వరుణి జైస్వాల్‌కు స్వర్ణం | India finish with four gold medals in ITTF 2016 championships | Sakshi
Sakshi News home page

వరుణి జైస్వాల్‌కు స్వర్ణం

Published Mon, Sep 12 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

వరుణి జైస్వాల్‌కు స్వర్ణం

వరుణి జైస్వాల్‌కు స్వర్ణం

 ఇండియా ఓపెన్ టీటీ టోర్నమెంట్
 ఇండోర్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఇండియా జూనియర్, క్యాడెట్ ఓపెన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి వరుణి జైస్వాల్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు నాలుగు పసిడి పతకాలు లభించాయి. జూనియర్ బాలికల సింగిల్స్ ఫైనల్లో తెలంగాణ క్రీడాకారిణి వరుణి 5-11, 11-9, 8-11, 1-11, 14-12, 11-8, 11-9తో సు పీ లింగ్ (చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించింది. నిర్ణాయక ఏడో గేమ్‌లో వరుణి 3-7తో వెనుకబడినా... పట్టువదలకుండా పోరాడి స్కోరును సమం చేయడంతోపాటు విజయాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్లో వరుణి  7-11, 6-11, 11-9, 11-9, 11-3, 13-15, 11-9తో హైదరాబాద్‌కే చెందిన ఆకుల శ్రీజను ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement