రూ.3,555కే ఇంటెక్స్ 3జీ ఫోన్ | At Rs 3,555, Intex Aqua 3G is as cheap as smartphones get | Sakshi
Sakshi News home page

రూ.3,555కే ఇంటెక్స్ 3జీ ఫోన్

Published Thu, Jun 19 2014 12:28 AM | Last Updated on Fri, May 25 2018 6:02 PM

రూ.3,555కే ఇంటెక్స్ 3జీ ఫోన్ - Sakshi

రూ.3,555కే ఇంటెక్స్ 3జీ ఫోన్

న్యూఢిల్లీ: ఇంటెక్స్ కంపెనీ కొత్త 3జీ స్మార్ట్‌ఫోన్, ఆక్వా 3జీని బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.3,555 అని ఇంటెక్స్ బిజినెస్ హెడ్(సంజయ్ కుమార్ కలిరోనా) చెప్పారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 1 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ రామ్, 12.25 ఎంబీ బిల్టిన్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ,  1400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో పలువురు వినియోగదారులు ఫీచర్ ఫోన్ల నంచి స్మార్ట్‌ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారని, అందుకే మొబైల్ కంపెనీలు అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందించాల్సిన అవసరముందని సంజయ్ కుమార్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement