TT championship
-
క్వార్టర్ ఫైనల్లో మనిక బత్రా
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా టేబుల్‌టెన్నిస్ ప్లేయర్ మనిక బత్రా ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తెలుగమ్మాయి ఆకుల శ్రీజకు మాత్రం నిరాశ ఎదురైంది. ఆమె తొలి రౌండ్లోనే పరాజయం పాలైంది. ఫ్రాన్స్‌లోని మాంట్పిలియెర్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో మనిక తనకన్నా ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న రొమేనియా స్టార్ బెర్నాడెట్ సాక్స్‌కు షాకిచ్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్ మనిక 3–1 (11–9, 6–11, 13–11, 11–9)తో టోర్నీ ఎనిమిదో సీడ్ ప్రపంచ 14వ ర్యాంకర్ బెర్నాడెట్‌ను కంగుతినిపించింది. ఇద్దరు చెరో గేమ్ గెలిచి పోటాపోటీగా దూసుకెళ్తున్న తరుణంలో మూడో గేమ్‌లో మనిక పోరాటపటిమ మ్యాచ్‌లో గెలిచేందుకు దోహదం చేసింది. రెండు గేమ్ పాయింట్లను కాపాడుకున్న ఆమె ప్రత్యర్థిని ఓడించి 2–1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో గేమ్‌లోనూ ఇదే ఆటతీరును కొనసాగించి మ్యాచ్‌లో గెలిచింది. మెరుగైన రొమేనియన్ క్రీడాకారిణిని 29 నిమిషాల్లోనే ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖీ పోటీల్లో 5–5తో సమంగా నిలువగా తాజా విజయంతో భారత ప్లేయర్ 6–5తో పైచేయి సాధించింది. పారిస్ ఒలింపిక్స్‌లోనూ భారత స్టార్ 3–2తో బెర్నాడెట్ సాక్స్‌ను ఓడించింది. తొలి రౌండ్ పోరులో శ్రీజ 2–3 (11–6, 7–11, 1–11, 11–8, 8–11)తో ప్రపంచ 13వ ర్యాంకర్ అడ్రియాన డియాజ్ (ప్యూర్టోరికో) చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో మనిక.. చైనాకు చెందిన ప్రపంచ 21వ ర్యాంకర్ క్వియన్తో తలపడనుంది. మరో ప్రిక్వార్టర్స్‌లో ఆమె 3–0తో చైనాకే చెందిన టాప్‌సీడ్ వాంగ్ యిదిని ఓడించింది. -
అమెరికాలో ప్రపంచ టీటీ చాంపియన్‌షిప్
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ నేటి నుంచి అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో జరగనుంది. వారంరోజుల పాటు జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, ఆంథోనీ అమల్‌రాజ్ పోటీపడుతున్నారు. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో మనిక బత్రా, సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, మధురిక, అర్చన కామత్ బరిలో ఉన్నారు. -
Asian TT Championship: కాంస్య పతకం ఖాయం!
Asian TT Championship 2021: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆచంట శరత్ కమల్, సత్యన్, హర్మీత్ దేశాయ్, సానిల్ షెట్టి, మానవ్ ఠక్కర్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 3–1తో ఇరాన్ జట్టును ఓడించింది. కాగా శరత్ కమల్ రెండు మ్యాచ్‌ల్లో, సత్యన్ ఒక మ్యాచ్‌లో నెగ్గగా... హర్మీత్ ఓడిపోయాడు. భారత విజయం ఖాయం కావడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. చదవండి: Koneru Humpy: కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం -
ముగిసిన వరుణి, స్నేహిత్ పోరాటం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుల పోరాటం ముగిసింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వరుణి జైస్వాల్ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలవ్వగా... పురుషుల సింగిల్స్ కేటగిరీలో స్నేహిత్ మూడో రౌండ్లో ఓటమి చవిచూశాడు. శనివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో వరుణి జైస్వాల్ (తెలంగాణ) 9–11, 6–11, 3–11, 6–11తో క్రితిక సిన్హా రాయ్ (పీఎస్‌పీబీ) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు మూడో రౌండ్లో ఆమె 4–2తో దీప్తి సెల్వకుమార్‌పై గెలుపొందింది. పురుషుల విభాగంలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్‌కు నిరాశ ఎదురైంది. మూడోరౌండ్ గేమ్‌లో స్నేహిత్ 3–4తో సౌమ్యజిత్ ఘోష్ (హరియాణా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ కేటగిరీలో సౌమ్యజిత్ ఘోష్‌తో పాటు జి. సత్యన్ (పీఎస్‌పీబీ), రోనిత్ భాన్‌జా (బెంగాల్ ‘ఎ’), సార్థక్ గాంధీ (టీటీఎఫ్ఐ), మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ), సనీల్ శెట్టి (పీఎస్‌పీబీ), హర్మీత్ దేశాయ్ (పీఎస్‌పీబీ), ఎ. శరత్ కమల్ (ఎస్పీబీ) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు పురుషులు: సత్యన్ 10–12, 11–7, 9–11, 6–11, 11–7, 11–3, 11–7తో మనుశ్ షా (గుజరాత్)పై, రోనిత్ 8–11, 12–10, 11–9, 6–11, 11–5, 7–11, 11–8తో సౌరవ్ సాహా (హరియాణా)పై, సార్థక్ 11–8, 7–11, 11–9, 11–9, 9–11, 9–11, 11–9తో సుష్మిత్ శ్రీరామ్ (ఏఏఐ)పై, మానవ్ ఠక్కర్ 11–9, 11–8, 11–7, 8–11, 11–7తో జుబిన్ కుమార్ (హరియాణా)పై, సనీల్ శెట్టి 11–2, 12–10, 11–5, 4–11, 11–6తో జీత్ చంద్ర (హరియాణా)పై, హరీ్మత్ దేశాయ్ 11–4, 11–7, 8–11, 11–7, 8–11, 11–13, 11–8తో ఆకాశ్ పాల్ (బెంగాల్ ‘ఎ’)పై, సౌమ్యజిత్ 11–8, 9–11, 11–8, 11–7, 5–11, 12–10తో సుధాన్షు గ్రోవర్ (ఢిల్లీ)పై, శరత్ కమల్ 11–4, 11–9, 11–9, 8–11, 11–2తో అర్జున్ ఘోష్‌పై గెలుపొందారు. మహిళలు: సుతీర్థ (హరియాణా) 12–10, 11–9, 11–9, 12–10తో మధురిక పాట్కర్ (పీఎస్‌పీబీ)పై, కౌశాని (రైల్వేస్) 7–11, 11–9, 8–11, 8–11, 11–8, 11–9, 11–9తో సురభి పట్వారీ (బెంగాల్ ‘ఎ’)పై, మౌసుమీ పాల్ (పీఎస్‌పీబీ) 15–13, 9–11, 11–6, 12–14, 9–11, 11–6, 11–6తో ఆనందిత చక్రవర్తి (రైల్వేస్)పై, ఐహిక ముఖర్జీ (ఆర్బీఐ) 1–6, 11–5, 11–9, 16–14తో సాగరిక ముఖర్జీ (రైల్వేస్)పై, పూజ (పీఎస్‌పీబీ) 4–11, 11–13, 12–10, 12–10, 11–8, 11–8తో ప్రాప్తి సేన్ (బెంగాల్ ‘ఎ’)పై నెగ్గి ముందంజ వేశారు. -
పోరాడి ఓడిన నివేదిత
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో తెలంగాణకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం మహిళల సింగిల్స్ విభాగంలో తలపడిన ఐదుగురు రాష్ట్ర క్రీడాకారుల్లో కేవలం ఒకరు మాత్రమే ముందంజ వేశారు. ప్రణీత, లాస్య, నివేదిత, నిఖిత తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా వరుణి జైస్వాల్ ముందంజ వేసింది. శుక్రవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ బ్యాచ్‌లో వరుణి జైస్వాల్ 3–1తో తనుశ్రీ దాస్‌గుప్తా (మేఘాలయ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో నివేదిత 2–3తో మానసి (మహారాష్ట్ర) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణీత గర్లపాటి (తెలంగాణ) 2–3తో క్రితిక ఉపాధ్యాయ (రైల్వేస్) చేతిలో, వి. లాస్య 1–3తో సన్య సెహగల్ (హరియాణా) చేతిలో, నిఖిత (తెలంగాణ) 0–3తో వరి్టకా భరత్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు బి. నాగశ్రావణి 2–3తో నేహా (పంజాబ్) చేతిలో, ఫల్గుణి చార్వి 0–3తో నిత్యాశ్రీ మణి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల విభాగంలో టాప్ సీడ్ జి. సత్యన్, రెండో సీడ్ ఎ. శరత్‌కమల్‌లకు తొలి రౌండ్లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. -
విజేతలు సరోజ్ సిరిల్, వరుణి జైస్వాల్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ఎంవీ శ్రీధర్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) విజేతలుగా నిలిచారు. ఖైరతాబాద్ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో సరోజ్ 12–10, 8–11, 3–11, 11–6, 11–5, 6–11, 11–7తో వరుణ్ శంకర్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందగా... వరుణి 11–3, 11–9, 11–5, 11–4తో రాగనివేదిత (జీటీటీఏ)ను ఓడించింది. యూత్ విభాగంలో మొహమ్మద్ అలీ, జి. ప్రణీత టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. ఫైనల్లో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 11–5, 8–11, 11–5, 11–6, 11–7తో అలీ మొహమ్మద్‌పై, ప్రణీత 12–10, 11–9, 9–11, 6–11, 11–9, 13–11తో వరుణి (జీఎస్ఎం)పై గెలుపొందారు. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషాన్ సాయి (ఎంఎల్ఆర్) 4–11, 11–8, 11–9, 11–9, 11–5తో కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గాడు. బాలికల తుదిపోరులో పలక్ (జీఎస్ఎం) 6–11, 11–7, 11–8, 12–10, 11–5తో అనన్య (జీఎస్ఎం)ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ప్రపంచ జూ. చాంపియన్‌షిప్‌కు స్నేహిత్
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడలో దూసుకుపోతున్న హైదరాబాద్ క్రీడాకారుడు ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ ప్రతిష్టాత్మక ‘ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్’లో పాల్గొననున్నాడు. ఆస్ట్రేలియాలో డిసెంబర్ 2 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో 48వ స్థానంలో ఉన్న స్నేహిత్ భారత టీటీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అండర్–18 స్థాయిలో ప్రపంచ జూనియర్ టీటీ చాంపియన్‌షిప్ జరుగుతుంది. గతేడాది ఇటలీలో జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ స్నేహిత్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరోసారి జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున సత్తా చాటేందుకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని స్నేహిత్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీకి ముందు నవంబర్ 27 నుంచి 30 వరకు జరిగే పోర్చుగల్ ఓపెన్‌లో టైటిల్ సాధించడమే లక్ష్యం గా బరిలో దిగుతానన్నాడు. భారత జట్టుకు ఎంపి కైన స్నేహిత్‌ను గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ) యాజమాన్యం అభినందించింది. -
భవితకు రెండు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: బ్లూ రాక్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో జీఎస్ఎం క్రీడాకారిణి ఎన్. భవిత మెరిసింది. సబ్ జూనియర్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచి రెండు టైటిళ్లను అందుకుంది. సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో భవిత 4–1తో విధి జైన్ (జీఎస్ఎం)పై, జూనియర్ బాలికల టైటిల్ పోరులో 4–2తో వి. సస్య (ఏడబ్ల్యూఏ)పై నెగ్గి విజేతగా నిలిచింది. సబ్ జూనియర్ బాలుర విభాగంలో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్) 4–2తో ఎస్ఎస్కే కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై, జూనియర్ బాలుర కేటగిరీలో అమన్ (ఏవీఎస్‌సీ) 4–2తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై గెలిచారు. క్యాడెట్ బాలబాలికల ఫైనల్ మ్యాచ్‌ల్లో పార్థ్‌భాటియా (ఏడబ్ల్యూఏ) 3–1తో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్)పై, కావ్య (ఏడబ్ల్యూఏ) 3–2తో నిఖిత (వీపీజీ)పై... యూత్ బాలబాలికల తుదిపోరులో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 4–0తొ సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 4–2తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. పురుషుల ఫైనల్లో విఘ్నయ్ రెడ్డి (ఆర్బీఐ) 4–2తో పి. చంద్రచూడ్ (ఎంఎల్ఆర్)పై నెగ్గగా, మహిళల టైటిల్ పోరులో నిఖత్ బాను 4–3తో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం)ను ఓడించింది. -
ఓయూ టీటీ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు సత్తా చాటింది. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఉస్మానియా జట్టు 3–1తో మద్రాస్ యూనివర్సిటీపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఉస్మానియా 3–0తో ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై గెలుపొందగా, మద్రాస్ యూనివర్సిటీ 3–0తో కాలికట్ జట్టును ఓడించింది. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఓయూ 3–0తో ఆర్జీయూహెచ్ఎస్ కర్ణాటకపై, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 3–1తో అన్నా యూనివర్సిటీపై, కాలికట్ 3–0తో ఎంజీ యూనివర్సిటీపై, మద్రాస్ యూనివర్సిటీ 3–1తో కేరళపై విజయం సాధించాయి. -
విజయవాడ క్రీడాకారుల హవా
విజయవాడ స్పోర్ట్స్ : ఏపీ స్టేట్ ఇంటర్ స్కూల్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ సోమవారం స్థానిక దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. జిల్లా టేబుల్ టñ న్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఎలెవన్ స్పోర్ట్స్ క్లబ్ దేశవ్యాప్తంగా టీటీ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ టోర్నీని ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్డీవో ఎండీ సిరాజుద్దీన్ ప్రార ంభించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఎలెవన్ స్పోర్ట్స్ ఈ టోర్నీని నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. క్రీడా స్ఫూర్తితో చక్కగా ఆడి గెలవాలన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న శాప్ వోఎస్డీ పి.రామకృష్ణ మాట్లాడుతూ దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో ఆడినవారిలో అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని పేర్కొన్నారు. టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.బలరామ్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు పోటీల్లో విజయవాడ పాఠశాలల క్రీడాకారులు సత్తా చాటారు. తొలి రోజు ఫలితాలు జూనియర్ బాలికల విభాగం ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో సెయింట్ జాన్స్(విజయవాడ)పై 0–3 తేడాతో ఎన్ఎస్ఎం(విజయవాడ) స్కూల్, కేంద్రీయ విద్యాలయం(విశాఖపట్నం)పై 1–3 తేడాతో రవీంద్రభారతి స్కూల్(విజయవాడ), గోమతి స్కూల్(నెల్లూరు)పై 2–3 తేడాతో బాలాజీ స్కూల్ (విశాఖపట్నం) విజయం సాధించాయి. గన్నవరం జెడ్పీ హైస్కూలుపై 1–3 తేడాతో శ్రీచైతన్య స్కూల్(ప్రొద్దుటూరు), డీఏఎస్(విశాఖపట్నం)పై 0–3 తేడాతో అక్షర స్కూల్(అనంతపురం), విశాఖ వ్యాలీ స్కూలు(విశాఖపట్నం)పై 2–3 తేడాతో శ్రీచైతన్య(అనంతపురం) పాఠశాల గెలుపొందాయి. జూనియర్ బాలుర విభాగంలో అక్షర(నెల్లూరు)పై 1–3 తేడాతో అక్షర(కాకినాడ), శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూలు(విజయవాడ)పై 1–3 తేడాతో బాపనయ్య స్కూల్(విజయవాడ), రవీంద్రభారతి(విజయవాడ)పై 1–3 తేడాతో సెయింట్ జాన్స్(విజయవాడ), ఏజీఎస్ స్కూల్(అనంతపురం)పై 1–3 తేడాతో లిటిల్ ఏంజిల్స్ స్కూల్, భాష్యం బ్లూమ్స్(గుంటూరు)పై 0–3 తేడాతో ఎన్ఎస్ఎం స్కూల్(విజయవాడ) విజయం సాధించాయి. విశాఖ వ్యాలీ స్కూల్‌పై 1–3 తేడాతో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్(విజయవాడ), నలంద విద్యానికేతన్(విజయవాడ)పై 0–3 తేడాతో డీపీఎస్(విజయవాడ) గెలుపొందాయి. -
భారత జట్లకు రెండో విజయం
ప్రపంచ టీమ్ టీటీ చాంపియన్‌షిప్ టోక్యో: ప్రపంచ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు దూసుకెళ్తున్నాయి. పురుషుల జట్టు 3-0తో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించగా, మహిళల జట్టు 3-1తో పోర్చుగల్‌పై గెలుపొందింది. ఈ టోర్నీలో ఇరుజట్లకు వరుసగా రెండో విజయమిది. రెండో రోజు మంగళవారం జరిగిన పురుషుల విభాగం గ్రూప్-ఎఫ్ పోటీల్లో భారత నంబర్‌వన్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ 11-9, 11-7, 7-11, 11-8తో డేవిడ్ పావెల్‌పై, శానిల్ షెట్టి 9-11, 11-9, 13-11, 8-11, 11-3తో హూ హెమింగ్‌పై, హర్మీత్ దేశాయ్ 11-6, 11-7, 11-7తో కేన్ టౌన్‌సెండ్‌పై గెలుపొందారు. మహిళల గ్రూప్-జి పోటీల్లో మానిక బాత్రా 7-11, 11-6, 11-5, 11-7తో రీటా ఫిన్స్‌పై విజయం సాధించగా, శామిని కుమరేశన్ 6-11, 11-5, 9-11, 6-11తో అనా నెవెస్ చేతిలో ఓడింది. ఈ దశలో మధురిక పాట్కర్ 11-7, 11-5, 11-8తో లెయిలా ఒలివీరపై, రివర్స్ సింగిల్స్‌లో శామిని 9-11, 7-11, 11-5, 12-10, 11-6తో రీటాపై గెలువడంతో భారత్ విజయం సాధించింది.