
Asian TT Championship 2021: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. దోహాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో ఆచంట శరత్ కమల్, సత్యన్, హర్మీత్ దేశాయ్, సానిల్ షెట్టి, మానవ్ ఠక్కర్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో 3–1తో ఇరాన్ జట్టును ఓడించింది.
కాగా శరత్ కమల్ రెండు మ్యాచ్‌ల్లో, సత్యన్ ఒక మ్యాచ్‌లో నెగ్గగా... హర్మీత్ ఓడిపోయాడు. భారత విజయం ఖాయం కావడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు.
చదవండి: Koneru Humpy: కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం