న్యూఢిల్లీ: ఇంటెక్స్ టెక్నాలజీస్ శుక్రవారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఆక్వా ఐ4ప్లస్ పేరుతో అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.7,600గా నిర్ణయించామని ఇంటెక్స్ టెక్నాలజీస్ బిజినెస్ మొబైల్ హెడ్ సంజయ్ కుమార్ కలిరోణ చెప్పారు. డ్యుయల్ సిమ్ ఫీచరున్న 3జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 5 అంగుళాల డిస్‌ప్లే, 1.2 గిగా హెట్స్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్ 4.0 వంటి ప్రత్యేకతలున్నాయి. 4.2.2 జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఉచితమని సంజయ్ వివరించారు.
వుయ్ చాట్, ఓఎల్‌ఎక్స్ వంటి ఇన్‌స్టంట్ మెసెజింగ్ యాప్స్‌ను ప్రి-ఇన్‌స్టాల్‌గా అందిస్తున్నామని పేర్కొన్నారు. మాతృభాష యాప్ ద్వారా తెలుగు, హిందీ సహా మొత్తం 22 భారతీయ భాషల్లో వినియోగదారులు తమకు నచ్చిన భాషలో ఈ ఫోన్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు.