OnePlus Nord CE 2 5G Launched in India: Check Here Price and Specifications - Sakshi
Sakshi News home page

అదిరిపోయిన వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ ఫీచర్స్.. ధర కూడా తక్కువే!

Published Thu, Feb 17 2022 9:05 PM | Last Updated on Fri, Feb 18 2022 9:13 AM

OnePlus Nord CE 2 5G With 64 Megapixel Triple Cameras Launched in India - Sakshi

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ 'వన్‌ప్లస్' ఇప్పుడు నార్డ్ సిరీస్‌'లో మరో మొబైల్‌ తీసుకొచ్చింది. ఈ మిడ్ రేంజ్‌ వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్'ను, వన్‌ప్లస్‌ వై1ఎస్ సిరీస్ టీవీతో పాటు నేడు(ఫిబ్రవరి 17) మన దేశంలో లాంచ్ చేసింది. కంపెనీ గత ఏడాది లాంఛ్ చేసిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీకి వారసుడు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ తీసుకొచ్చారు. వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే హెచ్‌డీఆర్+ సపోర్టు చేసే అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 

నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ ధర
మన దేశంలో వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 5జీ 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంటే, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ వేరియెంట్ ధర రూ.24,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బహామా బ్లూ, గ్రే మిర్రర్ రంగులలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్, రిటైల్ స్టోర్స్, అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి అమ్మకానికి వస్తుందని వన్‌ప్లస్‌ తెలిపింది.

నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ స్పెసిఫికేషన్స్

  • 6.43 అంగుళాల(1,080ఎక్స్2,400) ఫుల్‌హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లే
  • హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్
  • ఏఆర్ఎమ్ మాలి-జీ68 జిపియు, 8జిబి ఎల్పిడిడిఆర్4ఎక్స్ ర్యామ్ 
  • 64 ఎంపీ ప్రైమరీ కెమెరా + 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా + 2 ఎంపీ మాక్రో కెమెరా
  • 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 471 సెల్ఫీ కెమెరా 
  • 5జీ కనెక్టివిటీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సి, 
  • 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, యుఎస్బి టైప్-సి పోర్ట్ 
  • 65డబ్ల్యు సూపర్ వీఓఓసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement