సెల్‌కాన్‌ 3జీ స్మార్ట్‌ఫోన్‌ @ రూ.1,999 | Celkon Campus A355 With 3.5-Inch Display | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్‌ 3జీ స్మార్ట్‌ఫోన్‌ @ రూ.1,999

Published Tue, Mar 14 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

సెల్‌కాన్‌ 3జీ స్మార్ట్‌ఫోన్‌  @ రూ.1,999

సెల్‌కాన్‌ 3జీ స్మార్ట్‌ఫోన్‌ @ రూ.1,999

మొబైల్స్‌ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్‌ తాజాగా ఏ355 పేరుతో 3జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,999 ధరలో ప్రవేశపెట్టింది.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్‌ తాజాగా ఏ355 పేరుతో 3జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,999 ధరలో ప్రవేశపెట్టింది. ఈ ధరలో ప్రస్తుతం దేశంలో ఏ కంపెనీ కూడా 3జీ మోడల్‌ను విక్రయించడం లేదని సంస్థ సీఎండీ వై.గురు తెలిపారు. 3.5 అంగుళాల టచ్‌ స్క్రీన్, 1 గిగాహెట్జ్‌ సింగిల్‌ కోర్‌ ప్రాసెసర్, ఆన్‌డ్రాయిడ్‌ కిట్‌క్యాట్, 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ ఇంటర్నల్‌ మెమరీ పొందుపరిచారు. 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్‌ మెమరీ, 2 ఎంపీ కెమెరా, ఫ్రంట్‌ కెమెరా, 3జీ వీడియో కాల్, 1200 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇతర ఫీచర్లు. బరువు 97.55 గ్రాములు ఉంది. అయిదు రంగుల్లో లభిస్తుంది.

హైఎండ్‌పై గురి..: ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో సెల్‌కాన్‌ చేతులు కలిపింది. కెమెరా, మెమరీ, డిస్‌ప్లే విషయంలో  స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్లకు వినూత్న అనుభూతి కల్పించే లక్ష్యంగా ఈ కంపెనీలతో కలిసి పనిచేస్తామని గురు వెల్లడించారు. ఏప్రిల్‌ తర్వాత నుంచి రూ.10 వేలు ఆపైన విభాగంలో కొత్త మోడళ్లు తీసుకొస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement