సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుల పోరాటం ముగిసింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వరుణి జైస్వాల్ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలవ్వగా... పురుషుల సింగిల్స్ కేటగిరీలో స్నేహిత్ మూడో రౌండ్‌లో ఓటమి చవిచూశాడు. శనివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో వరుణి జైస్వాల్ (తెలంగాణ) 9–11, 6–11, 3–11, 6–11తో క్రితిక సిన్హా రాయ్ (పీఎస్‌పీబీ) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు మూడో రౌండ్‌లో ఆమె 4–2తో దీప్తి సెల్వకుమార్‌పై గెలుపొందింది. పురుషుల విభాగంలో ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్‌కు నిరాశ ఎదురైంది. మూడోరౌండ్ గేమ్‌లో స్నేహిత్ 3–4తో సౌమ్యజిత్ ఘోష్ (హరియాణా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ కేటగిరీలో సౌమ్యజిత్ ఘోష్‌తో పాటు జి. సత్యన్ (పీఎస్‌పీబీ), రోనిత్ భాన్‌జా (బెంగాల్ ‘ఎ’), సార్థక్ గాంధీ (టీటీఎఫ్‌ఐ), మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ), సనీల్ శెట్టి (పీఎస్‌పీబీ), హర్మీత్ దేశాయ్ (పీఎస్‌పీబీ), ఎ. శరత్ కమల్ (ఎస్‌పీబీ) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు
పురుషులు: సత్యన్ 10–12, 11–7, 9–11, 6–11, 11–7, 11–3, 11–7తో మనుశ్ షా (గుజరాత్)పై, రోనిత్ 8–11, 12–10, 11–9, 6–11, 11–5, 7–11, 11–8తో సౌరవ్ సాహా (హరియాణా)పై, సార్థక్ 11–8, 7–11, 11–9, 11–9, 9–11, 9–11, 11–9తో సుష్మిత్ శ్రీరామ్ (ఏఏఐ)పై, మానవ్ ఠక్కర్ 11–9, 11–8, 11–7, 8–11, 11–7తో జుబిన్ కుమార్ (హరియాణా)పై, సనీల్ శెట్టి 11–2, 12–10, 11–5, 4–11, 11–6తో జీత్ చంద్ర (హరియాణా)పై, హరీ్మత్ దేశాయ్ 11–4, 11–7, 8–11, 11–7, 8–11, 11–13, 11–8తో ఆకాశ్ పాల్ (బెంగాల్ ‘ఎ’)పై, సౌమ్యజిత్ 11–8, 9–11, 11–8, 11–7, 5–11, 12–10తో సుధాన్షు గ్రోవర్ (ఢిల్లీ)పై, శరత్ కమల్ 11–4, 11–9, 11–9, 8–11, 11–2తో అర్జున్ ఘోష్‌పై గెలుపొందారు.
మహిళలు: సుతీర్థ (హరియాణా) 12–10, 11–9, 11–9, 12–10తో మధురిక పాట్కర్ (పీఎస్‌పీబీ)పై, కౌశాని (రైల్వేస్) 7–11, 11–9, 8–11, 8–11, 11–8, 11–9, 11–9తో సురభి పట్వారీ (బెంగాల్ ‘ఎ’)పై, మౌసుమీ పాల్ (పీఎస్‌పీబీ) 15–13, 9–11, 11–6, 12–14, 9–11, 11–6, 11–6తో ఆనందిత చక్రవర్తి (రైల్వేస్)పై, ఐహిక ముఖర్జీ (ఆర్‌బీఐ) 1–6, 11–5, 11–9, 16–14తో సాగరిక ముఖర్జీ (రైల్వేస్)పై, పూజ (పీఎస్‌పీబీ) 4–11, 11–13, 12–10, 12–10, 11–8, 11–8తో ప్రాప్తి సేన్ (బెంగాల్ ‘ఎ’)పై నెగ్గి ముందంజ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment