భారత జట్లకు రెండో విజయం | India Teams in the second Achievement | Sakshi
Sakshi News home page

భారత జట్లకు రెండో విజయం

Published Wed, Apr 30 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

India Teams in the second Achievement

 ప్రపంచ టీమ్ టీటీ చాంపియన్‌షిప్
 టోక్యో: ప్రపంచ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు దూసుకెళ్తున్నాయి. పురుషుల జట్టు 3-0తో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించగా, మహిళల జట్టు 3-1తో పోర్చుగల్‌పై గెలుపొందింది. ఈ టోర్నీలో ఇరుజట్లకు వరుసగా రెండో విజయమిది.
 
 రెండో రోజు మంగళవారం జరిగిన పురుషుల విభాగం గ్రూప్-ఎఫ్ పోటీల్లో భారత నంబర్‌వన్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ 11-9, 11-7, 7-11, 11-8తో డేవిడ్ పావెల్‌పై, శానిల్ షెట్టి 9-11, 11-9, 13-11, 8-11, 11-3తో హూ హెమింగ్‌పై, హర్మీత్ దేశాయ్ 11-6, 11-7, 11-7తో కేన్ టౌన్‌సెండ్‌పై గెలుపొందారు. మహిళల గ్రూప్-జి పోటీల్లో మానిక బాత్రా 7-11, 11-6, 11-5, 11-7తో రీటా ఫిన్స్‌పై విజయం సాధించగా, శామిని కుమరేశన్ 6-11, 11-5, 9-11, 6-11తో అనా నెవెస్ చేతిలో ఓడింది. ఈ దశలో మధురిక పాట్కర్ 11-7, 11-5, 11-8తో లెయిలా ఒలివీరపై, రివర్స్ సింగిల్స్‌లో శామిని 9-11, 7-11, 11-5, 12-10, 11-6తో రీటాపై గెలువడంతో భారత్ విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement