online test
-
గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి మంజూరు చేయడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. 2019 జూలై – అక్టోబర్ మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం భారీగా నియామక ప్రక్రియ నిర్వహించింది. అప్పట్లో మిగిలిపోయిన ఉద్యోగాలకు 2020 జనవరిలోనే రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసి, కరోనా సమయంలో కూడా ఆ ఏడాది సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తోంది. గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. అయితే, గత రెండు విడతల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆఫ్‌లైన్ (ఓఎమ్మార్ షీట్– పేపర్, పెన్ను) విధానంలో నిర్వహించగా.. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో నిర్వహణకు పంచాయతీ రాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. మూడో విడతలో పలు మార్పులు – గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 20 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కేటగిరి ఉద్యోగాలు మినహా మిగిలిన 19 కేటగిరి ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు. – తొలి, రెండో విడతల నోటిఫికేషన్ల సమయంలో ఈ 19 కేటగిరి ఉద్యోగాల భర్తీకి 14 రకాల రాత పరీక్షల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారు. గ్రేడ్ – 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు ఉమ్మడిగా మరో రాత పరీక్ష నిర్వహించారు. మిగిలిన 12 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 12 రకాల రాత పరీక్షలు నిర్వహించారు. – ప్రస్తుతం మూడో విడతలో 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు, గ్రేడ్ – 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు కూడా వేర్వేరుగా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్‌లో.. ఆయా కేటగిరి ఉద్యోగాల్లో తక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా.. మరో కేటగిరి ఉద్యోగ ఖాళీల గురించి వాటి భర్తీని ఆలస్యం చేసే అవకాశం లేకుండా ఒక్కొక్క దానికి వేరుగా పరీక్షల నిర్వహణ మంచిదని అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. 8 లక్షల దరఖాస్తులు అంచనా.. – వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి మంజూరు చేసిన అనంతరం మొదటిసారి ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు.. అప్పట్లో రికార్డు స్థాయిలో 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో జరిగిన రాత పరీక్షలకు 19 లక్షల మందికి పైగా హాజరయ్యారు. – మొదటి విడత నోటిఫికేషన్లో గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా నిర్వహించిన రాత పరీక్షలకు ఏకంగా 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. – 2020 రెండో విడత జారీ చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్‌కు కూడా దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు 7.69 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. – ప్రస్తుతం మూడో విడత జారీ చేసే నోటిఫికేషన్‌కు సంబంధించి దాదాపు 8 లక్షల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. – మూడో విడత ఆన్లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించినా, ఒక్కో విడతకు 40 వేల మంది దాకా పరీక్షలు రాసే వసతులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే కొన్ని కేటగిరి ఉద్యోగాలకు ఒకే రోజు ఉదయం, సాయంత్రం వేర్వేరు çపరీక్షలు జరపడం ద్వారా 20 రోజుల్లో పరీక్షల ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. మొదటి విడత నోటిఫికేషన్ సమయంలో తొమ్మిది రోజులు, రెండో విడత ఏడు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించామని అధికారులు చెప్పారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖతో పాటు వివిధ శాఖలు ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేశాయి. కేటగిరీల వారీగా ఉద్యోగాలకు సంబంధించి ఆయా శాఖలు రోస్టర్– రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలకు తుది రూపు ఇస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ముగియగానే, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. -
అగ్రికల్చర్ టెస్టుకూ అదే ఉత్సాహం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు రెండో రోజూ విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సాక్షి మీడియా గ్రూప్, నారాయణ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు శివారు వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆన్లైన్ మాక్ ఎంసెట్ అగ్రికల్చర్ కంప్యూటర్ పరీక్షను నిర్వహించారు. వివిధ జూనియర్ కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీఈఏపీ సెట్ ఆన్లైన్ పరీక్షా విధానంపై విద్యార్థులకు అవగాహన కలిగేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ప్రశ్నల సరళి కూడా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల వారీగా సిలబస్‌కు దగ్గరగా ఏపీఈఏపీ సెట్ తరహాలో ఇచ్చారు. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను పూరించడంతోపాటు తమలోని సబ్జెక్టు సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, ఏ స్థాయిలో ర్యాంకు సాధించగలమో తెలుసుకునేందుకు ఈ టెస్టు ఉపయోగపడిందని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యే విధానాలపై అవగాహన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీఈఏపీసెట్ ఎలా జరుగుతుందోనన్న అనుమానాలు పటాపంచలయ్యాయని సంతోషంగా చెప్పారు. సాక్షి మీడియా గ్రూపునకు కృతజ్ఞతలు తెలిపారు. సిలబస్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి మాక్ ఎంసెట్ అగ్రి కల్చర్ టెస్టులో బైపీసీ విభాగం నుంచి అధికంగా మేము చదివిన అంశాల నుంచి ప్రశ్నలు ఉన్నాయి. మాక్ టెస్టు కేవలం ప్రాక్టీసు కోసమే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంది. ఏపీఈఏపీ సెట్‌కు హాజరయ్యేందుకు ఎంతో ప్రయోజనం చేకూరింది. ‘సాక్షి’ కృషి ఎంతో బాగుంది. – పి.కావ్యశ్రీ, విద్యార్థిని ఆన్లైన్ టెస్ట్‌కు హాజరుకావడం ఇదే తొలిసారి ఆన్లైన్లో పరీక్షకు హాజరు కావడం ఇదే తొలిసారి. సాక్షి మాక్ ఎంసెట్ ఆన్లైన్ నిర్వహణ ఎంతో బాగుంది. ఏపీఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించడంలో మాక్టెస్టు ఒక ప్రాక్టీసులా ఉపయోగపడింది. ఈ సెట్‌తోపాటు నీట్ పరీక్షకు హాజరు కానున్నాను. – షేక్ షాయిస్తా, విద్యార్థిని ఆన్లైన్ టెస్టుపై ఆందోళన తొలగింది ఆన్లైన్ టెస్టుపై ఇప్పటి వరకు సరైన అవగాహన లేకపోవడంతో కొంచెం ఆందోళనగా ఉండేది. సాక్షి మాక్ ఎంసెట్ ఆన్లైన్ టెస్టుతో ఆ టెన్షన్ మాయమైంది. ఈ పరీక్షతో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఇది మంచి ప్రాక్టీసు పరీక్షలా ఉపయోగడుతుంది. థాంక్యూ ‘సాక్షి’ – పి.సరయు, విద్యార్థిని ప్రశ్నల సరళి భేష్ ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు చేసిన ఏర్పాట్లు ప్రభుత్వం జరిపే ఏపీ ఈఏపీ సెట్‌ను తలపించాయి. కచ్చితమైన సమయాన్ని కేటాయించడంతోపాటు సమయపాలన పాటించారు. ప్రశ్నల సరళిని పరిశీలిస్తే కాలేజీలో లెక్చరర్లు చెప్పిన అంశాలు వీటిలో ఉన్నాయి. చాలా బాగుంది. – పి.గిరిజ, విద్యార్థిని -
పరీక్ష పాసైతేనే కంపెనీకి డైరెక్టర్
న్యూఢిల్లీ: కార్పొరేట్ పరిపాలనను పారదర్శకంగా మార్చేందుకు, కార్పొరేట్ కంపెనీల్లో అక్రమాలు, మోసాలకు చెక్ పెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కారు త్వరలోనే చర్యలు చేపట్టనుంది. దేశ కార్పొరేట్ రంగంలో గతేడాది ఐఎల్ఎఫ్ఎస్ రుణ చెల్లింపుల్లో విఫలం కావడం లిక్విడిటీని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ గ్రూపు ప్రమోటర్ల మోసాలు ఒక్కొక్కటీ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ ఏకంగా రూ.13,000 కోట్లకుపైగా మోసగించాడు. ఇవన్నీ చూశాక... కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను కేంద్రం మరింత కఠినతరం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా కంపెనీల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా చేరాలనుకునే వారు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పెట్టే పరీక్ష పాస్ కావాల్సి ఉంటుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఐఎల్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఖాతాల్లో అక్రమాల సమాచారాన్ని రిపోర్ట్ చేయనందుకు, ఆ కంపెనీకి ఆడిటింగ్ సేవలందించిన డెలాయిట్ హస్కిన్స్, బీఎస్ఆర్ అసోసియేట్స్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధించాలని ఇప్పటికే కార్పొరేట్ శాఖ ఎన్సీఎల్టీ ముందు పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం గమనార్హం. కంపెనీల్లో మోసాలు, సంక్షోభాలకు సంబంధించిన సంకేతాలను అవి బయటపడటానికి ముందే బోర్డుల్లో ఉన్న స్వతంత్ర డైరెక్టర్లు గుర్తించగలరనేది పరిశీలకుల భావన. ‘‘ఇండిపెండెంట్ డైరెక్టర్లకు ఎటువంటి ధర్మకర్త బాధ్యతలు లేవన్న అపోహను తొలగించాలనుకుంటున్నాం. కార్పొరేట్ విషయాల గురించి తెలియజేయడంతోపాటు, తమ విధులు, పాత్ర, బాధ్యతల గురించి వారిలో అవగాహన ఉండేలా చేయనున్నాం’’ అని ఇంజేటి శ్రీనివాస్ ఈ సందర్భంగా వివరించారు. ఆన్లైన్లో పరీక్ష... ‘‘భారతీయ కంపెనీల చట్టం, విలువలు, క్యాపిటల్ మార్కెట్ నిబంధనలు తదితర అంశాలను పరీక్షించేలా ఆన్లైన్ మదింపు ఉంటుంది. డైరెక్టర్లు కావాలనే ఆసక్తి ఉన్న వారు నిర్ణీత కాలవ్యవధిలోపు పరీక్షను పాస్ కావాల్సి ఉంటుంది. పరిమితి లేకుండా ఒకరు ఎన్ని సార్లయినా పరీక్ష రాసేందుకు అనుమతిస్తాం’’ అని శ్రీనివాస్ తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా సేవలందిస్తున్న అనుభవజ్ఞులకు మాత్రం ఆన్లైన్ పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పారు. అయితే, అటువంటి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే డేటాబేస్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కంపెనీలకు, ఇండిపెండెంట్ డైరెక్టర్లకు ఇది వారధిగా ఉంటుందని, ఇండిపెండెంట్ డైరెక్టర్ల కోసం చూసే కంపెనీలు తమతో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారిని ఈ వేదికగా కలుసుకోవచ్చని శ్రీనివాస్ తెలిపారు. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రపై ప్రశ్నలు కంపెనీల చట్టం ప్రకారం ప్రతీ లిస్టెడ్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్లను బోర్డులో నియమించుకోవాల్సి ఉంటుంది. బోర్డు మొత్తం సభ్యుల్లో కనీసం మూడింట ఒక వంతు వీరు ఉండాలి. ఆయా కంపెనీలకు పర్యవేక్షకులుగా వ్యవహరించడంతో పాటు, మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షకులుగా వ్యవహరించడమనేది వీరి బాధ్యత. -
నేటి నుంచి ఆన్లైన్ ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొదటిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి 7వ తేదీ వరకు (నీట్ ఉన్నందున 6వ తేదీ మినహా) పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 2,21,064 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాల్లోని 18 జోన్ల పరిధిలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2, 3 తేదీల్లో 75 కేంద్రాల్లో అగ్రికల్చర్ పరీక్ష... 4, 5, 7 తేదీల్లో 83 కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్ పరీక్షలకు 73,106 మంది, ఇంజనీరింగ్ పరీక్షకు 1,47,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు పరీక్ష తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్లో 25 వేల మంది వరకు విద్యార్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉదయం సెషన్ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. ఆన్లైన్ ఎంసెట్ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేస్తున్నామని, నిర్ధారిత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. పరీక్షా సమయం కంటే రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఈసారి కొత్తగా నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఏపీ నుంచి 29,356 మంది ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 29,356 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ పరీక్షకు 21,369 మంది, అగ్రికల్చర్ పరీక్షకు 7,987 మంది ఉన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే ‘కీ’లు ఐదు రోజుల పాటు ఆన్లైన్ పరీక్షలు జరుగుతున్నందున అన్ని పరీక్షలు పూర్తయ్యాక ప్రాథమిక ‘కీ’లను విడుదల చేసేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసే 7వ తేదీ రాత్రి లేదా 8న ‘కీ’లను విడుదల చేయనుంది. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ప్రశ్నపత్రం ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు. అందువల్ల ‘కీ’లను విడుదల చేసే సమయంలో.. సంబంధిత కోడ్ ప్రశ్నపత్రం, ‘కీ’ రెండింటినీ విడుదల చేస్తారు. ఇక ప్రాథమిక ‘కీ’లపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మొత్తంగా ఈనెల 15వ తేదీ నాటికి ఫలితాలను, ర్యాంకులను ప్రకటించేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు సూచనలివీ.. – విద్యార్థులు హాల్‌టికెట్, బ్లూ లేదా బ్లాక్‌బాల్ పాయింట్ పెన్, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఫారాన్ని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి. ఈ దరఖాస్తు ఫారంపై ఫొటో అంటించి.. సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేయించి తేవాలి. – ఆన్లైన్లో దరఖాస్తు చేసిన సమయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రం నంబర్ నమోదు చేయకపోతే.. ఇప్పుడు అటెస్టేషన్ చేయించిన కుల ధ్రువీకరణ పత్రం కాపీలను వెంట తెచ్చుకోవాలి. – లాగ్ బుక్స్, టేబుల్స్, కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ఫోన్లు వంటి ఏ ఎలక్ట్రానిక్ పరికరాలనూ పరీక్షా కేంద్రంలోకి తీసుకురావొద్దు. అలా తీసుకువస్తే మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేస్తారు. పరీక్ష రాసేముందు జాగ్రత్తలివీ.. – ఆన్లైన్ పరీక్ష అయినందున విద్యార్థులు సూచనలన్నింటినీ పూర్తిగా చదివాకే సమాధానాలు నమోదు చేయడం మొదలుపెట్టాలి. – అందులో పేర్కొన్న సూచనల మేరకు ఆన్లైన్లో జవాబులను గుర్తించి టిక్ చేయాలి. – జవాబు నమోదు చేసేందుకు ‘చూసెన్’ ఆప్షన్ బటన్ క్లిక్ చేయాలి. జవాబును మార్చాలంటే ‘అనదర్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. – ఎంపిక చేసిన జవాబు వద్దనుకుంటే ‘క్లియర్ రెస్పాన్స్’ బటన్ క్లిక్ చేయాలి. – జవాబును సేవ్ చేసి.. మరో ప్రశ్నకు వెళ్లేందుకు ‘సేవ్ అండ్ నెక్ట్స్’ బటన్‌ను క్లిక్ చేయాలి. – 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 180 నిమిషాల సమయం ఇస్తారు. తప్పు జవాబులు రాస్తే నెగెటివ్ మార్కులు ఉండవు. – కంప్యూటర్ స్క్రీన్‌పై కుడి భాగంలో కౌంట్‌డౌన్ టైమర్ ఉంటుంది. సమయం గడుస్తున్నకొద్దీ.. ఇంకా మిగిలిన సమయాన్ని సూచిస్తుంది. అది సున్నాకు వచ్చిందంటే పరీక్ష ముగిసినట్టే. -
ఆచార్యులకు అడ్డగోలు ‘పరీక్ష’!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: యూజీసీ నిబంధనలు, రోస్టర్ పాయింట్లు, యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థుల ఆందోళన ఉధృతమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షపై ఇప్పటికే కొంతమంది కోర్టులను ఆశ్రయించగా మరికొంతమంది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. అసంబద్ధ పద్ధతి అంటున్న అభ్యర్థులు రాష్ట్రంలో మొత్తం 13 యూనివర్సిటీల్లో 1190 ఖాళీలకు డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో వర్సిటీల్లో నియామకాలన్నీ యూజీసీ నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ విధానంలో జరిగేవి. అయితే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ అసెంబ్లీలో హడావుడిగా తీర్మానం చేసింది. ఈ మేరకు అభ్యర్థులకు ఈ నెల 9 నుంచి 13 వరకు ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఇందులో ఇచ్చిన ప్రశ్నపత్రాలు చూసిన అభ్యర్థులు.. ఆన్లైన్ ద్వారా అధ్యాపకులను ఎంపిక చేయడాన్ని అసంబద్ధమైన పద్ధతిగా తేల్చిచెబుతున్నారు. అనేక తప్పుల తడకలతో, సిలబస్‌ను అతిక్రమించి ప్రశ్నపత్రాన్ని క్లిష్టంగా రూపొందించారని అంటున్నారు. భాషా సబ్జెక్టుల అభ్యర్థులకు తీవ్రనష్టం ఆన్లైన్ పరీక్షలో భాషా సబ్జెక్టులు కూడా ఉన్నాయి. తెలుగు, సంస్కృతం, హిందీతోపాటు తమిళం, కన్నడం భాషా సబ్జెక్టుల అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి పేపర్‌కు సంబంధించి ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నపత్రం ఇచ్చారు. వాస్తవానికి ఇంగ్లిష్‌తోపాటు మాతృభాషలో కూడా పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలి. తెలుగు సహాయ ఆచార్యుడి ఉద్యోగానికి ఆంగ్లంలో పరీక్ష నిర్వహించడమేమిటన్న ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో కూడా ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తుంటే ఇక్కడ ఒక్క ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రం ఇవ్వడంతో తాము నష్టపోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. లైఫ్ సైన్సెస్‌కు జరిగిన స్క్రీనింగ్ టెస్టులో సుమారు పది సబ్జెక్టు (బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మెరైన్ సైన్సెస్ తదితర)లకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారు. ఏ సబ్జెక్టుకు అనుగుణంగా ఆయా సబ్జెక్టు ప్రశ్నలు ఇవ్వాల్సి ఉండగా, అన్నింటికీ కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రం రూపకల్పన సరిగా లేదు సాధారణంగా 50 నుంచి 60 శాతం ప్రశ్నలను అందరూ రాసే విధంగా, మిగిలిన 40 శాతం ప్రశ్నలను కొంత కఠినంగా ఇస్తుంటారు. కానీ ఏపీపీఎస్సీ ఇచ్చిన ప్రశ్నపత్రం సివిల్స్ ప్రశ్నపత్రం కంటే కఠినంగా, కేవలం వడపోతే లక్ష్యంగా ఉన్నట్టు ఉంది. అదేవిధంగా పరీక్షలకు కనీసం 40 రోజుల గడువును ఇవ్వాలనే విషయాన్ని మరిచి పరీక్ష నిర్వహించారు. ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కల్పించే విధంగా మాక్ టెస్ట్‌లు నిర్వహించలేదు. –డాక్టర్ ఎం.వి. మణివర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఏయూ లోపభూయిష్టంగా పరీక్ష నిర్వహణ నెగెటివ్ మార్కులు పెట్టడంతో అధిక శాతం మంది అర్హత సాధించలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ పరీక్షకు సైతం నెగెటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లాయి. వీటికి ఏ విధంగా న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది. పరీక్ష నిర్వహణ మొత్తం లోపభూయిష్టంగా ఉంది. –ఆరేటి మహేశ్, పరిశోధకులు, ఆంధ్రా విశ్వవిద్యాలయం పరీక్ష రద్దు చేయాలని గవర్నర్‌కు వినతి ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డాక్టరేట్స్, రీసెర్చ్ స్కాలర్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుళ్లి చంద్రశేఖర్ యాదవ్ శనివారం గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. విశాఖ విచ్చేసిన గవర్నర్‌ను శనివారం సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో కలిసి వినతిపత్రం అందించారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ నిరంకుశంగా పరీక్ష నిర్వహించడం అన్యాయమన్నారు. హైకోర్టులో కేసులు ఉండగా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రవేశపరీక్షలన్నీ ఇక ఆన్లైన్లోనే..
ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం చేపడుతున్న ఎంసెట్ సహ వివిధ ప్రవేశపరీక్షలను వచ్చే ఏడాదినుంచి ఆన్లైన్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు సెట్ల వారీగా ఏర్పాటైన నిపుణుల కమిటీలతో రాష్ట్ర మానవవనరుల అభివద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశపు చర్చల్లోని ప్రతిపాదనలను అనుసరించి ఉన్నత విద్యామండలి తదుపరి చర్యలు చేపట్టనుంది. సెట్ల నోటిఫికేషన్లు డిసెంబర్ నాటికి వెలువడాల్సి ఉన్నందున ఆలోగానే ముందస్తు ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఆయా సెట్లకు గరిష్ఠంగా హాజరవుతున్న అభ్యర్ధుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని ముందుగా కంప్యూటర్ కేంద్రాలను గుర్తించాల్సి ఉంటుంది. కంప్యూటరాధారిత పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు తగినన్ని అందుబాటులో లేవు. ఎంసెట్‌కు గత ఏడాదిలో దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేయగా పరీక్షకు హాజరైన వారి సంఖ్య 1.80 లక్షల వరకు మాత్రమే ఉంది. దరఖాస్తుల సంఖ్యను అనుసరించి కాకుండా వాస్తవంగా పరీక్షకు వస్తున్న వారెంతమందో అంచనా వేసి ఆమేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నారు. శుక్ర వారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. మండలి పరిధిలో ఏటా 8 సెట్లు ఉన్నత విద్యామండలి ఏటా బీటెక్, బీఫార్మసీ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, ఫార్మా డీ కోర్సులకు ఎంసెట్, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లోకి డిప్లొమో అభ్యర్ధుల ప్రవేశానికి ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు ఐసెట్, బీఈడీ ప్రవేశానికి ఎడ్‌సెట్, లా కోర్సుల్లో ప్రవేశానికి లాసెట్, ఎల్ఎల్ఎం కోర్సుకు పీజీఎల్‌సెట్, బీపీఈఈ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి పీఈసెట్, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా డీకోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్‌లను నిర్వహిస్తోంది. ఎంసెట్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి వచ్చే ఏడాదినుంచి జాతీయస్థాయిలో నీట్‌ను తప్పనిసరి చేస్తున్నందున ఇక మెడికల్ ఎంట్రన్సు టెస్టులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అవకాశాల్లేవు. కేవలం ఇంజనీరింగ్ ప్రవేశాల వరకు మాత్రమే ఆన్లైన్లో నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఆదరణ క్రమేణా తగ్గిపోతున్న బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు అతితక్కువ మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీటిని కూడా ఆన్లైన్ పరీక్షలు పెట్టాలా, లేదా పాత పద్ధతిలోనే కొనసాగించాలా? అన్నది కమిటీల సమావేశంలో చర్చించనున్నారు. -
‘ఏఈఈ’ ఆన్లైన్ మాక్ టెస్టు
-
‘ఏఈఈ’ ఆన్లైన్ మాక్ టెస్టు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నిర్వహించనున్న ఆన్లైన్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు టీఎస్ పీఎస్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులే ఆన్లైన్లో మాక్ టెస్టు ద్వారా ప్రాక్టీస్ చేసుకునేలా ప్రత్యేక లింకును ఇచ్చింది. మంగళవారమే ఈ లింకును అందుబాటులోకి తెచ్చింది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (సీబీఆర్టీ) నిర్వహిస్తున్నందున అభ్యర్థులు పరీక్ష సమయంలో ఇబ్బందులు పడకుండా, ముందుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా ఈ చర్యలు చేపడుతున్నట్లు టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. ఆన్లైన్ పరీక్షలో ఏయే నిబంధనలు పాటించాలో ఈ మాక్ టెస్టులో కూడా అవన్నీ ఉంటాయని తెలిపారు. పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి.. బహుళ ఐశ్చిక సమాధానాలను ఎలా ఎంచుకోవాలి.. అన్న నిబంధనలు ఇందులో ఉంటాయని వివరించారు. ఇందులో ముందుగా ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్ష సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా బాగా పరీక్ష రాసేందుకు వీలవుతుందని తెలిపారు. అలాగే అభ్యర్థులు హాల్‌టికెట్లను తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో 99 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. అభ్యర్థులు కూడా పరీక్షకు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలని, తద్వారా పరీక్ష రోజున కేంద్రాన్ని వెతుక్కునేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ పరీక్ష మొత్తం ఇంగ్లిషు మీడియంలోనే ఉంటుందని తెలిపారు. 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుందని, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు పరీక్ష ఉంటుందని వివరించారు. ఉదయం పరీక్ష కోసం అభ్యర్థులు 8:30 గంటల నుంచి 9:15 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని, మధ్యాహ్నం పరీక్ష కోసం మధ్యాహ్నం 1:15 గంటల నుంచి 1:45 గంటల మధ్యలో పరీక్ష కేంద్రంలోకి కచ్చితంగా ఉండాలని తెలిపారు. -
ఆన్లైన్ పరీక్షలకు సాక్షి ప్రత్యేక వెబ్ పోర్టల్
హైదరాబాద్: ‘సాక్షి’ తెలుగు విద్యార్థుల మేలు కోసం మరో అడుగు ముందుకేసింది. ఆన్లైన్ పరీక్షలకు ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. ఇప్పటికే భవిత, విద్య, చుక్కాని, సిటీప్లస్, ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ, బుక్లెట్స్ ద్వారా లక్షలాది మంది అభిమానాన్ని సాక్షి చురగొన్నది. విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో సులువుగా సాధన చేసుకునేందుకుగాను ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్, డీఎస్సీ, వీఆర్వో, రైల్వే, ఆర్మీ, పోలీస్, ఎంసెట్, జేఈఈ, ఐసెట్, ఎస్ఎస్సీ వంటి దాదాపు 100కు పైగా పోటీ, అర్హత పరీక్షలకు ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్స్, లైవ్ టెస్ట్స్ అందుబాటులోకి తీసుకురానుంది. అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలతో కూడిన గ్రాండ్ టెస్ట్‌లు, లైవ్ టెస్ట్‌లు, రోజులో ఎప్పుడైనా, ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం సైట్లో ఉంది. -
ఆన్లైన్ పరీక్ష ఎందుకు?
