నటి వనితా విజయ్ కుమార్ మాజీ భర్త, విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పీటర్ పాల్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (ఏప్రిల్ 29న) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది.
'సాయం చేసేవారికి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడని మా అమ్మ చెప్పింది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నప్పుడు ఎటువైపు వెళ్లాలనేది ఎటువెళ్లాలనేది ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మీకు విముక్తి, శాంతి లభించిందని భావిస్తున్నాను. నువ్వు ఈ లోకం నుంచి వెళ్లిపోయినందుకు బాధగా ఉంది. ఇప్పటికైనా నీకు ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నాను. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
కాగా వనితా విజయ్ కుమార్ 2020 జూన్ 27న పీటర్ పాల్‌ను పెళ్లాడింది. ఇది వనితకు మూడో పెళ్లి కాగా పీటర్‌కు రెండో పెళ్లి. అయితే తనకు విడాకులు ఇవ్వకముందే పీటర్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అతడి మొదటి భార్య ఎలిజబెత్. అదంతా అబద్ధమని, ఎలిజబెత్‌కు విడాకులిచ్చిన తర్వాతే వనితను పెళ్లాడానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు పీటర్. కానీ వీరి బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన నాలుగు నెలలకే వనితా- పీటర్ విడిపోతున్నట్లు వెల్లడించారు. పీటర్ మద్యానికి బానిసై అసభ్యంగా ప్రవర్తించడం వల్లే వనిత అతనిని విడిచిపెట్టినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. మద్యం తాగే అలవాటు వల్లే పీటర్ అనారోగ్యానికి గురై మరణించినట్లు తెలుస్తోంది.
చదవండి: తండ్రి కావాలనుకుంటున్న సల్మాన్.. పెళ్లి మాత్రం వద్దట
Comments
Please login to add a commentAdd a comment