muders
-
హత్యలకు దారితీస్తున్న వివాదాలు
జనగామ అర్బన్: జనగామ జిల్లాలో వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న భూ వివాదాలతో పాటు ఆర్థిక పరమైన లావాదేవీలు, అక్రమ సంబంధాలు పలువురి ప్రాణాల మీదకు వస్తున్నాయి. చిన్న తగాదాలే చిలికి చిలికి గాలివానలా తయారై హత్యలకు దారితీస్తున్నాయి. జనగామలో 38 ఏళ్ల క్రితం ఓ టీచర్ హత్యతో మొదలైన సంఘటనలు ప్రెస్టన్ పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ దైదా క్రిష్టోఫర్‌ను అతి కిరాతకంగా హత్యచేసిన సంఘటన వరకు కొనసాగుతూనే ఉన్నాయి. భూ వివాదాలతో పాటు ఇతర కారణాలే హత్యల వరకు దారితీస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. హత్యచేసిన వారిలో కొందరు నేరుగా వచ్చి పోలీసులకు లొంగిపోతుండటంతో జిల్లాలో ఫ్యాక్షన్ కల్చర్‌ను మైమరిపిస్తోంది. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ అవకాశం కోసం ఎదురు చూస్తూ తిరిగి ప్రత్యర్థులను మట్టుపెట్టే విధంగా ప్రణాళికలను రూపొందించుకొని హత్యలు చేయడంతో కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పాటు పోలీసు వ్యవస్థనే ప్రశ్నించే స్థితికి దారి తీస్తుందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. జిల్లాలో పగలు, ప్రతీకారంతో దాడి చేసి హత్యకు గురైన సంఘటనలో కొన్ని... జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామశివారు వడ్డెర కాలనీలో 2013 ఆగçస్టు 13న రియల్టర్ శివరాత్రి విజయ్ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. నెల్లుట్ల గ్రామశివారులోనే పందిగోటి మురళి 2016 డిసెంబర్ 26న హత్యకావించబడ్డాడు. లింగాలఘనపురం మండలం జీడికల్ గ్రామంలో భూ వివాదంలో 2017 సెప్టెంబర్‌లో కొండబోయిన రాములు అనే వ్యక్తి హైదరాబాద్‌లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండ్ కానిస్టేబుల్‌పై ప్రత్యుర్థులు 2018 జూన్ 16న దాడిచేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బచ్చన్నపేట మండలంలో రెండు సంవత్సరాల క్రితం పల్లెపు సిద్ధయ్య అనే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్‌ను కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని హత్య చేశారు. 2017 మేలో మండలంలోని దబ్బగుంటపల్లి గ్రామంలో పంతుల బాలమణి భర్త శ్రీనివాస్‌ను హత్య చేసింది. ఎనిమిది నెలల క్రితం పోచన్నపేటలో నర్సింగ త్రివేణి అనే వివాహితను భర్త హత్య చేశాడు. స్టేషన్‌ఘన్‌పూర్ పరిధి చిల్పూరు మండలం పరిధి పల్లగుట్టకు చెందిన కొంతం భాగ్యలక్ష్మీని 2017 అక్టోబర్ 18న భూ వివాదంలో గిట్టని వారు సుఫారీ హత్యను చేయించారు. స్టేషన్‌ఘన్‌పూర్ శివునిపల్లికి చెందిన రాయపురం ధర్మయ్యను భార్య శాంతమ్మ 2018 ఏప్రిల్ 23న హత్యచేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సంచలనం రెకెత్తిస్తున్న హత్యలు.... జనగామ జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే రెం డు హత్యలు చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనాన్ని రేకెత్తిస్తోంది. వారం రోజుల క్రితం మండలంలోని చీటకోడూరులో మామ చేతిలో హత్యకు గురైన ఉదయ్ సంఘటన మరువక ముందే శుక్రవారం దైదా క్రిష్టోఫర్ హత్యకు గురికావడం గమనార్హం. భూ వివాదాలు, కుటుంబ కలహాలే హత్యలకు దారితీసి ఉంటాయని ప్రజలు చర్చిం చుకుంటున్నారు. జనగామ జిల్లాలోని ప్రెస్టన్ భూములకు సంబంధించి 1990 నుంచి 2007 వరకు ఐదుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఇందులో మాజీ నక్సలెట్స్తో పాటు రౌడీ షీటర్లు ఉండటం గమనార్హం. హత్య కేసు నమోదు దారుణహత్యకు గురైన ప్రెస్టన్ పాఠశాల కరస్పాండెంట్ దైదా క్రిష్టోఫర్ హత్యకేసుకు సంబంధించి పోలీసులు శనివారం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. క్రిష్టోఫర్ కుమారై ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదులో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఉపేష్, తరిగొప్పుల గ్రామానికి చెందిన ఉప్పలయ్యతో పాటు జనగామకు చెందిన కె.యం. జాన్ పేర్లు ఉన్నాయన్నారు. బాధితుల ఫిర్యా దు మేరకు దర్యాప్తును ప్రారంభించామన్నారు. ఇదిలా ఉండగా క్రిష్టోపర్ హత్యకు గురైన సంగతి తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా క్రిష్టోఫర్‌ను హత్య చేసిన వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారన్న విషయాన్ని మాత్రం అధికారులు ధ్రువీకరించలేదు. -
నెత్తుటి మరకలు..ఖైరతాబాద్‌లో యువకుడిని..
నగరంలో శనివారం రాత్రి ఒకే రోజు మూడు హత్యలు చోటు చేసుకున్నాయి. రసూల్‌పురా పరిధిలో ఓ ఇంట్లో కేర్‌టేకర్‌గా పని చేస్తున్న యువకుడు ఇంటి యజమానురాలిని దారుణంగా హత్యచేసి నగలతో పరారయ్యాడు. హిమాయత్ నగర్లో ఓ సెక్యురిటీ గార్డును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఖైరతాబాద్ ప్రాంతంలో ఓ యువకుడిని పాత గొడవల నేపథ్యంలో పథకం ప్రకారం వెంటాడి వేటాడారు.. వివరాల్లో వెళితే.. పని విషయమై గొడవ జరగడంతో.. రసూల్‌పురా : వృద్ధురాలిని ఓ కేర్‌టేకర్ హత్య చేసి నగలతో ఊడాయించిన సం ఘటన తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. నార్త్‌జోన్ డీసీపీ సునీత కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏడబూŠల్య్హెచ్ఓ వేదవిహార్ కాలనీలోని కమలా ఎన్‌క్లేవ్‌లో వ్యవసాయశాఖ రిటైర్డ్ ఉద్యోగి కాంతారావు, సులోచన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఫణికృష్ణ మణికొండలో ఉంటుండగా, కుమార్తె కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. కొద్దిరోజులుగా కాంతారావుకు పక్షవాతంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు అతడి ఆలనాపాలన చూసేందుకు బోడుప్పల్‌లోని సుధా కేర్సేంటర్ను సంప్రదించగా, వారు ఈ నెల 7న వరంగల్‌కు చెందిన అరుణ్‌ను నియమించారు. పదిరోజుల పాటు పనిచేసిన అరుణ్ ఊరికి వెళుతున్నానంటూ సెలవుపై వెళ్లి శనివారం తిరిగి వచ్చి పనిలో చేరాడు. ఈ సందర్భంగా సులోచనకు అరుణ్‌కు పని విషయమై గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన అరుణ్ దిండుతో సులోచన(68)ను ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశాడు. చనిపోలేదనే అనుమానంతో కత్తితో గొంతు కోశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న 4 తులాల మంగళసూత్రం, చేతి రింగు, కమ్మలు, పదితులాల వెండి గొలుసులు, బంగారు పల్లెం తీసుకుని ఊడాయించాడు. ఆదివారం ఉదయం పనిమనిషి తలుపులు తెరచి ఉండటాన్ని గుర్తించి లోపలికి వెళ్లి చూడగా సులోచన విగతజీవిగా కనిపించింది. మొదటి అంతస్తులో ఉన్న వారికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులు, కుమారుడు ఫణికృష్ణకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా అరుణ్ బ్యాగ్‌తో వెళుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బేగంపేట ఏసీపీ, సీఐ రాజేశ్వర్‌రావు, క్లూస్‌టీం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సెక్యురిటీ గార్డు దారుణ హత్య హిమాయత్‌నగర్ : సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన హిమాయత్‌నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఏసీపీ భిక్షంరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, సామర్లకోటకు చెందిన మునిస్వామి(35) భార్య సత్యవేణి, ముగ్గురు పిల్లలతో కలిసి హిమాయత్‌నగర్ స్ట్రీట్‌నెంబర్–1లోని సుకన్య సదన్‌లో ఉంటూ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యురిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య సత్యవేణి ఇళ్లల్లో పనిచేసేది. భార్య పిల్లలతో కలిసి పదిరోజుల క్రితం సామర్లకోటకు వెళ్లగా, తండ్రి రమణ, మునిస్వామి మాత్రమే ఉన్నారు. ఆదివారం ఉదయం వాటి ఇంట్లో నుంచి రక్తం వస్తున్నట్లు గుర్తించిన పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మునిస్వామి తలపై బలమైన ఆయుధంతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించి. కేసును త్వరలోనే చేధించి నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. అర్ధరాత్రి అరాచకం ఖైరతాబాద్ : పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని కొందరు వ్యక్తులు పథకం ప్రకారం దాడి చేసి హత్య చేసిన సంఘటన శనివారం రాత్రి ఖైరతాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకివ వెళితే..కర్నూలు జిల్లా, నందికొట్కూరుకు చెందిన గంగుల శివకిరణ్(33) అలియాస్ కిరణ్ బోరబండలో ఉంటున్నాడు. నేరాలకు అలవాటు పడిన శివకిరణ్పై గోపాల్పురం పోలీస్‌స్టేషన్‌లో పీటా కేసులు, 2014లో కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు, పంజగుట్ట పీఎస్‌లో రెండు కేసులు ఉన్నాయి. 2016లో గోపాల్పురం పోలీసులు అతడిని పీడి యాక్ట్‌పై అరెస్టు చేసి జైలుకు పంపారు. మద్యం మత్తులో జరిగిన గొడవ నేపథ్యంలో..... ఈ నెల 16న శివకిరణ్ మరికొందరు యువకులతో కలిసి దూల్పేట్లో మద్యం సేవిస్తుండగా కన్నా, ఖైరతాబాద్ మహాభారత్‌నగర్‌కు చెందిన రహమాన్ మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా రహమాన్ కత్తితో దాడి చేయడంతో కన్నా చేతికి గాయాలయ్యాయి. ఈ విషయంలో జోక్యం చేసుకున్న శివకిరణ్ గొడవలు వద్దని కేసు లేకుండా చేసేందుకు రూ.10వేలు వైద్యం ఖర్చుల కోసం ఇవ్వాలని రహమాన్‌కు సూచించాడు. ఆ తర్వాత పలు మార్లు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని రహమాన్‌ను బెదిరించాడు. శనివారం సాయంత్రం శివకిరణ్ తన రెండో భార్య సంగు లక్ష్మితో ఐమాక్స్‌లో సినిమా చూసి వస్తుండగా ఫోన్ చేసిన రహమాన్ రూ.3000 ఇస్తానని చెప్పి అతడిని మహాభారత్‌నగర్‌కు పిలిపించాడు. అప్పటికే పథకం ప్రకారం ఇందిరానగర్‌కు చెందిన భరత్ అలియాస్ చాప, మక్తాకు చెందిన అజ్జు, జావెద్, మహ్మద్ మోయిఉద్దీన్లకు అక్కడికి రప్పించాడు. బైక్‌పై అక్కడికి వచ్చిన శివకిరణ్ రహమాన్‌ను డబ్బులు అడగడంతో తన వద్ద రూ. వెయ్యి మాత్రమే ఉన్నట్లు చెప్పడంతో శివకిరణ్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రహమాన్ కత్తితో అతడిపై దా డికి దిగాడు. తప్పించుకుని వెళ్తున్న శివకిరణ్‌ను బీజేఆర్నగర్ రోడ్డులో మరో ముగ్గురు కిందపడేసి పట్టుకోగా, రహæమాన్, భరత్ కత్తులతో దాడి చేసి హత్య చేశారు. 12గంటల్లో నిందితుల పట్టివేత? హత్యకేసులో నిందితులను సైఫాబాద్ పోలీసులు 12గంటల్లోపే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శివకిరణ్ స్నేహితుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శివకిరణ్ మొదటి భార్య శారద స్వగ్రామం నుంచి తిరిగివచ్చిన అనంతరం అతడి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. -
మృతదేహాల తరలింపులో ఉత్కంఠ
జంట హత్యల కేసులో కలెక్టరేట్ వద్ద ఆందోళన బాధితులకు న్యాయం చేయాలని దళిత సంఘాల డిమాండ్ బాధ్యులను అరెస్టు చేయాలని నినాదాలు భారీగా పోలీస్‌ల మోహరింపు∙ కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): ఈ నెల రెండో తేదీన కాకినాడ రామారావుపేటలో జరిగిన జంట హత్యల కేసు బాధిత కుటుంబాలు, దళిత సంఘాల ఆందోళనతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హత్యకు గురైన బడుగు బాల గంగాధరతిలక్ (బాలా), జగడం రామస్వామిల కేసులో ప్రధాన నిందితుడు అశోక్‌కుమార్ ఘటన జరిగిన రోజే పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనలో సుబ్బయ్య హోటల్ యాజమాన్యానికి చెందిన ఇద్దరి ప్రమేయం ఉందని, ఏ1 ముద్దాయిలుగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ మూడు రోజులుగా కాకినాడలో ఆందోళనలు జరుగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మార్చి రెండున జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టమ్ పూర్తయినా మృతదేహాలను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. బా«ధితులకు న్యా యం జరిగేదాకా మృత దేహాలను తీసుకువెళ్లే ప్రశక్తి లేదని ఒక పక్క, పోస్ట్‌మార్టమ్ అయిన మృతదేహాలను మూడు రోజుల్లో తీసుకెళ్లకపోతే మున్సిపల్ కార్పొరేష¯ŒSకి అప్పగించి, దహన సంస్కారాలు పూర్తిచేస్తామని పోలీసులు మరో పక్క ప్రకటించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఆందోళనకు దిగిన దళిత సంఘాలు కలెక్టరేట్ వద్ద శనివారం ఉదయం జిల్లా దళిత సంఘాలు, బాధిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. çసుబ్బయ్య హŸటల్ సిబ్బందిపై ఏ1గా పరిగణించాలని, ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు జేసీ సత్యనారాయణను కలిసి వారి డిమాండ్లు వినిపించారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని సర్దిచెప్పారు. జేసీ చాంబర్లోనే డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావుతో చర్చించారు. దర్యాప్తు సాగుతుందని, ఆందోళన విరమించి, మృతదేహాలను తీసుకెళ్లాలని డీఎస్పీ సూచించగా తమ డిమాండ్లు పరిష్కరిస్తేనే తీసుకువెళ్తామని, లేదంటే ఉంచేస్తామని దళిత నాయకులు తెలిపారు. దళిత ఐక్యవేదిక నేతలు« డి.శ్యామ్‌సుందర్, సబ్బతి ఫణీశ్వరరావు, గుడాల కృçష్ణ, కొండేపూడి ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను మొహరించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే మార్చురీ వద్ద నుంచి కలెక్టరేట్‌కు మృతదేహాలతో ధర్నా చేస్తారన్న సమాచారంతో డీఎస్పీ పరిధిలోని పోలీసులు స్టేషన్ల నుంచి సిబ్బందిని రప్పించి ఈ భారీ బందోబస్తు చేశారు. -
వణుకుతున్న చెన్నై వాసులు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో వరుస హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి దారుణ హత్యాకాండను మరవకముందే మరో కిరాతకం చోటు చేసుకుంది. నందనం ప్రాంతంలో వేలు అనే రౌడీషీటర్ ను దుండగులు సోమవారం నరికి చంపారు. ప్రత్యర్థి గ్రూపు అతడిని హతమార్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నందనం ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఆరు హత్యలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. చెన్నైలో పేరుమోసిన రౌడీషీటర్ సీడీ మణి అనుచరులతో సహా 161 మంది నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు స్వాతి హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తు్న్నారు. నుంగంబాక్కమ్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. హంతకుడు నీలం రంగు చొక్క ధరించివున్నాడని, హత్య చేసిన తర్వాత రైల్వే పట్టాలు దాటి పారిపోయినట్టు గుర్తించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్లలోని సీసీ కెమెరా ఫుటేజీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.