పరీక్షల నిర్వాహకులు ఆన్లైన్ ఆధారిత పరీక్ష విధానం వైపు మొగ్గు చూపడానికి కారణాలు.. 1.పరీక్ష నిర్వహణ ఖర్చు తగ్గుతుంది: ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. ఉదాహరణకు ఒక జాతీయ స్థాయి పరీక్షను నిర్వహించాలంటే దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రశ్నపత్రాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పరీక్షల వల్ల ఇలాంటి అవసరం ఉండదు. 2.భద్రత: ప్రశ్నపత్రాల ముద్రణ సమయంలో లేదంటే వాటిని పరీక్ష కేంద్రాలకు చేరవేసేటప్పుడు లీక్ చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ విధానం వల్ల ఇలాంటి లీక్‌లకు కళ్లెం వేయొచ్చు. అవసరమనుకుంటే చివరి నిమిషంలో కూడా ప్రశ్నలు మార్చడానికి వీలుంటుంది. కరెంటు పోయినా, ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడినా డేటాకు నష్టం ఉండదు. మొత్తంమీద భద్రతకు, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పరీక్షను నిర్వహించవచ్చు. 3.అభ్యర్థులకు అనువుగా: నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉన్న తేదీలో, సమయంలో పరీక్ష రాసే స్వేచ్ఛ ఉంటుంది. ఉ్ఠ్చఝ ౌ్ట ఆౌౌజుజీజ ద్వారా ఈ సౌకర్యం పొందొచ్చు. 4.తేలిగ్గా మూల్యాంకనం: పేపర్-పెన్సిల్ విధానంలో పేపర్లను దిద్దడం, మార్కులను సంగ్రహపరచడం.. ఇదంతా జరిగి, ఫలితాలు వెల్లడించడానికి చాలా సమయం తీసుకుంటుంది. అదే ఆన్లైన్ పరీక్ష అయితే ఒక్క క్లిక్‌తో అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసిపోతుంది. చాలా త్వరగా ఫలితాల వెల్లడికి వీలుంటుంది. 5.పచ్చని పరీక్ష: కాగితాలను కలప గుజ్జుతో తయారు చేస్తారు. సాధారణంగా ఓ చెట్టు నుంచి 17 రీమ్‌ల కాగితాలను తయారు చేస్తారు. ఆన్లైన్ పరీక్షల విధానం వల్ల కాగితాల వాడకం తగ్గి, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు: ఏదైనా ఓ పోటీ పరీక్షకు ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేసేవారు. ఆన్లైన్ ఆధారిత పరీక్ష విధానం రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ఆయా పరీక్షలకు సంబంధించి మోడల్ పేపర్ల స్థానంలో ఇప్పుడు ‘ఆన్లైన్ టెస్ట్ సిరీస్’ వచ్చి చేరింది. శిక్షణ సంస్థలు.. తమ అభ్యర్థులకు వీటిని అందుబాటులో ఉంచుతున్నాయి. ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల వాస్తవ పరీక్ష విధానానికి అలవాటుపడొచ్చు. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది. నెట్ తోడుగా ప్రాక్టీస్: ఆన్లైన్ పరీక్షలకు అలవాటుపడేందుకు, పరిజ్ఞానం సంపాదించుకునేందుకు ఉపయోగపడే మరో మార్గం.. ఇంటర్నెట్. ఉద్యోగ నియామక పరీక్షలు, ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇప్పుడు అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్ పరీక్షలను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు akshieducation.comలో బ్యాంకు పరీక్షలు, గ్రూప్స్ తదితర పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్‌కు ప్రాక్టీస్ పరీక్షలు ఉన్నాయి. వీటిని రాయాలంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వీలున్నప్పుడు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ల సహాయంతో లాగిన్ అయి ఈ పరీక్షలు రాయొచ్చు.వివిధ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న ఆన్లైన్ పరీక్షలు రాసిన తర్వాత వచ్చిన స్కోర్, తప్పుగా సమాధానం గుర్తించిన ప్రశ్నలు-వాటికి సరైన సమాధానాలు, వివరణ ఇలా వివిధ అంశాలు ఒక్క క్లిక్‌తో తెరపై ప్రత్యక్ష మవుతాయి.కొంత మొత్తాన్ని వసూలు చేసి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్న వెబ్సైట్లు ఉన్నా యి. వీటిలో ప్రతి ప్రశ్న కింద ‘వ్యూ ఆన్సర్’; ‘వర్క్‌స్పేస్’; ‘రిపోర్ట్’; డిస్కస్ ఇన్ ఫోరమ్ (ఇందులో వివరణతో పాటు అదనపు సమాచారం తెలుసుకునేందుకు లింక్ కూడా ఇస్తున్నాయి). ఆన్లైన్ విధానంలో జరుగుతున్న కొన్ని పరీక్షలు: కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఎస్బీఐ ఉద్యోగ నియామక పరీక్షలు మ్యాట్, సీమ్యాట్ వంటి మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జేఈఈ మెయిన్, బిట్‌శాట్ తదితర పరీక్షలు. నిపుణుల మాట అభ్యర్థులకు సూచనలు.. ఆన్లైన్ పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. తొలుత ఆయా పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీగా పరీక్షలు రాయాలి. మొత్తం సిలబస్ చదవడం పూర్తయ్యాక గ్రాండ్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి.ఆన్లైన్ మాక్ పరీక్షలకు హాజరు కావడం ద్వారా పరీక్ష విధానానికి అలవాటుపడటంతో పాటు టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. ఎంత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతున్నారో తెలుస్తుంది. ప్రిపరేషన్ పరంగా బలాలు-బలహీనతలు తెలుస్తాయి. ఆన్లైన్ మాక్ పరీక్ష రాసిన తర్వాత పేపర్, కీను డౌన్లోడ్ చేసుకొని సమీక్షించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఏవైనా సందేహాలుంటే సంబంధిత సబ్జెక్టు నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. కొన్ని శిక్షణ సంస్థలకు దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో బ్రాంచ్లుంటాయి. వీటిలోని అభ్యర్థులందరికీ ఆన్లైన్ మాక్ టెస్ట్‌లను నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నాయి. దీనివల్ల అభ్యర్థులు తమ స్థాయిని అంచనా వేసుకొని, తదనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు.వాస్తవ ఆన్లైన్ పరీక్ష రాసేముందు సిస్టమ్‌కు సం బంధించి ఎలాంటి టెక్నికల్ సమస్యలున్నా వెంటనే పరీక్ష కేంద్రం సమన్వయకర్త దృష్టికి తీసుకెళ్లాలి. చాలా ఆన్లైన్ మాక్ టెస్ట్‌లు రాశాం కాబట్టి, మళ్లీ వాస్తవ పరీక్ష సమయంలో నిబంధనలు (ఐట్టటఠఛ్టిజీౌట) చదవనవసరం లేదన్న భావనతో కొందరు నేరుగా పరీక్ష రాయడం ప్రారంభిస్తారు. ఇది సరికాదు. తప్పనిసరిగా ముందు నిబంధనలన్నీ చదవాలి. తొలుత బాగా తెలిసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుర్తించాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, ఒత్తిడికి తావులేకుండా మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలరు. ఐబీపీఎస్-ఆన్లైన్ పరీక్ష ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్).. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకుల్లో క్లరికల్, ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇది ఆన్లైన్ పరీక్షపై అవగాహన పెంపొందించుకునేందుకు వీలుగా ప్రాక్టీస్ ఆన్లైన్ మాక్ టెస్ట్ లింక్‌ను www.ibps.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రోల్ నెం, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి పరీక్ష రాయొచ్చు. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గ్రేడ్-బి ఆఫీసర్ (జనరల్) పోస్టుల పరీక్ష, ప్రిపరేషన్ విధానాన్ని తెలపండి? - రజిత, బంజారాహిల్స్ సివిల్స్ ప్రిలిమ్స్‌లో పాలిటీ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి? వీటికి ఎలా సిద్ధమవ్వాలి? - సంధ్య, ఖైరతాబాద్ ఆర్బీఐ.. గ్రేడ్-బి ఆఫీసర్ (జనరల్) పోస్టులకు నిర్వహించే పరీక్ష రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో భాగంగా ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం మార్కులు 200. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వ్యవధి: 130 నిమిషాలు. ఇందులో నిర్దేశిత మార్కులను సాధించినవారిని రెండో దశ పరీక్షకు ఎంపిక చేస్తారు. జనరల్ అవేర్నెస్: ఇందులో సమకాలీన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, చరిత్ర, అర్థశాస్త్రం, భూగోళ శాస్త్రం, సామాన్య శాస్త్రం, ప్రణాళికలు, బడ్జెట్, రాజ్యాంగం, పన్ను విధానం, ఆర్థిక సర్వే సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే ప్రశ్నలు అధిక శాతం ఆర్థిక అంశాలపైనే ఉంటాయి. కాబట్టి సిలబస్‌లోని ఆర్థిక అంశాలను సమకాలీన సంఘటనలతో సమన్వయం చేసుకుంటూ విశ్లేషణాత్మక ప్రిపరేషన్ కొనసాగించాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఇందులో సంప్రదాయ ప్రశ్నలు కాకుండా డేటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి లీనియర్ ఈక్వేషన్స్, శాతాలు, లాభనష్టాలు, కాలం-దూరం- వేగం-పని, జామెట్రీ, వెన్ డయాగ్రమ్స్ వంటివాటిని ప్రాధాన్యతా క్రమంలో ప్రిపేర్ కావాలి. ఈ క్రమంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఆల్జీబ్రా, త్రికోణమితి, వైశ్లేషిక రేఖా గణితం, రేఖా గణితం, మెన్సురేషన్ వంటి అంశాల్లోని ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఎక్కువగా కాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలను సాధించే విధంగా షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువగా సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్: అభ్యర్థిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం ఇది. ఇందులో స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, ఇన్పుట్- అవుట్‌పుట్ రిలేషన్స్, కేలండర్స్, క్లాక్స్, డెరైక్షన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా నంబర్స్, ఆల్ఫాబెట్స్, వర్డ్ ఇమేజెస్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. డిస్క్రిప్టివ్ పేపర్: ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్-1 ఇంగ్లిష్, పేపర్-2 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, పేపర్-3 ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. సమాధానాలను మూడు గంటల్లో రాయాలి. ఈ విభాగానికి సంబంధించి ఇంగ్లిష్ పేపర్లో ఎస్సే, ప్రిసీస్ రైటింగ్, కాంప్రహెన్షన్, బిజినెస్/ఆఫీస్ కరస్పాండెన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2, పేపర్-3లలో వచ్చే ప్రశ్నలు ఆయా అంశాలపై విస్తృత అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కేవలం అవగాహన పెంచుకోవడమే కాకుండా.. ఆ సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా ఏ విధంగా ప్రజెంట్ చేయాలో నేర్చుకోవాలి. ఈ విభాగానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలు రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని అనుసరిస్తూ ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి? వాటికి సమకాలీనంగా ఎటువంటి ప్రాధాన్యత ఉంది? వంటి అంశాలను బేరీజు వేసుకుంటూ విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగించాలి. రిఫరెన్స్ బుక్స్: ఎన్సీఈఆర్టీ 6 నుంచి 12వ తరగతి పాఠ్యపుస్తకాలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ - ఆర్ఎస్ అగర్వాల్ ఇండియా ఇయర్‌బుక్ ప్రతియోగితా దర్పణ్ ఇంగ్లిష్ - జీఆర్ఈ బారెన్స్ ఆర్బీఐ గ్రేడ్-బి ఆఫీసర్స్ ఎగ్జామ్ - ఉపకార్ పబ్లికేషన్స్ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లో పాలిటీ మిగతావాటి కంటే భిన్నమైంది. సిలబస్‌లోని ప్రతి అంశం సమకాలీన సంఘటనలతో ముడిపడి ఉంటుంది. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, హక్కుల సమస్యలు మొదలైన అంశాలను సిలబస్‌లో ప్రస్తావించారు. