సెల్‌కాన్ డైమండ్ ప్రో వచ్చేసింది.. | celkon Diamond Pro lounched | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్ డైమండ్ ప్రో వచ్చేసింది..

Published Sat, Dec 12 2015 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

సెల్‌కాన్ డైమండ్ ప్రో వచ్చేసింది..

సెల్‌కాన్ డైమండ్ ప్రో వచ్చేసింది..

మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్ తాజాగా డైమండ్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్ తాజాగా డైమండ్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. గొరిల్లా గ్లాస్, మెటాలిక్ ఫినిషింగ్ ఈ మోడల్‌కు ఉన్న ప్రత్యేకలు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కన్నడ యువ హీరో యశ్ చేతుల మీదుగా కంపెనీ ఈ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 4.5 అంగుళాల స్క్రీన్, ఫుల్ ల్యామినేషన్, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఓఎస్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీని పొందుపరిచారు. 3జీ, ఫ్లాష్‌తో 5 ఎంపీ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1,650 ఎంఏహెచ్ బ్యాటరీ ఇతర ఫీచర్లు. ధర రూ.5,777. అన్ని మొబైల్ రిటైల్ దుకాణాల్లో లభిస్తుంది. భారత్‌లో ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా నిలవడంలో ఎంతో ప్రగతిని సాధించామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో కంపెనీ వాటా మరింత వృద్ధికి డైమండ్ ప్రో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో సెల్‌కాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా యష్ వ్యవహరిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement