india teams
-
Archery World Cup Stage 1: భారత జట్లకు నిరాశ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత మహిళల, పురుషుల జట్లకు నిరాశ ఎదురైంది. మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అవ్నీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన భారత జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడే అవకాశం లభించింది. మాడిసన్ కాక్స్, డానిలె లుట్జ్, కాసిడి కాక్స్లతో కూడిన అమెరికా జట్టు 233–225 పాయింట్ల తేడాతో భారత జట్టును ఓడించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె, రజత్ చౌహాన్, ప్రథమేశ్ సమాధాన్ జావ్కర్లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు రెండో రౌండ్లో 234–236 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది. -
పాక్‌తో చర్చలు జరుపుతాం
ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వ్యాఖ్య న్యూఢిల్లీ: డిసెంబరులో పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య సిరీస్ జరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. ఈ విషయం గురించి అక్టోబరు 25 తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు చర్చలు జరుపుతారని చెప్పారు. ‘చర్చల కోసం భారత్‌కు వచ్చిన షహర్యార్ ఖాన్ బృందానికి మేం మంచి ఆతిథ్యం ఇచ్చాం. ఊహించని పరిణామాల వల్ల చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబరు 25న దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇరు బోర్డుల అధ్యక్షులు సమావేశమై సిరీస్ గురించి చర్చిస్తారు’ అని శుక్లా తెలిపారు. అటు పాక్ బోర్డు అధికారులు కూడా బీసీసీఐ నుంచి సానుకూల సంకేతాలు అందాయని తెలిపారు. బీసీసీఐలో అంబుడ్స్‌మన్ ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పారదర్శకతను పెంచేందుకు అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబరు 9న జరిగే ఏజీఎమ్‌లో దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇకపై బోర్డులో పదవుల్లో ఉన్న ఎవరైనా ఎలాంటి నిబంధనలను అతిక్రమించినా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తలెత్తినా ఈ అంబుడ్స్‌మన్ వాటిని పరిశీలిస్తుంది. అలాగే ఇకపై సెలక్షన్ కమిటీ ఎంపిక తర్వాత ఆ జట్టును అధ్యక్షుడు ఆమోదించాల్సిన అవసరం లేకుండా నిబంధనలను మార్చనున్నారు. ఇకపై రాష్ట్రాల సంఘాలు ఆడిట్ చేసిన అకౌంట్స్‌ను అప్పగిస్తేనే తర్వాతి ఏడాదికి నిధులు ఇస్తారు. ఇలా అనేక అంశాలపై మార్పులు, చేర్పులను 9న జరిగే సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది. -
భారత జట్లకు రెండో విజయం
ప్రపంచ టీమ్ టీటీ చాంపియన్‌షిప్ టోక్యో: ప్రపంచ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు దూసుకెళ్తున్నాయి. పురుషుల జట్టు 3-0తో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించగా, మహిళల జట్టు 3-1తో పోర్చుగల్‌పై గెలుపొందింది. ఈ టోర్నీలో ఇరుజట్లకు వరుసగా రెండో విజయమిది. రెండో రోజు మంగళవారం జరిగిన పురుషుల విభాగం గ్రూప్-ఎఫ్ పోటీల్లో భారత నంబర్‌వన్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ 11-9, 11-7, 7-11, 11-8తో డేవిడ్ పావెల్‌పై, శానిల్ షెట్టి 9-11, 11-9, 13-11, 8-11, 11-3తో హూ హెమింగ్‌పై, హర్మీత్ దేశాయ్ 11-6, 11-7, 11-7తో కేన్ టౌన్‌సెండ్‌పై గెలుపొందారు. మహిళల గ్రూప్-జి పోటీల్లో మానిక బాత్రా 7-11, 11-6, 11-5, 11-7తో రీటా ఫిన్స్‌పై విజయం సాధించగా, శామిని కుమరేశన్ 6-11, 11-5, 9-11, 6-11తో అనా నెవెస్ చేతిలో ఓడింది. ఈ దశలో మధురిక పాట్కర్ 11-7, 11-5, 11-8తో లెయిలా ఒలివీరపై, రివర్స్ సింగిల్స్‌లో శామిని 9-11, 7-11, 11-5, 12-10, 11-6తో రీటాపై గెలువడంతో భారత్ విజయం సాధించింది.