సెల్‌కాన్ నుంచి 5 ఎంపీ సెల్ఫీ ఫోన్ | From the celkon 5MP selfi phone | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్ నుంచి 5 ఎంపీ సెల్ఫీ ఫోన్

Published Fri, Feb 6 2015 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

సెల్‌కాన్ నుంచి 5 ఎంపీ సెల్ఫీ ఫోన్

సెల్‌కాన్ నుంచి 5 ఎంపీ సెల్ఫీ ఫోన్

ప్రముఖ మొబైల్ సంస్థ సెల్‌కాన్ తన మిల్లీనియా సిరీస్‌లో ‘ఎమ్‌ఈ క్యూ54’ అనే మరో రకం మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ సంస్థ సెల్‌కాన్ తన మిల్లీనియా సిరీస్‌లో ‘ఎమ్‌ఈ క్యూ54’ అనే మరో రకం మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫ్లాష్‌తో కూడిన 5 ఎంపీ రియర్ కెమెరా, 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతోపాటు 5 రకాల రంగుల్లో లభించే ఈ ఫోన్ ధర రూ.5555 అని సెల్‌కాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కిట్ క్యాట్-4.4.2 ఓఎస్‌పై నడిచే ఈ ఫోన్‌లో 1.2 గిగా క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబీ రామ్, 3జి- వీడియో కాలింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌తో సహా ఈ ఏడాది రెండు విభిన్న మొబైళ్లను మార్కెట్‌లోకి విడుదల చేశామని సంస్థ సీఎండీ వై.గురు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement