మైక్రోసాఫ్ట్‌తో సెల్‌కాన్ జట్టు
విండోస్ ఫోన్ విన్400 ఆవిష్కరణ
భారత్‌లో చవకైన విండోస్ ఫోన్
మార్చికల్లా విండోస్ ట్యాబ్లెట్ పీసీ
సెల్‌కాన్ సీఎండీ వై.గురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సెల్‌కాన్ విండోస్ విభాగంలోకి ప్రవేశించింది. విన్400 పేరుతో విండోస్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారమిక్కడ ఆవిష్కరించింది. ధర రూ.4,979. ఇంత తక్కువ ధరలో భారత్‌లో లభించే విండోస్ ఫోన్ ఇదే కావడం విశేషం. 4 అంగుళాల డబ్ల్యువీజీఏ డిస్‌ప్లే, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబీ ర్యామ్, ఫ్లాష్ లైట్-ఆటో ఫోకస్‌తో 5 ఎంపీ కెమెరా, 1.3 ఎంపీ ముందు కెమెరాను నిక్షిప్తం చేశారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వన్‌డ్రైవ్‌లో 15 జీబీ ఉచిత స్టోరేజ్ ఉంది. 3జీ, డ్యూయల్ సిమ్, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ, 10.5 మిల్లీమీటర్ల మందం, 120 గ్రాముల బరువు ఇతర విశిష్టతలు.
విండోస్‌లో మరిన్ని మోడళ్లు..: మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో మార్చికల్లా మరో రెండు విండోస్ ఫోన్లు తేనున్నట్టు సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. వీటిలో 5 అంగుళాల స్క్రీన్ కలిగిన మోడల్ కూడా ఉంటుందన్నారు. ట్యాబ్లెట్ పీసీని రూ.10 వేల లోపు ధరలో పరిచయం చేస్తామన్నారు. విన్400కు మంచి స్పందన ఉందని, డిసెంబర్‌లోనే దేశీయ మార్కెట్లో 20 వేల యూనిట్లు విక్రయించే అవకాశముందన్నారు.
అక్టాకోర్ ప్రాసెసర్తో కూడిన ఫోన్‌ను ఈ నెలలోనే మార్కెట్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. విండోస్ అనగానే ఖరీదైన ఫోన్ అనుకుంటారు. సామాన్యులకూ అందుబాటులో ఉండాలని విన్400 ధర రూ.5 వేల లోపే నిర్ణయించామని సెల్‌కాన్ ఈడీ మురళి రేతినేని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల విభాగంలో సెల్‌కాన్ వాటాను ప్రస్తుతమున్న 4 శాతం నుంచి మార్చికల్లా 7-8 శాతానికి చేర్చాలని లక్ష్యం విధించుకున్నట్టు చెప్పారు.
2015లో 4కె స్క్రీన్..: అత్యంత స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ కలిగిన 4కె రిజొల్యూషన్(4096గీ2160) స్క్రీ న్ 2015లో కార్యరూపం దాలుస్తుందని క్వాల్‌కామ్ ఇండియా బిజినెస్ డెవలప్‌మెంట్ డెరైక్టర్ రోహిత్ కపూర్ తెలిపారు. విండోస్ ఫోన్ల విపణిలో మరిన్ని కంపెనీలతో జట్టుకడతామని మైక్రోసాఫ్ట్ ఇండియా మొబిలిటీ డెరైక్టర్ రాజీవ్ అహ్లవత్ పేర్కొన్నారు.