నోకియా ఎక్స్ సిరీస్‌లో కొత్త మొబైల్ | Nokia X2: Android-Smartphone ohne Google-Dienste für 130 Euro | Sakshi
Sakshi News home page

నోకియా ఎక్స్ సిరీస్‌లో కొత్త మొబైల్

Published Wed, Jun 25 2014 2:05 AM | Last Updated on Fri, May 25 2018 6:02 PM

నోకియా ఎక్స్ సిరీస్‌లో కొత్త మొబైల్ - Sakshi

నోకియా ఎక్స్ సిరీస్‌లో కొత్త మొబైల్

- నోకియా ఎక్స్2.. డ్యుయల్ సిమ్
- ధర రూ.10,000 లోపు!
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ డివెసైస్ సంస్థ నోకియా ఎక్స్ మొబైల్ ఫోన్లలో  మరో కొత్త మోడల్, నోకియా ఎక్స్2ను మంగళవారం ఆవిష్కరించింది. దీని ధరను 99 యూరోలుగా  కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ భారత్‌లో రూ.10,000 ధరలో లభించవచ్చు. ఈ ఫోన్‌ను తక్షణం ఎంపిక చేసిన దేశాల్లో విక్రయిస్తామని కంపెనీ అధికారిక బ్లాగ్‌లో పేర్కొంది. ఈ బ్లాగ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..., ఈ డ్యుయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లో 1.2 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 4.3 అంగుళాల క్లియర్‌బ్లాక్ డిస్‌ప్లే, 5 మెగా పిక్సెల్ కెమెరా, 1,800
 
ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.
స్కైప్, అవుట్‌లుక్‌డాట్‌కామ్ వంటి మైక్రోసాఫ్ట్  యాప్‌లు, 7 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ వంటి ఫీచర్లున్నాయి. ఫాస్ట్‌లైన్‌తో పాటు యాప్స్‌లిస్ట్ పేరుతో మరో కొత్త నావిగేషన్ ఆప్షన్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఈ ఫోన్ మోటరోలా మోటో జీ, హెచ్‌టీసీ డిజైర్, శామ్‌సంగ్ డ్యుయోస్ వంటి ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. చౌక ధరల స్మార్ట్‌ఫోన్ల పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా మైక్రోసాఫ్ట్  కంపెనీ ఈ ఫోన్‌ను తెస్తోంది.
 
శామ్‌సంగ్, హెచ్‌టీసీ, జియోని, హువాయ్, జెడ్‌టీఈ వంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు కార్బన్, లావా, మైక్రోమ్యాక్స్ వంటి దేశీయ మొబైల్ కంపెనీలందించే చౌక ధరల స్మార్ట్‌ఫోన్‌ల పోటీని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నాల్లో భాగంగా మైక్రోసాఫ్ట్ డివెసైస్ ఈ ఫోన్‌ను అందిస్తోంది. గతేడాది భారత్‌లో 4.4 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు విక్రయమయ్యాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement