
రూ.2,999కే ‘సీటీ111’ ట్యాబ్లెట్
దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ కంపెనీ సెల్‌కాన్ తాజాగా ‘సీటీ111’ ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
హైదరాబాద్: దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ కంపెనీ సెల్‌కాన్ తాజాగా ‘సీటీ111’ ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.2,999. ఇందులో 7 అంగుళాల తెర, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ఓఎస్, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, వై-ఫై, 2 ఎంపీ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరా, ఓటీజీ సపోర్ట్, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
‘సీటీ111’ ట్యాబ్లెట్ తమ వృద్ధికి మరింత దోహదపడుతుందని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ వై.గురు తెలిపారు. దేశీ, విదేశీ మార్కెట్లలో ఇతర మొబైల్ హ్యాండ్‌సెట్స్ కంపెనీల కన్నా ముందుండాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు.