స్టెనోగ్రాఫర్స్ | Stenographer | Sakshi
Sakshi News home page

స్టెనోగ్రాఫర్స్

Published Sat, May 7 2016 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

స్టెనోగ్రాఫర్స్

స్టెనోగ్రాఫర్స్

(గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్-2016)
జాబ్స్ విత్ ఇంటర్

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2016కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఇతర ఉపవిభాగాలు, రాష్ట్రాల వారీగా ఖాళీలను త్వరలో వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
 
విద్యార్హతలు: ఇంటర్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-27 ఏళ్లు.
- ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఒబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. జనరల్ కేటగిరీ వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులకు ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
 
రాతపరీక్ష
ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. సమయం 2 గంటలు. తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్షలో మూడు విభాగాలుంటాయి. పార్ట్-1, 2లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-3లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 100 ప్రశ్నలుంటాయి.
 
స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ
గ్రేడ్-సి అభ్యర్థులకు నిమిషానికి 100 పదాల వేగం, గ్రేడ్-డి అభ్యర్థులకు 80 పదాల వేగం ఉండాలి. గ్రేడ్-డి అభ్యర్థులకు ఇంగ్లిష్‌కు 50 ని.లు, హిందీకి 65 ని.లు, గ్రేడ్-సికి ఇంగ్లిష్‌కు 40 ని.లు, హిందీకి 55 ని.ల సమయమిస్తారు.
 
రాతపరీక్ష సిలబస్
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్:  అనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జ్‌మెంట్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్ కాన్సెప్ట్స్,  నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
జనరల్ అవేర్‌నెస్: వర్తమాన సంఘటనలకు సంబంధించి అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. భారత్, పొరుగు దేశాల సమాచారం తెలుసుకోవాలి. క్రీడలు, చరిత్ర, భౌగోళికం, ఆర్థికం, పాలిటీ, శాస్త్రీయ పరిశోధన తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్: వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, రైటింగ్ ఎబిలిటీని పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి.
వివరాలకు: http://ssc.nic.in/
 
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 3, 2016, పరీక్ష తేది: 31 జూలై 2016
దరఖాస్తు రుసుం: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement