బిగ్‌బాస్‌లో ఎంట్రీ.. అప్పుడే రెండు చిత్రాలకు ఓకే! | Kollywood Actress Vanitha Vijaykumar's Daughter Jovika To Debut As Heroine | Sakshi
Sakshi News home page

Vanitha Vijaykumar: తల్లి బాటలోనే కూతురు.. అప్పుడే రెండు చిత్రాలకు ఓకే!

Published Mon, Oct 9 2023 7:13 AM | Last Updated on Mon, Oct 9 2023 10:39 AM

Kollywood Actress Vanitha Vijaykumar Daughter Jovika Entry in Cinemas - Sakshi

కోలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర వేయించుకున్న నటి వనితా విజయకుమార్‌. విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైంది. ప్రముఖ నటుడు విజయ్‌ కుమార్‌, మంజుల దంపతుల వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించిన వ్యక్తిగత సమస్యల కారణంగా కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలోనే ఫైర్‌ బ్రాండ్‌ గా ముద్ర వేసుకున్నారు. 

(ఇది చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్)

వనిత రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నా వైవాహిక దాంపత్యం సాఫీగా సాగలేదు. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్‌ తర్వాత వనితా విజయకుమార్‌ మళ్లీ నటించటానికి సిద్ధమయ్యారు. ఆ మధ్య బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్‌ షోలో పాల్గొని అక్కడ కూడా తనదైన ముద్రను వేసుకున్నారు. కాగా ఈమె కూతురు గురించి చాలామందికి తెలియదు. వనితా విజయ్‌ కుమార్‌ కూతురు పేరు జోవిక. హీరోయిన్‌గా  ఎంట్రీ ఇస్తోంది.

ఇప్పటికే బిగ్‌బాస్‌ రియాలిటీ షో సెవెన్‌ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని తల్లి బాటలోనే ప్రయాణిస్తోంది. తాజాగా బిగ్‌ బాస్‌ హౌస్‌లో చదువు చాలా ముఖ్యం అన్న నటి విచిత్ర వ్యాఖ్యలను ఖండించి తనకు చదువు పెద్దగా అబ్బకపోవడంతోనే నచ్చింది చేస్తున్నానని బదిలిచ్చింది. దీంతో తొలి వారమే ఎపిసోడ్‌లోని హాట్‌ టాపిక్‌గా మారింది.

(ఇది చదవండి: హౌస్‌లో అడుగుపెట్టిన సోషల్‌ మీడియా సెన్సేషన్‌)

తన కూతురు మాటలను పూర్తిగా సమర్థించిన నటి వనిత విజయ్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను దర్శక నటుడు పార్థీపన్‌ వద్ద గత కొన్ని నెలలుగా సహాయ దర్శకురాలిగా పనిచేసినట్లు చెప్పారు. తమకు రెండు కార్లు ఉన్నా పార్తీపన్‌ కార్యాలయానికి మెట్రో రైల్‌లోనే వెళ్లి వచ్చేదని చెప్పారు. అలా పెడితేనే సహాయ దర్శకుల కష్టమేమిటో ఆమెకు తెలుస్తుందని చెప్పారు. తాను కూడా మొదట్లో దర్శకుడు పి. వాసు వద్ద 10 చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశానని విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జోవికాకు సంబంధించిన మరో సర్ప్‌రైజ్‌ ఏమిటంటే తను ఇప్పటికే రెండు చిత్రాల్లో కథానాయకిగా నటించడానికి ఒప్పందం అయినట్లు చెప్పారు. అందులో ఒకటి తన చిత్రం కాగా.. మరొకటి తెలుగు చిత్రమని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement