
సెల్‌కాన్ నుంచి మిలీనియా క్యూ450
మొబైల్ ఫోన్ల రంగ సంస్థ సెల్‌కాన్ తాజాగా మిలీనియా సిరీస్‌లో క్యూ450 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
ధర రూ. 4,799
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగ సంస్థ సెల్‌కాన్ తాజాగా మిలీనియా సిరీస్‌లో క్యూ450 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అందమైన బ్యాక్ కవర్‌తో గోల్డ్, వైట్, గ్రే రంగుల్లో దీనిని రూపొందించింది. 4.5 అంగుళాల కెపాసిటివ్ ఎఫ్‌డబ్ల్యువీజీఏ, ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి. డ్యూయల్ సిమ్, 3జీ, వీడియో కాలింగ్, 5 ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, 2ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,800 ఎంఏహెచ్ బ్యాటరీ, వైఫై, బ్లూటూత్ ఫోన్ ఇతర విశిష్టతలు. ధర రూ.4,799. మిలీనియా సిరీస్‌లో తొలిసారి రూ.5 వేలలోపు ధరలో ఈ మోడల్ తీసుకొచ్చామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. మార్కెట్లో ఈ మోడల్ సంచలనం సృష్టించడం ఖాయమని అన్నారు.
వచ్చే త్రైమాసికంలో..
2015-16 తొలి త్రైమాసికంలో 20 మోడళ్ల వరకు విడుదల చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. వీటిలో నాలుగు ట్యాబ్లెట్ మోడళ్లు ఉంటాయని వై.గురు తెలిపారు. 5 అంగుళాల స్క్రీన్‌తో రెండు వైపులా గొరిల్లా గ్లాస్‌తో ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ తదితర ఫీచర్లతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు చెప్పారు. మందం 7 మిల్లీమీటర్ల లోపే ఉంటుందని వివరించారు. రూ.10 వేల ధరలో విడుదల చేస్తామని చెప్పారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన స్మార్ట్‌ఫోన్ సైతం ప్రవేశపెడతామన్నారు. మే నెల లో 4జీ హ్యాండ్‌సెట్స్ విడుదల చేస్తామని వెల్లడించారు.