హైదరాబాద్: ‘సాక్షి’ తెలుగు విద్యార్థుల మేలు కోసం మరో అడుగు ముందుకేసింది. ఆన్‌లైన్ పరీక్షలకు ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. ఇప్పటికే భవిత, విద్య, చుక్కాని, సిటీప్లస్, ఠీఠీఠీ.ట్చజుటజిజ్ఛీఛీఠఛ్చ్టిజీౌ.ఛిౌఝ, బుక్‌లెట్స్ ద్వారా లక్షలాది మంది అభిమానాన్ని సాక్షి చురగొన్నది. విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో సులువుగా సాధన చేసుకునేందుకుగాను ఈ పోర్టల్‌ను ప్రారంభించింది.
దీని ద్వారా సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్స్, డీఎస్సీ, వీఆర్‌వో, రైల్వే, ఆర్మీ, పోలీస్, ఎంసెట్, జేఈఈ, ఐసెట్, ఎస్‌ఎస్‌సీ వంటి దాదాపు 100కు పైగా పోటీ, అర్హత పరీక్షలకు ఆన్‌లైన్ గ్రాండ్ టెస్ట్స్, లైవ్ టెస్ట్స్ అందుబాటులోకి తీసుకురానుంది. అన్ని ప్రశ్నలకు సాధనలు, వివరణలతో కూడిన గ్రాండ్ టెస్ట్‌లు, లైవ్ టెస్ట్‌లు, రోజులో ఎప్పుడైనా, ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం సైట్‌లో ఉంది.
ఆన్‌లైన్ పరీక్షలకు సాక్షి ప్రత్యేక వెబ్ పోర్టల్
Published Fri, Oct 10 2014 1:16 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement