కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగుల నియామక ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహిస్తుంది. అదే క్రమంలో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, డి) కేటగిరీలో 534 మంది ఉద్యోగులను భర్తీ చేయనుంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో నిర్వహించే‘స్టెనోగ్రాఫర్స్ (గ్రేడ్-సి, డి) ఎగ్జామినేషన్-2014’ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలు..
ఖాళీల వివరాలు:
- గ్రేడ్-సి: 38 (అన్ రిజర్వ్‌డ్-27, ఎస్సీ-1, ఎస్టీ-6, ఓబీసీ-4, ఓహెచ్-1)
- గ్రేడ్-డి: 496 (అన్ రిజర్వ్‌డ్-300, ఎస్సీ-62, ఎస్టీ-33, ఓబీసీ-101, వీహెచ్-2, ఓహెచ్- 11, ఎక్స్‌సర్వీస్‌మెన్-19)
ఎంపిక:
రెండు దశలుగా ఎంపిక ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను తర్వాతి దశ నైపుణ్య పరీక్ష (స్కిల్ టెస్ట్)కు అనుమతిస్తారు.
రాత పరీక్ష ఇలా:
రాత పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్. వివరాలు..
విభాగం ప్రశ్నలు మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 50- 50
జనరల్ అవేర్‌నెస్- 50- 50
ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ -100 -100
మొత్తం - 200- 200
సమయం: 120 నిమిషాలు
ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్:
ఈ విభాగంలో వెర్బల్-నాన్ వెర్బల్ ప్రశ్నలు వస్తాయి. ఇం దులో మెరుగైన మార్కులు సాధించాలంటే తార్కిక విశ్లేషణ అవసరం. డెరైక్షన్స్, అనాలజీస్, ర్యాంకింగ్, కోడింగ్-డీకోడింగ్,బ్లడ్ రిలేషన్స్, వెన్‌డయాగ్రమ్స్ తదితరాలాధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అడిగే ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటాయి. కాబట్టి ప్రశ్నను సరిగ్గా అవగాహన చేసుకుంటే సులభంగానే సమాధానాన్ని గుర్తించవచ్చు.
ఇంగ్లిష్:
ఎంపికైన అభ్యర్థులు విధుల్లో భాగంగా ఇంగ్లిష్ భాషను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఆంగ్ల భాషలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ స్కోరింగ్ విభాగం కూడా ఇదే. అత్యధిక వెయిటేజీ ఈ విభాగానికే కేటాయించారు. అంటే ఫలితాల్లో ఇంగ్లిష్ నిర్ణయాత్మకంగా ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి. ఈ విభాగంలో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు, కామన్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, యాంటోనిమ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
వొకాబ్యులరీని మెరుగుపరుచుకోవడం, రోజూ ఇంగ్లిష్ దిన పత్రికలను చదవడంతో ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు. రోజూ ఆంగ్ల దినపత్రికలు చదవడం జనరల్ అవేర్‌నెస్ పరంగా కూడా ఉపకరిస్తుంది. అంతేకాకుండా రైటింగ్ సామర్థ్యాలను కూడా పరీక్షిస్తారు. కాబట్టి ఆ దిశగా కూడా ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరం.
జనరల్ అవేర్‌నెస్:
జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమకాలీనంగా చోటు చేసుకుంటున్న అంశాలను నిశితంగా పరిశీలించాలి. అదే సమయంలో చరిత్ర, జనరల్ సైన్స్, ఆర్థిక రంగం, జాగ్రఫీ, పాలిటీ, శాస్త్ర పరిశోధనలు, స్టాండర్డ్ జీకే నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థులందరూ కనీసం 15 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 25 నుంచి 30 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.
నైపుణ్య పరీక్ష:
నైపుణ్య పరీక్షలో భాగంగా స్టెనోగ్రిఫీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల టైపింగ్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ముందుగా అభ్యర్థులకు 10 నిమిషాలపాటు ఒక అంశాన్ని ఇంగ్లిష్/హిందీలో డిక్టేట్ (వింటూ రాయడం) చేస్తారు. అయితే కేటగిరీల వారీగా నిర్దేశించిన విధంగా అభ్యర్థులు సదరు అంశాన్ని రాయాలి. ఈ క్రమంలో గ్రేడ్-సి అభ్యర్థులు నిమిషానికి 100 పదాల వేగంతో, గ్రేడ్-డి అభ్యర్థులు నిమిషానికి 80 పదాల వేగంతో పూర్తి చేయాలి. ఈ విధంగా పూర్తి చేసిన అంశాన్ని కంప్యూటర్‌లో టైప్ చేయాలి. ఈ క్రమంలో గ్రేడ్-సి అభ్యర్థులు ఇంగ్లిష్‌లో 40 నిమిషాల్లో, హిందీ భాషను ఎంచుకుంటే 50 నిమిషాల్లో, గ్రేడ్-డి అభ్యర్థులు ఇంగ్లిష్‌లోనైతే 50 నిమిషాల్లో, హిందీ భాషను ఎంచుకుంటే 65 నిమిషాల్లో పూర్తి చేయాలి.
రిఫరెన్స్ బుక్స్:
- క్వికర్ మ్యాథ్స్: ఎం. థైరా
- ఆబ్జెక్టివ్ మ్యాథ్స్: ఆర్‌ఎస్ అగర్వాల్
- రీజనింగ్: ఆర్‌ఎస్ అగర్వాల్, కిరణ్ ప్రకాషణ్
- ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్: ఎస్ చాంద్ పబ్లికేషన్స్,
వర్డ్ పవర్ మేడ్ ఈజీ
- జీకే: మనోరమ ఇయర్‌బుక్, అరిహంత్ పబ్లికేషన్స్,
ప్రతియోగితా దర్పణ్
నోటిఫికేషన్ సమాచారం:
- అర్హత: 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
- వయసు: 18 నుంచి 27 ఏళ్లు (ఆగస్టు 1, 2014 నాటికి). నిర్దేశిత అభ్యర్థులకు నిబంధనల మేరకు వయో సడలింపునిస్తారు.
- ఫీజు: రూ. 100 (నిర్దేశిత అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు).
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్.
- దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 27, 2014.
- రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 14, 2014.
వివరాలకు: http://ssc.nic.in
ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్
Published Thu, Jun 19 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM
Advertisement