Varuni Jaiswal
-
ముగిసిన వరుణి, స్నేహిత్ పోరాటం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుల పోరాటం ముగిసింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వరుణి జైస్వాల్ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలవ్వగా... పురుషుల సింగిల్స్ కేటగిరీలో స్నేహిత్ మూడో రౌండ్లో ఓటమి చవిచూశాడు. శనివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో వరుణి జైస్వాల్ (తెలంగాణ) 9–11, 6–11, 3–11, 6–11తో క్రితిక సిన్హా రాయ్ (పీఎస్‌పీబీ) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు మూడో రౌండ్లో ఆమె 4–2తో దీప్తి సెల్వకుమార్‌పై గెలుపొందింది. పురుషుల విభాగంలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్‌కు నిరాశ ఎదురైంది. మూడోరౌండ్ గేమ్‌లో స్నేహిత్ 3–4తో సౌమ్యజిత్ ఘోష్ (హరియాణా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ కేటగిరీలో సౌమ్యజిత్ ఘోష్‌తో పాటు జి. సత్యన్ (పీఎస్‌పీబీ), రోనిత్ భాన్‌జా (బెంగాల్ ‘ఎ’), సార్థక్ గాంధీ (టీటీఎఫ్ఐ), మానవ్ ఠక్కర్ (పీఎస్‌పీబీ), సనీల్ శెట్టి (పీఎస్‌పీబీ), హర్మీత్ దేశాయ్ (పీఎస్‌పీబీ), ఎ. శరత్ కమల్ (ఎస్పీబీ) క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు పురుషులు: సత్యన్ 10–12, 11–7, 9–11, 6–11, 11–7, 11–3, 11–7తో మనుశ్ షా (గుజరాత్)పై, రోనిత్ 8–11, 12–10, 11–9, 6–11, 11–5, 7–11, 11–8తో సౌరవ్ సాహా (హరియాణా)పై, సార్థక్ 11–8, 7–11, 11–9, 11–9, 9–11, 9–11, 11–9తో సుష్మిత్ శ్రీరామ్ (ఏఏఐ)పై, మానవ్ ఠక్కర్ 11–9, 11–8, 11–7, 8–11, 11–7తో జుబిన్ కుమార్ (హరియాణా)పై, సనీల్ శెట్టి 11–2, 12–10, 11–5, 4–11, 11–6తో జీత్ చంద్ర (హరియాణా)పై, హరీ్మత్ దేశాయ్ 11–4, 11–7, 8–11, 11–7, 8–11, 11–13, 11–8తో ఆకాశ్ పాల్ (బెంగాల్ ‘ఎ’)పై, సౌమ్యజిత్ 11–8, 9–11, 11–8, 11–7, 5–11, 12–10తో సుధాన్షు గ్రోవర్ (ఢిల్లీ)పై, శరత్ కమల్ 11–4, 11–9, 11–9, 8–11, 11–2తో అర్జున్ ఘోష్‌పై గెలుపొందారు. మహిళలు: సుతీర్థ (హరియాణా) 12–10, 11–9, 11–9, 12–10తో మధురిక పాట్కర్ (పీఎస్‌పీబీ)పై, కౌశాని (రైల్వేస్) 7–11, 11–9, 8–11, 8–11, 11–8, 11–9, 11–9తో సురభి పట్వారీ (బెంగాల్ ‘ఎ’)పై, మౌసుమీ పాల్ (పీఎస్‌పీబీ) 15–13, 9–11, 11–6, 12–14, 9–11, 11–6, 11–6తో ఆనందిత చక్రవర్తి (రైల్వేస్)పై, ఐహిక ముఖర్జీ (ఆర్బీఐ) 1–6, 11–5, 11–9, 16–14తో సాగరిక ముఖర్జీ (రైల్వేస్)పై, పూజ (పీఎస్‌పీబీ) 4–11, 11–13, 12–10, 12–10, 11–8, 11–8తో ప్రాప్తి సేన్ (బెంగాల్ ‘ఎ’)పై నెగ్గి ముందంజ వేశారు. -
పోరాడి ఓడిన నివేదిత
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో తెలంగాణకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం మహిళల సింగిల్స్ విభాగంలో తలపడిన ఐదుగురు రాష్ట్ర క్రీడాకారుల్లో కేవలం ఒకరు మాత్రమే ముందంజ వేశారు. ప్రణీత, లాస్య, నివేదిత, నిఖిత తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా వరుణి జైస్వాల్ ముందంజ వేసింది. శుక్రవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ బ్యాచ్‌లో వరుణి జైస్వాల్ 3–1తో తనుశ్రీ దాస్‌గుప్తా (మేఘాలయ)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో నివేదిత 2–3తో మానసి (మహారాష్ట్ర) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణీత గర్లపాటి (తెలంగాణ) 2–3తో క్రితిక ఉపాధ్యాయ (రైల్వేస్) చేతిలో, వి. లాస్య 1–3తో సన్య సెహగల్ (హరియాణా) చేతిలో, నిఖిత (తెలంగాణ) 0–3తో వరి్టకా భరత్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు బి. నాగశ్రావణి 2–3తో నేహా (పంజాబ్) చేతిలో, ఫల్గుణి చార్వి 0–3తో నిత్యాశ్రీ మణి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల విభాగంలో టాప్ సీడ్ జి. సత్యన్, రెండో సీడ్ ఎ. శరత్‌కమల్‌లకు తొలి రౌండ్లో బై లభించడంతో నేరుగా రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. -
విజేతలు సరోజ్ సిరిల్, వరుణి జైస్వాల్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ ఎంవీ శ్రీధర్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ), వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) విజేతలుగా నిలిచారు. ఖైరతాబాద్ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో సరోజ్ 12–10, 8–11, 3–11, 11–6, 11–5, 6–11, 11–7తో వరుణ్ శంకర్ (ఎంఎల్ఆర్)పై గెలుపొందగా... వరుణి 11–3, 11–9, 11–5, 11–4తో రాగనివేదిత (జీటీటీఏ)ను ఓడించింది. యూత్ విభాగంలో మొహమ్మద్ అలీ, జి. ప్రణీత టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. ఫైనల్లో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 11–5, 8–11, 11–5, 11–6, 11–7తో అలీ మొహమ్మద్‌పై, ప్రణీత 12–10, 11–9, 9–11, 6–11, 11–9, 13–11తో వరుణి (జీఎస్ఎం)పై గెలుపొందారు. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషాన్ సాయి (ఎంఎల్ఆర్) 4–11, 11–8, 11–9, 11–9, 11–5తో కార్తీక్ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గాడు. బాలికల తుదిపోరులో పలక్ (జీఎస్ఎం) 6–11, 11–7, 11–8, 12–10, 11–5తో అనన్య (జీఎస్ఎం)ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
వరుణి జైస్వాల్‌కు రెండు టైటిళ్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) ఆకట్టుకుంది. ఆమె మహిళల, యూత్ బాలికల సింగిల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. జూనియర్ బాలికల విభాగంలో ఎన్. భవిత (జీఎస్ఎం), పురుషుల విభాగంలో అమన్ (సీఆర్‌ఎస్‌సీబీ), యూత్ బాలుర కేటగిరీలో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ (జీటీటీఏ), జూనియర్ బాలుర విభాగంలో బి. వరుణ్ శంకర్ (ఎంఎల్ఆర్) చాంపియన్లుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో వరుణి జైస్వాల్ 7–11, 11–9, 11–8, 10–12తో నిఖత్ బాను (ఆర్బీఐ)పై గెలుపొందింది. ఐదో గేమ్‌లో నిఖత్ బాను గాయం కారణంగా వైదొలగడంతో వరుణిని విజేతగా ప్రకటించారు. పురుషుల తుదిపోరులో అమన్ 11–8, 7–11, 11–8, 8–11, 11–9, 11–9తో స్నేహిత్ (జీటీటీఏ)ను ఓడించాడు. యూత్ బాలికల ఫైనల్లో వరుణి 8–11, 11–9, 11–13, 11–7, 11–5, 8–11, 11–7తో రాగ నివేదిత (జీటీటీఏ)పై గెలుపొందగా... బాలుర విభాగంలో స్నేహిత్ 11–4, 11–7, 11–7, 11–4తో కేశవన్ కన్నన్ (ఎంఎల్ఆర్)ను ఓడించాడు. జూనియర్ బాలికల టైటిల్‌పోరులో భవిత 11–1, 11–3, 4–11, 11–2, 11–8తో మెర్సీ (హెచ్‌వీఎస్)పై నెగ్గింది. బాలుర తుదిపోరులో వరుణ్ శంకర్ 11–2, 11–8, 11–7, 11–4తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్ఆర్)పై విజయం సాధించాడు. సబ్ జూనియర్ బాలుర విభాగంలో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్), జషాన్ సాయి (ఎంఎల్ఆర్) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్ మ్యాచ్‌ల్లో కరన్ సప్తర్షి (ఎంఎల్ఆర్)పై, త్రిశూల్ మెహ్రా, ఇషాంత్ (ఎస్పీహెచ్ఎస్)పై జషాన్ సాయి నెగ్గారు. బాలికల విభాగంలో మెర్సీ (హెచ్‌వీఎస్), పలక్ (జీఎస్ఎం), శ్రీయ (జీఎస్ఎం), అనన్య (జీఎస్ఎం) సెమీస్‌కు చేరుకున్నారు. క్యాడెట్ బాలబాలికల్లో జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్), ధ్రువ్ సాగర్, శౌర్య రాజ్ (ఏవీఎస్‌సీ), స్మరణ్, శ్రీయ, శ్రీయ, ప్రజ్ఞాన్ష (వీపీజీ), పి. జలానీ (వీపీజీ) సెమీస్‌కు చేరారు. -
వరుణి జైశ్వాల్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుణి జైశ్వాల్ ఆకట్టుకుంది. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో ఆమె యూత్ బాలికల, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను దక్కించుకుంది. బాలుర విభాగంలో మొహమ్మద్ అలీ కూడా జూనియర్ బాలుర, పురుషుల కేటగిరీల్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన యూత్ బాలికల ఫైనల్లో వరుణి జైశ్వాల్ (జీఎస్ఎం) 13–11, 10–12, 9–11, 16–14, 11–8, 11–6తో ప్రణీత (హెచ్‌వీఎస్)పై, మహిళల విభాగంలో వరుణి11–9, 11–8, 8–11, 11–2, 11–9తో మోనికా (జీఎస్ఎం)పై గెలుపొందింది. జూనియర్ బాలికల విభాగంలో వి. సస్య (ఎంఎల్ఆర్) 6–11, 12–10, 11–6, 9–11, 11–7, 11–7తో లాస్య (ఎంఎల్ఆర్)పై నెగ్గింది. మరోవైపు జూనియర్ బాలుర ఫైనల్లో మొహమ్మద్ అలీ (ఎల్బీఎస్) 12–10, 11–6, 8–11, 7–11, 11–9, 11–7తో వరుణ్ శంకర్ (జీటీటీఏ)పై, పురుషుల ఫైనల్లో మొహమ్మద్ అలీ 5–11, 14–12, 11–8, 11–9, 13–15, 7–11, 15–13తో చంద్రచూడ్‌పై, యూత్ బాలుర ఫైనల్లో సరోజ్ సిరిల్ 8–11, 13–11, 11–5, 11–7, 8–11, 11–6తో లహోటి (హెచ్‌వీఎస్)పై, సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో అద్వైత్ 7–11, 11–7, 11–8, 11–9, 11–8తో వరుణ్ శంకర్‌పై నెగ్గి విజేతలుగా నిలిచారు. -
వరుణి జైస్వాల్‌కు స్వర్ణం
ఇండియా ఓపెన్ టీటీ టోర్నమెంట్ ఇండోర్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఇండియా జూనియర్, క్యాడెట్ ఓపెన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి వరుణి జైస్వాల్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు నాలుగు పసిడి పతకాలు లభించాయి. జూనియర్ బాలికల సింగిల్స్ ఫైనల్లో తెలంగాణ క్రీడాకారిణి వరుణి 5-11, 11-9, 8-11, 1-11, 14-12, 11-8, 11-9తో సు పీ లింగ్ (చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించింది. నిర్ణాయక ఏడో గేమ్‌లో వరుణి 3-7తో వెనుకబడినా... పట్టువదలకుండా పోరాడి స్కోరును సమం చేయడంతోపాటు విజయాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్లో వరుణి 7-11, 6-11, 11-9, 11-9, 11-3, 13-15, 11-9తో హైదరాబాద్‌కే చెందిన ఆకుల శ్రీజను ఓడించింది. -
శ్రీజ, వరుణి ఓటమి
బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, వరుణి జైస్వాల్ పోరాటం పిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. శ్రీజ 11-7, 11-6, 5-11, 6-11, 6-11, 9-11తో నమీ కమాదా (జపాన్) చేతిలో.. వరుణి 8-11, 4-11, 1-11తో చెన్ టింగ్ టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. -
భారత్‌కు కాంస్య పతకాలు
థాయ్‌లాండ్ ఓపెన్ టీటీ బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ క్యాడెట్, జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత బాలికల జట్లకు కాంస్య పతకాలు లభించాయి. క్యాడెట్‌తోపాటు జూనియర్ విభాగంలోనూ భారత జట్ల పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో క్యాడెట్ జట్టు 2-3 తేడాతో హాంకాంగ్ చేతిలో... జూనియర్ జట్టు 0-3తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డాయి. ఈ టోర్నీలో భారత్ తరఫున తెలంగాణ క్రీడాకారిణులు వరుణీ జైస్వాల్, ఆకుల శ్రీజ జూనియర్ విభాగంలోపాల్గొన్నారు.