3వేలకే ఫ్రంట్ కెమెరాతో స్మార్ట్ఫోన్!! | Celkon launches cheapest Kitkat-powered phone on Snapdeal | Sakshi
Sakshi News home page

3వేలకే ఫ్రంట్ కెమెరాతో స్మార్ట్ఫోన్!!

Published Mon, Jun 16 2014 4:29 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

3వేలకే ఫ్రంట్ కెమెరాతో స్మార్ట్ఫోన్!! - Sakshi

3వేలకే ఫ్రంట్ కెమెరాతో స్మార్ట్ఫోన్!!

చవక సెల్ఫోన్లతో మార్కెట్లో తనదైన వాటాను ఆక్రమిస్తున్న సెల్కాన్ మరో అడుగు ముందుకేసింది. కేవలం 3 వేల రూపాయలకే ఫ్రంట్ కెమెరాతో కూడిన స్మార్ట్ఫోన్ను అందిస్తోంది. 'క్యాంపస్ ఎ35కె' పేరుతో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ను అచ్చంగా స్నాప్డీల్ ద్వారా మాత్రమే అమ్ముతోంది. దీని ధరను రూ. 2,999గా నిర్ణయించింది. ఆండ్రాయిడ్ కిట్కాట్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే స్మార్ట్ఫోన్లలో ఇదే అత్యంత చవకైనదని కంపెనీ చెబుతోంది. డ్యూయల్ సిమ్లు పనిచేసే ఈ ఫోన్కు 1గిగా హెర్ట్జ్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్ ఉన్నాయి. 3.5 అంగుళాల డిస్ప్లేతో పాటు 3.2 మెగాపిక్సెల్ వెనక కెమెరా, .3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా , 512 ఎంపీ ఇన్బిల్ట్ స్టోరేజి ఉన్నాయి. దీన్ని 32 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

వై-ఫై,  బ్లూటూత్, మైక్రో యూఎస్బీ, ఏజీపీఎస్ కనెక్టివిటీలతో పాటు దీనికి 3జీ కనెక్టివిటీ కూడా ఉంది. ఆండ్రాయడ్ కిట్కాట్ అనేది గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్లో అత్యంత తాజా వెర్షన్. ఇప్పటివరకు జెల్లీబీన్ ఓఎస్ ఉన్న ఫోన్లు మార్కెట్లో కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. దాంతో ఇప్పుడు అంతా కొత్త ఓఎస్ మీదే దృష్టిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement