రిలయన్స్ జియో 4జీ హ్యాండ్‌సెట్స్ ఆవిష్కరణ | Reliance Jio unveils logo, hoardings for 4G devices | Sakshi
Sakshi News home page

రిలయన్స్ జియో 4జీ హ్యాండ్‌సెట్స్ ఆవిష్కరణ

Published Sat, Jan 9 2016 12:50 AM | Last Updated on Fri, May 25 2018 6:02 PM

రిలయన్స్ జియో 4జీ హ్యాండ్‌సెట్స్ ఆవిష్కరణ - Sakshi

రిలయన్స్ జియో 4జీ హ్యాండ్‌సెట్స్ ఆవిష్కరణ

అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం రిలయన్స్ జియో తాజాగా చౌక ధరల 4జీ మొబైల్ హ్యాండ్‌సెట్లను ‘ఎల్‌వైఎఫ్’ బ్రాండ్ పేరుతో ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన తొలి హోర్డింగ్స్‌ను అమరావతిలో ఏర్పాటుచేసినట్లు కంపెనీ అధికారి ఒకరు ట్విటర్‌లో తెలిపారు. ఈ మొబైల్స్ వినియోగదారులను జియో నెట్‌వర్క్‌పై 4జీ, వై-ఫై నెట్‌వర్క్‌ల్లో వాయిల్ కాల్స్, హైడెఫినేషన్ వీడియో కాల్స్‌కు అనుమతిస్తాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో డ్యూయెల్ సిమ్ ఫీచర్ ఉంటుంది. ఇందులో జియో సిమ్‌తోపాటు ఇతర కంపెనీ సిమ్‌లను కూడా పనిచేస్తాయి.

ప్రస్తుతం ఎల్‌వైఎఫ్ హ్యాండ్‌సెట్స్ రిలయన్స్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకమైన వై-ఫై పరికరాలను కూడా అందిస్తోంది. ఇవి 50-70 ఎంబీపీఎస్ స్పీడ్‌ను అందిస్తాయి. అలాగే ఒకేసారి 10 డివెసైస్‌ను కనె క్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement