సాక్షి, హైదరాబాద్: బ్లూ రాక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో జీఎస్‌ఎం క్రీడాకారిణి ఎన్. భవిత మెరిసింది. సబ్ జూనియర్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచి రెండు టైటిళ్లను అందుకుంది. సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో భవిత 4–1తో విధి జైన్ (జీఎస్‌ఎం)పై, జూనియర్ బాలికల టైటిల్ పోరులో 4–2తో వి. సస్య (ఏడబ్ల్యూఏ)పై నెగ్గి విజేతగా నిలిచింది. సబ్ జూనియర్ బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్‌ఆర్) 4–2తో ఎస్‌ఎస్‌కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై, జూనియర్ బాలుర కేటగిరీలో అమన్ (ఏవీఎస్‌సీ) 4–2తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై గెలిచారు.
క్యాడెట్ బాలబాలికల ఫైనల్ మ్యాచ్‌ల్లో పార్థ్‌భాటియా (ఏడబ్ల్యూఏ) 3–1తో జతిన్ దేవ్ (ఎస్‌పీహెచ్‌ఎస్)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 3–2తో నిఖిత (వీపీజీ)పై... యూత్ బాలబాలికల తుదిపోరులో మొహమ్మద్ అలీ (ఎల్‌బీఎస్) 4–0తొ సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం) 4–2తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. పురుషుల ఫైనల్లో విఘ్నయ్ రెడ్డి (ఆర్‌బీఐ) 4–2తో పి. చంద్రచూడ్ (ఎంఎల్‌ఆర్)పై నెగ్గగా, మహిళల టైటిల్ పోరులో నిఖత్ బాను 4–3తో వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం)ను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment