ఆన్‌లైన్ పరీక్ష ఎందుకు? | Online testing for a long time! | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ పరీక్ష ఎందుకు?

Published Thu, Aug 7 2014 2:56 AM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

ఆన్‌లైన్ పరీక్ష ఎందుకు? - Sakshi

ఆన్‌లైన్ పరీక్ష ఎందుకు?

పరీక్షల నిర్వాహకులు ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష విధానం వైపు మొగ్గు చూపడానికి కారణాలు..


  1.పరీక్ష నిర్వహణ ఖర్చు తగ్గుతుంది:
 ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. ఉదాహరణకు ఒక జాతీయ స్థాయి పరీక్షను నిర్వహించాలంటే దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రశ్నపత్రాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షల వల్ల ఇలాంటి అవసరం ఉండదు.
 
 2.భద్రత:
 ప్రశ్నపత్రాల ముద్రణ సమయంలో లేదంటే వాటిని పరీక్ష కేంద్రాలకు చేరవేసేటప్పుడు లీక్ చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆన్‌లైన్ విధానం వల్ల ఇలాంటి లీక్‌లకు కళ్లెం వేయొచ్చు. అవసరమనుకుంటే చివరి నిమిషంలో కూడా ప్రశ్నలు మార్చడానికి వీలుంటుంది. కరెంటు పోయినా, ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడినా డేటాకు నష్టం ఉండదు. మొత్తంమీద భద్రతకు, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పరీక్షను నిర్వహించవచ్చు.
 
 3.అభ్యర్థులకు అనువుగా:
 నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న తేదీలో, సమయంలో పరీక్ష రాసే స్వేచ్ఛ ఉంటుంది. ఉ్ఠ్చఝ ౌ్ట ఆౌౌజుజీజ ద్వారా ఈ సౌకర్యం పొందొచ్చు.
 
 4.తేలిగ్గా మూల్యాంకనం:
 పేపర్-పెన్సిల్ విధానంలో పేపర్లను దిద్దడం, మార్కులను సంగ్రహపరచడం.. ఇదంతా జరిగి, ఫలితాలు వెల్లడించడానికి చాలా సమయం తీసుకుంటుంది. అదే ఆన్‌లైన్ పరీక్ష అయితే ఒక్క క్లిక్‌తో అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసిపోతుంది. చాలా త్వరగా ఫలితాల వెల్లడికి వీలుంటుంది.
 
 5.పచ్చని పరీక్ష:
 కాగితాలను కలప గుజ్జుతో తయారు చేస్తారు. సాధారణంగా ఓ చెట్టు నుంచి 17 రీమ్‌ల కాగితాలను తయారు చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షల విధానం వల్ల కాగితాల వాడకం తగ్గి, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది.
 
 ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు:
 ఏదైనా ఓ పోటీ పరీక్షకు ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేసేవారు. ఆన్‌లైన్ ఆధారిత పరీక్ష విధానం రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ఆయా పరీక్షలకు సంబంధించి మోడల్ పేపర్ల స్థానంలో ఇప్పుడు ‘ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్’ వచ్చి చేరింది. శిక్షణ సంస్థలు.. తమ అభ్యర్థులకు వీటిని అందుబాటులో ఉంచుతున్నాయి. ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల వాస్తవ పరీక్ష విధానానికి అలవాటుపడొచ్చు. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.
 
 నెట్ తోడుగా ప్రాక్టీస్:
 ఆన్‌లైన్ పరీక్షలకు అలవాటుపడేందుకు, పరిజ్ఞానం సంపాదించుకునేందుకు ఉపయోగపడే మరో మార్గం.. ఇంటర్నెట్. ఉద్యోగ నియామక పరీక్షలు, ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇప్పుడు అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్‌లైన్ పరీక్షలను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు akshieducation.comలో బ్యాంకు పరీక్షలు, గ్రూప్స్ తదితర పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ,
 
  బ్యాంకింగ్ అవేర్‌నెస్‌కు ప్రాక్టీస్ పరీక్షలు ఉన్నాయి. వీటిని రాయాలంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వీలున్నప్పుడు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల సహాయంతో లాగిన్ అయి ఈ పరీక్షలు రాయొచ్చు.వివిధ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పరీక్షలు రాసిన తర్వాత వచ్చిన స్కోర్, తప్పుగా సమాధానం గుర్తించిన ప్రశ్నలు-వాటికి సరైన సమాధానాలు, వివరణ ఇలా వివిధ అంశాలు ఒక్క క్లిక్‌తో తెరపై ప్రత్యక్ష మవుతాయి.కొంత మొత్తాన్ని వసూలు చేసి, ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్న వెబ్‌సైట్లు ఉన్నా యి. వీటిలో ప్రతి ప్రశ్న కింద ‘వ్యూ ఆన్సర్’; ‘వర్క్‌స్పేస్’; ‘రిపోర్ట్’; డిస్కస్ ఇన్ ఫోరమ్ (ఇందులో వివరణతో పాటు అదనపు సమాచారం తెలుసుకునేందుకు లింక్ కూడా ఇస్తున్నాయి).
 
 ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్న కొన్ని పరీక్షలు:
 కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)
 గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్
 ఎస్‌బీఐ ఉద్యోగ నియామక పరీక్షలు
 మ్యాట్, సీమ్యాట్ వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్షలు
 జేఈఈ మెయిన్, బిట్‌శాట్ తదితర పరీక్షలు.
 
 నిపుణుల మాట అభ్యర్థులకు సూచనలు..
 ఆన్‌లైన్ పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. తొలుత ఆయా పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా పరీక్షలు రాయాలి. మొత్తం సిలబస్ చదవడం పూర్తయ్యాక గ్రాండ్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి.ఆన్‌లైన్ మాక్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా పరీక్ష విధానానికి అలవాటుపడటంతో పాటు టైం మేనేజ్‌మెంట్ అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. ప్రిపరేషన్ పరంగా బలాలు-బలహీనతలు తెలుస్తాయి.  ఆన్‌లైన్ మాక్ పరీక్ష రాసిన తర్వాత పేపర్, కీను డౌన్‌లోడ్ చేసుకొని సమీక్షించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే సంబంధిత సబ్జెక్టు నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి.
 
  కొన్ని శిక్షణ సంస్థలకు దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో బ్రాంచ్‌లుంటాయి. వీటిలోని అభ్యర్థులందరికీ ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లను నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నాయి. దీనివల్ల అభ్యర్థులు తమ స్థాయిని అంచనా వేసుకొని, తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు.వాస్తవ ఆన్‌లైన్ పరీక్ష రాసేముందు సిస్టమ్‌కు సం బంధించి ఎలాంటి టెక్నికల్ సమస్యలున్నా వెంటనే పరీక్ష కేంద్రం సమన్వయకర్త దృష్టికి తీసుకెళ్లాలి. చాలా ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు రాశాం కాబట్టి, మళ్లీ వాస్తవ పరీక్ష సమయంలో నిబంధనలు (ఐట్టటఠఛ్టిజీౌట) చదవనవసరం లేదన్న భావనతో కొందరు నేరుగా పరీక్ష రాయడం ప్రారంభిస్తారు. ఇది సరికాదు. తప్పనిసరిగా ముందు నిబంధనలన్నీ చదవాలి. తొలుత బాగా తెలిసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుర్తించాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, ఒత్తిడికి తావులేకుండా మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలరు.
 
 ఐబీపీఎస్-ఆన్‌లైన్ పరీక్ష
  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్).. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకుల్లో క్లరికల్, ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇది ఆన్‌లైన్ పరీక్షపై అవగాహన పెంపొందించుకునేందుకు వీలుగా ప్రాక్టీస్ ఆన్‌లైన్ మాక్ టెస్ట్ లింక్‌ను www.ibps.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రోల్ నెం, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి పరీక్ష రాయొచ్చు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement