కాంపిటీటివ్ కౌన్సెలింగ్ | Competitive Counseling | Sakshi
Sakshi News home page

కాంపిటీటివ్ కౌన్సెలింగ్

Published Tue, Jul 1 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

కాంపిటీటివ్ కౌన్సెలింగ్

కాంపిటీటివ్ కౌన్సెలింగ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
గ్రేడ్-బి ఆఫీసర్ (జనరల్) పోస్టుల పరీక్ష,
ప్రిపరేషన్ విధానాన్ని తెలపండి? - రజిత, బంజారాహిల్స్

 
సివిల్స్ ప్రిలిమ్స్‌లో పాలిటీ విభాగం నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి? వీటికి ఎలా సిద్ధమవ్వాలి?  - సంధ్య, ఖైరతాబాద్
 

ఆర్‌బీఐ.. గ్రేడ్-బి ఆఫీసర్ (జనరల్) పోస్టులకు నిర్వహించే పరీక్ష రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో భాగంగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం మార్కులు 200. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వ్యవధి: 130 నిమిషాలు. ఇందులో నిర్దేశిత మార్కులను సాధించినవారిని రెండో దశ పరీక్షకు ఎంపిక చేస్తారు.

జనరల్ అవేర్‌నెస్: ఇందులో సమకాలీన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, చరిత్ర, అర్థశాస్త్రం, భూగోళ శాస్త్రం, సామాన్య శాస్త్రం, ప్రణాళికలు, బడ్జెట్, రాజ్యాంగం, పన్ను విధానం, ఆర్థిక సర్వే సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే ప్రశ్నలు అధిక శాతం ఆర్థిక అంశాలపైనే ఉంటాయి. కాబట్టి సిలబస్‌లోని ఆర్థిక అంశాలను సమకాలీన సంఘటనలతో సమన్వయం చేసుకుంటూ విశ్లేషణాత్మక ప్రిపరేషన్ కొనసాగించాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఇందులో సంప్రదాయ ప్రశ్నలు కాకుండా డేటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి లీనియర్ ఈక్వేషన్స్, శాతాలు, లాభనష్టాలు, కాలం-దూరం- వేగం-పని, జామెట్రీ, వెన్ డయాగ్రమ్స్ వంటివాటిని ప్రాధాన్యతా క్రమంలో ప్రిపేర్ కావాలి. ఈ క్రమంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఆల్జీబ్రా, త్రికోణమితి, వైశ్లేషిక రేఖా గణితం, రేఖా గణితం, మెన్సురేషన్ వంటి అంశాల్లోని ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఎక్కువగా కాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలను సాధించే విధంగా షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువగా సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.

రీజనింగ్: అభ్యర్థిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం ఇది. ఇందులో స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, ఇన్‌పుట్- అవుట్‌పుట్ రిలేషన్స్, కేలండర్స్, క్లాక్స్, డెరైక్షన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా నంబర్స్, ఆల్ఫాబెట్స్, వర్డ్ ఇమేజెస్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.

డిస్క్రిప్టివ్ పేపర్: ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్-1 ఇంగ్లిష్, పేపర్-2 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, పేపర్-3 ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. సమాధానాలను మూడు గంటల్లో రాయాలి. ఈ విభాగానికి సంబంధించి ఇంగ్లిష్ పేపర్‌లో ఎస్సే, ప్రిసీస్ రైటింగ్, కాంప్రహెన్షన్, బిజినెస్/ఆఫీస్ కరస్పాండెన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2, పేపర్-3లలో వచ్చే ప్రశ్నలు ఆయా అంశాలపై విస్తృత అవగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కేవలం అవగాహన పెంచుకోవడమే కాకుండా.. ఆ సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా ఏ విధంగా ప్రజెంట్ చేయాలో నేర్చుకోవాలి. ఈ విభాగానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలు రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని అనుసరిస్తూ ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి? వాటికి సమకాలీనంగా ఎటువంటి ప్రాధాన్యత ఉంది? వంటి అంశాలను బేరీజు వేసుకుంటూ విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగించాలి.
 
 రిఫరెన్స్ బుక్స్:  ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12వ తరగతి పాఠ్యపుస్తకాలు  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్‌ఎస్ అగర్వాల్  రీజనింగ్ - ఆర్‌ఎస్ అగర్వాల్  ఇండియా ఇయర్‌బుక్  ప్రతియోగితా దర్పణ్  ఇంగ్లిష్ - జీఆర్‌ఈ బారెన్స్  ఆర్‌బీఐ గ్రేడ్-బి ఆఫీసర్స్ ఎగ్జామ్ - ఉపకార్ పబ్లికేషన్స్ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లో పాలిటీ మిగతావాటి కంటే భిన్నమైంది. సిలబస్‌లోని ప్రతి అంశం సమకాలీన సంఘటనలతో ముడిపడి ఉంటుంది.  భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, హక్కుల సమస్యలు మొదలైన అంశాలను సిలబస్‌లో ప్రస్తావించారు. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకున్నప్పుడు సిలబస్ పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రశ్నలు కూడా వీటిపైనే ఉంటాయి. అందువల్ల సమకాలీన అంశాలను బాగా చదవాలి.
 
అధ్యయనం చేయాల్సిన ముఖ్య అంశాలు:

రాజ్యాంగ చరిత్ర - రాజ్యాంగ పరిషత్: రాజ్యాంగ చారిత్రక పరిణామం, బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన ముఖ్య సంస్కరణలు, చార్టర్, కౌన్సిల్ చట్టాలు, రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, ముఖ్య కమిటీలు, ప్రముఖ సభ్యులు, తీర్మానాలు, రాజ్యాంగ ఆధారాలు వంటివాటిపై దృష్టి సారించాలి. అదేవిధంగా రాజ్యాంగ లక్ష్యాలు, ప్రాథమిక హక్కులు - రకాలు, ప్రాముఖ్యత, వాటి సవరణలు, సుప్రీం కోర్టు తీర్పులు, సమకాలీన వివాదాలు, ఆదేశిక నియమాలతో ప్రతిష్టంభన, తాజా పరిణామాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలి. వీటితోపాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, తొలగింపు, అధికారాలు, ప్రధానమంత్రి, మంత్రిమండలి, సంకీర్ణ రాజకీయాలు, పార్లమెంట్ నిర్మాణం, లోక్‌సభ, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, పార్టీ ఫిరాయింపుల చ ట్టం, నేరమయ రాజకీయాలు, సుప్రీం కోర్టు అధికార విధులు మొదలైన సమకాలీన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. రాష్ర్ట ప్రభుత్వాలకు సంబంధించి గవర్నర్ నియామకం, అధికార విధులు, విచక్షణాధికారాలు - వివాదాలు, ముఖ్యమంత్రి - మంత్రి మండలి, విధాన సభ, విధాన పరిషత్, హైకోర్టు, సబార్డినేట్ కోర్టులను అధ్యయనం చేయాలి. అదేవిధంగా ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, జాతీయ ఎస్టీ, ఎస్సీ, బీసీ కమిషన్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వంటివాటి గురించి తెలుసుకోవాలి. అంతరాష్ర్ట మండలి, జాతీయాభివృద్ధి మండలి, ప్రణాళిక సంఘం మొదలైనవాటిని బాగా చదవాలి. ఇవే కాకుండా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, మేయో, రిప్పన్ తీర్మానాలు, బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ, అశోక్‌మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్.ఎం.సింఘ్వి కమిటీలు - వాటి సిఫార్సులు, 73, 74 రాజ్యాంగ సవరణలు వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
 
రిఫరెన్స్ బుక్స్:  ఎన్‌సీఈఆర్‌టీ 10, 11, 12 తరగతుల సివిక్స్ పాఠ్యపుస్తకాలు  ఇంట్రడక్షన్ టు ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - డి.డి. బసు  ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా - పి.ఎం.భక్షి  గత ప్రశ్నపత్రాలు
 
 ఇన్‌పుట్స్: బి.కృష్ణారెడ్డి సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement