న‌టి మూడో పెళ్లి; ఫోటోలు వైర‌ల్‌ | Actress Vanitha VijayKumar Get Married Peter Paul | Sakshi
Sakshi News home page

మూడో పెళ్లి చేసుకున్న న‌టి; ఫోటోలు వైర‌ల్‌

Published Sat, Jun 27 2020 7:42 PM | Last Updated on Sun, Jun 28 2020 10:13 AM

Actress Vanitha VijayKumar Get Married Peter Paul - Sakshi

చెన్నై : న‌టి వ‌నిత విజ‌య్‌కుమార్ శ‌నివారం(జూన్‌27) సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌ పీట‌ర్ పాల్ అనే వ్య‌క్తిని  వివాహం చేసుకున్నారు. క్రైస్త‌వ మ‌త ఆచారం ప్ర‌కారం సాయంత్రం 4 గంట‌ల‌కు చెన్నైలో వీరి వివాహ వేడుక జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఇరువురు ఉంగ‌రాలు మార్చుకున్నారు. ప్ర‌స్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా వ‌నిత‌కు ఇది మూడో వివాహం కావ‌డం గ‌మ‌నార్హం. ఈ  వేడుక‌లో వ‌నిత ముందు భ‌ర్త పిల్ల‌లు జోవికా, జ‌య‌నిత ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. (నటి మరో పెళ్లి.. కుమార్తె మద్దతు)

ఇప్ప‌టికే 2000 సంవత్సరంలో వ‌నిత విజ‌య్‌కుమార్ నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. అయితే ఆకాష్‌తో మనస్పర్థల కారణంగా 2005లో విడిపోగా, ఆ తరువాత 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. మ‌ళ్లీ ఆనంద్‌తోనూ 2012లో విడాకులు తీసుకున్న వనిత శ‌నివారం తన ఇంటి వద్దే పీటర్‌ పాల్‌ అనే వ్య‌క్తిని మూడో పెళ్లి చేసుకున్నారు. కాగా నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత. ఈమెకు న‌లుగురు సోద‌రీలు, ఒక సోద‌రుడు ఉన్నారు. 1995లో నటుడు విజయ్‌కు జంటగా చంద్రలేఖ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమ‌య్యారు. ఆ త‌ర్వాత తెలుగు, తమిళ మ‌ల‌యాల సినిమాల్లో న‌టించిన ఈ న‌టి ఇటీవ‌ల త‌మిళ బిగ్‌బాస్‌-3లో పాల్గొని మ‌ళ్లీ వార్త‌ల్లోకెక్కారు. (బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!)

Cooku With கோமாளி 👨‍🍳🤡 Best Wishes @vanithavijaykumar ❤❤ 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬┃𝐂𝐨𝐨𝐤𝐮 𝐖𝐢𝐭𝐡 𝐂𝐨𝐦𝐚𝐥𝐢┃𝟐𝟒×𝟕 𝐊𝐞𝐞𝐩 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 & 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 #actorajithkumarofficial #cookwithcomali #cookuwithcomali #cookuwithcomalivijaytv #CookwithComali omali #trading #comedy #biggbosstamil #biggbosstroll #actorajithkumarofficial #biggbossunseen #tharshan #tharshanarmy #tharshanbiggboss3 #tharshan #tharshanforever #tharshanfans #tharshanfc #losliya #losliyaarmy #losliyafans #losliya_army #losliya_maria #losliyaarmy #kavin #actorajithkumarofficial #themugenrao_fans #losliyaarmy #losliyafans #losliya_army #iamsandy_off #sandymandy_official #sandymasterarmyofficial #abiramivenkatachalam #shakshiagarwal #sherinshringar #actorajithkumarofficial

A post shared by Cooku With கோமாளி 👨‍🍳🤡🔪🥗🍗🦀🦐🍲🥘 (@cookuwithcomalivijaytv) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement