడు తన భర్త కాదని, తమకు అసలు పెళ్లే జరగలేదని ఈమె అప్పట్లో పోస్ట్ పెట్టింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. అదేంటి, లాక్‌డౌన్ టైంలో మ్యారేజ్ చేసుకున్నారా కదా అని అనుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలపై స్వయంగా ఆమెనే క్లారిటీ ఇచ్చింది. 'సాక్షి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మూడోపెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
(ఇదీ చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!)
'లాక్‌డౌన్ వల్ల నాలో ఒత్తిడి పెరిగింది. చనిపోతానేమో అని భయమేసింది. దీంతో నాకు ఎవరైనా కావాలనిపించింది. ఒకవేళ నేను చనిపోయినా అప్పటివరకు తోడుంటారు కదా! అయితే నేను మూడో పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. అలానే అతడు(పీటర్ పాల్) మంచి వ్యక్తి. అతడి వల్ల జీవితంలో చాలా విషయాలు తెలుసుకున్నాను'
'నా వరకు చూసుకుంటే.. మాకు పెళ్లి జరగలేదు. జస్ట్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం. కొన్నాళ్లకు నేను జీవితాన్ని కోరుకున్నాను. ఆయన వేరే దారిని ఎంచుకున్నారు. నా వరకు వస్తే ప్రేమ చాలా ముఖ్యం. కానీ అది ఓవైపు నుంచి వస్తే ఎలా? నేను ప్రేమ చూపించినప్పుడు అటువైపు నుంచి కూడా లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా!' అని వనిత విజయ్ కుమార్ చెప్పారు. ఈ మధ్య ఈమె.. నరేష్-పవిత్రా లోకేష్ 'మళ్లీ పెళ్లి' సినిమాలో నటించింది.
(ఇదీ చదవండి: విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!)
Comments
Please login to add a commentAdd a comment