లాస్ట్‌ డే.. భలే ఛాన్స్‌.. బంగారం తులం ఎంతంటే.. | gold and silver rates today on market in telugu states | Sakshi
Sakshi News home page

లాస్ట్‌ డే.. భలే ఛాన్స్‌.. బంగారం తులం ఎంతంటే..

Published Tue, Dec 31 2024 11:43 AM | Last Updated on Tue, Dec 31 2024 12:53 PM

gold and silver rates today on market in telugu states

సేఫ్డ్‌ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీ(Equity)ల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర(Gold Rate Today) తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం 2024 ఏడాది చివరి రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,100 (22 క్యారెట్స్), రూ.77,560 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 తగ్గింది.

చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,560 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 తగ్గి రూ.71,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 దిగజారి రూ.77,710 వద్దకు చేరింది.

సిల్వర్ ధరలు

బంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. సోమవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,900 తగ్గి రూ.98,000కు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement