మృతదేహాల తరలింపులో ఉత్కంఠ
మృతదేహాల తరలింపులో ఉత్కంఠ
Published Sat, Mar 4 2017 10:48 PM | Last Updated on Fri, May 25 2018 6:02 PM
జంట హత్యల కేసులో కలెక్టరేట్ వద్ద ఆందోళన
బాధితులకు న్యాయం చేయాలని దళిత సంఘాల డిమాండ్
బాధ్యులను అరెస్టు చేయాలని నినాదాలు
భారీగా పోలీస్‌ల మోహరింపు∙
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): ఈ నెల రెండో తేదీన కాకినాడ రామారావుపేటలో జరిగిన జంట హత్యల కేసు బాధిత కుటుంబాలు, దళిత సంఘాల ఆందోళనతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హత్యకు గురైన బడుగు బాల గంగాధరతిలక్ (బాలా), జగడం రామస్వామిల కేసులో ప్రధాన నిందితుడు అశోక్‌కుమార్ ఘటన జరిగిన రోజే పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనలో సుబ్బయ్య హోటల్ యాజమాన్యానికి చెందిన ఇద్దరి ప్రమేయం ఉందని, ఏ1 ముద్దాయిలుగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ మూడు రోజులుగా కాకినాడలో ఆందోళనలు జరుగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మార్చి రెండున జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టమ్ పూర్తయినా మృతదేహాలను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. బా«ధితులకు న్యా యం జరిగేదాకా మృత దేహాలను తీసుకువెళ్లే ప్రశక్తి లేదని ఒక పక్క, పోస్ట్‌మార్టమ్ అయిన మృతదేహాలను మూడు రోజుల్లో తీసుకెళ్లకపోతే మున్సిపల్ కార్పొరేష¯ŒSకి అప్పగించి, దహన సంస్కారాలు పూర్తిచేస్తామని పోలీసులు మరో పక్క ప్రకటించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.
ఆందోళనకు దిగిన దళిత సంఘాలు
కలెక్టరేట్ వద్ద శనివారం ఉదయం జిల్లా దళిత సంఘాలు, బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. çసుబ్బయ్య హŸటల్ సిబ్బందిపై ఏ1గా పరిగణించాలని, ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు జేసీ సత్యనారాయణను కలిసి వారి డిమాండ్లు వినిపించారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని సర్దిచెప్పారు. జేసీ చాంబర్‌లోనే డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావుతో చర్చించారు. దర్యాప్తు సాగుతుందని, ఆందోళన విరమించి, మృతదేహాలను తీసుకెళ్లాలని డీఎస్పీ సూచించగా తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే తీసుకువెళ్తామని, లేదంటే ఉంచేస్తామని దళిత నాయకులు తెలిపారు. దళిత ఐక్యవేదిక నేతలు« డి.శ్యామ్‌సుందర్, సబ్బతి ఫణీశ్వరరావు, గుడాల కృçష్ణ, కొండేపూడి ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మొహరించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే మార్చురీ వద్ద నుంచి కలెక్టరేట్‌కు మృతదేహాలతో ధర్నా చేస్తారన్న సమాచారంతో డీఎస్పీ పరిధిలోని పోలీసులు స్టేషన్ల నుంచి సిబ్బందిని రప్పించి ఈ భారీ బందోబస్తు చేశారు.
Advertisement
Advertisement