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకున్నప్పుడు సిలబస్ పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రశ్నలు కూడా వీటిపైనే ఉంటాయి. అందువల్ల సమకాలీన అంశాలను బాగా చదవాలి. అధ్యయనం చేయాల్సిన ముఖ్య అంశాలు: రాజ్యాంగ చరిత్ర - రాజ్యాంగ పరిషత్: రాజ్యాంగ చారిత్రక పరిణామం, బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన ముఖ్య సంస్కరణలు, చార్టర్, కౌన్సిల్ చట్టాలు, రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, ముఖ్య కమిటీలు, ప్రముఖ సభ్యులు, తీర్మానాలు, రాజ్యాంగ ఆధారాలు వంటివాటిపై దృష్టి సారించాలి. అదేవిధంగా రాజ్యాంగ లక్ష్యాలు, ప్రాథమిక హక్కులు - రకాలు, ప్రాముఖ్యత, వాటి సవరణలు, సుప్రీం కోర్టు తీర్పులు, సమకాలీన వివాదాలు, ఆదేశిక నియమాలతో ప్రతిష్టంభన, తాజా పరిణామాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలి. వీటితోపాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, తొలగింపు, అధికారాలు, ప్రధానమంత్రి, మంత్రిమండలి, సంకీర్ణ రాజకీయాలు, పార్లమెంట్ నిర్మాణం, లోక్‌సభ, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, పార్టీ ఫిరాయింపుల చ ట్టం, నేరమయ రాజకీయాలు, సుప్రీం కోర్టు అధికార విధులు మొదలైన సమకాలీన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. రాష్ర్ట ప్రభుత్వాలకు సంబంధించి గవర్నర్ నియామకం, అధికార విధులు, విచక్షణాధికారాలు - వివాదాలు, ముఖ్యమంత్రి - మంత్రి మండలి, విధాన సభ, విధాన పరిషత్, హైకోర్టు, సబార్డినేట్ కోర్టులను అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, జాతీయ ఎస్టీ, ఎస్సీ, బీసీ కమిషన్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వంటివాటి గురించి తెలుసుకోవాలి. అంతరాష్ర్ట మండలి, జాతీయాభివృద్ధి మండలి, ప్రణాళిక సంఘం మొదలైనవాటిని బాగా చదవాలి. ఇవే కాకుండా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, మేయో, రిప్పన్ తీర్మానాలు, బల్వంత్రాయ్ మెహతా కమిటీ, అశోక్‌మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్.ఎం.సింఘ్వి కమిటీలు - వాటి సిఫార్సులు, 73, 74 రాజ్యాంగ సవరణలు వంటి అంశాలను అధ్యయనం చేయాలి. రిఫరెన్స్ బుక్స్: ఎన్సీఈఆర్టీ 10, 11, 12 తరగతుల సివిక్స్ పాఠ్యపుస్తకాలు ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - డి.డి. బసు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - పి.ఎం.భక్షి గత ప్రశ్నపత్రాలు ఇన్పుట్స్: బి.కృష్ణారెడ్డి సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ -
బిట్స్ పిలానీలో ‘ఆన్లైన్ పరీక్షలు’
శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని బిట్స్ పిలానీ (హైదరాబాద్ క్యాంపస్)లో గురువారం నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. బిట్స్ పిలానీ ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజస్థాన్ పిలానీ విద్యార్థులు ఆరోహన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని 11 నగరాల్లో 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో బాగంగా హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌లో గురువారం ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 45 ప్రశ్నలకుగాను 135 మార్కుల ఆన్లైన్ ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. గణితం, భౌతిక, రసాయ శాస్త్రాలతో పాటు ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలను పొందుపర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు భవిష్యత్తులో బిట్స్, ఐఐటీ, ఈఈఈ పరీక్షల్లో పాల్గొనేందుకు ఆన్లైన్ పరీక్షలు ఎంతగానో దోహదపడుతాయని హైదరాబాద్ బిట్స్ క్యాంపస్ సమన్వయకర్త శ్రేష్ఠ చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులను ఎంచుకొని రాజస్థాన్ పిలానీలో జరిగే టెక్నికల్ ఫెస్టుల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులతో పాటు వారి తల్లి లేక తండ్రిని వారి వెంట అనుమంతిస్తామని, వారికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చుతామన్నారు. కార్యక్రమంలో వలంటీర్స్ తేజస్వి, జశ్వంత్, శశాంత్, లాసియా, కళ్యాణ్, కపిల్, ప్రణీత్ పాల్గొన్నారు. -
ఉద్యోగాలు
అభ్యుదయ సహకార బ్యాంక్‌లో క్లర్క్ పోస్టులు అభ్యుదయ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(ఏసీబీఎల్).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు.. క్లర్క్: 125 అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య.. ఎంపిక: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా... చివరి తేది: అక్టోబర్ 19 వెబ్సైట్: www.abhyudayabank.co.in ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం రాయ్‌పూర్‌లోని ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం(ఐజీకేవీ).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. పోస్టుల వివరాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్/సైంటిస్ట్: 76 అసిస్టెంట్ లైబ్రేరియన్: 9 టెక్నికల్ అసిస్టెంట్: 6 నోటిఫికేషన్లో నిర్దేశించిన విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి. చివరి తేది: నవంబర్ 15 వెబ్సైట్: http://www.igau.edu.in ప్రవేశాలు ఎల్బీఎస్ఐఎంలో పీజీ డిప్లొమా న్యూఢిల్లీలోని లాల్‌బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎల్‌బీఎస్‌ఐఎం).. కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (జనరల్/ఫైనాన్స్) అర్హత: ఏదైనా డిగ్రీ. క్యాట్-2013లో అర్హత. ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.. చివరి తేది: డిసెంబర్ 14 వెబ్సైట్: www.lbsim.ac.in