శామీర్‌పేట్ రూరల్, న్యూస్‌లైన్: మండలంలోని బిట్స్ పిలానీ (హైదరాబాద్ క్యాంపస్)లో గురువారం నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. బిట్స్ పిలానీ ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజస్థాన్ పిలానీ విద్యార్థులు ఆరోహన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలోని 11 నగరాల్లో 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో బాగంగా హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌లో గురువారం ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 45 ప్రశ్నలకుగాను 135 మార్కుల ఆన్‌లైన్ ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. గణితం, భౌతిక, రసాయ శాస్త్రాలతో పాటు ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలను పొందుపర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు భవిష్యత్తులో బిట్స్, ఐఐటీ, ఈఈఈ పరీక్షల్లో పాల్గొనేందుకు ఆన్‌లైన్ పరీక్షలు ఎంతగానో దోహదపడుతాయని హైదరాబాద్ బిట్స్ క్యాంపస్ సమన్వయకర్త శ్రేష్ఠ చెప్పారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులను ఎంచుకొని రాజస్థాన్ పిలానీలో జరిగే టెక్నికల్ ఫెస్టుల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులతో పాటు వారి తల్లి లేక తండ్రిని వారి వెంట అనుమంతిస్తామని, వారికి కావాల్సిన సదుపాయాలను సమకూర్చుతామన్నారు. కార్యక్రమంలో వలంటీర్స్ తేజస్వి, జశ్వంత్, శశాంత్, లాసియా, కళ్యాణ్, కపిల్, ప్రణీత్ పాల్గొన్నారు.
బిట్స్ పిలానీలో ‘ఆన్‌లైన్ పరీక్షలు’
Published Fri, Jan 10 2014 2:35 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement