Gold rallies
-
ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..
ఈక్విటీ మార్కెట్లు ఇటీవల ఒడిదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారంలో పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. నిన్నటి ధరతో పోలిస్తే 2025 ఏడాది మొదటిరోజు బుధవారం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,500 (22 క్యారెట్స్), రూ.78,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 చొప్పున పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.71,650కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 అధికమై రూ.78,150 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుఏడాది ప్రారంభ రోజు బుధవారం బంగారం ధరలు పెరిగినట్లుగా వెండి ధరల్లో మార్పులేమి రాలేదు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర మారకుండా స్థిరంగా కేజీకి రూ.98,000 వద్దే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాస్ట్ డే.. భలే ఛాన్స్.. బంగారం తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీ(Equity)ల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే మంగళవారం బంగారం ధర(Gold Rate Today) తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం 2024 ఏడాది చివరి రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,100 (22 క్యారెట్స్), రూ.77,560 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,560 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 తగ్గి రూ.71,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 దిగజారి రూ.77,710 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. సోమవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు(Silver Price) రూ.1,900 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
తులం బంగారం ధర ఎలా ఉందంటే..
ఇటీవల కాలంలో మదుపర్లు స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆదివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,000 (22 క్యారెట్స్), రూ.77,450 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శనివారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలో ఎలాంటి మార్పులు లేరు.చెన్నైలో ఆదివారం బంగారం ధరలు వరుసగా రూ.71,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,450 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)వద్ద ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా పసిడి ధరలో మార్పు లేదు.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్థిరంగానే ఉంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.71,150కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.77,600గా ఉంది. మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే బంగారంలాగే ఎలాంటి మార్పులేదు. దాంతో కేజీ వెండి రూ.99,000 వద్దే స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
దడ పుట్టిస్తున్న బంగారం! తులం ఎంతంటే..?
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కొంత ఒడిదొడుకుల్లో ఉన్న బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.72,050 (22 క్యారెట్స్), రూ.78,600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.750, రూ.820 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.820 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.72,050 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.78,600 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.750 పెరిగి రూ.72,200కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.820 పెరిగి రూ.78,750 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలతోపాటు వెండి ధరల్లోనూ భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు ఏకంగా కేజీపై రూ.4,000 పెరిగి రూ.1,04,000కు చేరుకుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వరుసగా మూడు రోజులపాటు తట్టిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.71,300 (22 క్యారెట్స్), రూ.77,780 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.430 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.430 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.71,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,780 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.71,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.430 పెరిగి రూ.77,930 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ..వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,01,000 వద్ద నిలిచింది. నిన్న మాత్రం కేజీపై రూ.500 తగ్గింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
టపాసులా పేలుతున్న బంగారం ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో దీపావళి రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.74,550 (22 క్యారెట్స్), రూ.81,330 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.150, రూ.170 పెరిగింది.చెన్నైలో బంగారం..చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.74,550 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.81,330 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దిల్లీలో ఇలా..దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.150 పెరిగి రూ.74,700కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.170 పెరిగి రూ.81,480 వద్దకు చేరింది.ఇదీ చదవండి: భారీ వేతనం.. కొంత వద్దనుకున్న సత్య నాదెళ్ల!సిల్వర్ ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ..వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ.1,09,000 వద్ద నిలిచింది. నిన్న మాత్రం కేజీపై రూ.2,100 పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పసిడి స్పీడెందుకు? ఇప్పుడు కొనొచ్చా?
కొద్ది నెలలుగా బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పసిడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో గత వారం న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) పసిడి 1800 డాలర్లను అధిగమించింది. 2011 తదుపరి ఇది గరిష్టంకాగా.. ఇందుకు పలు అంశాలు కారణమవుతున్నట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఇటీవల దేశీయంగానూ బంగారం ధరలు మెరుస్తున్నాయి. శుక్రవారానికల్లా 10 గ్రాముల ధర రూ. 49,240 వద్ద స్థిరపడింది. వెరసి ఈ ఏడాది(2020)లో ఇప్పటివరకూ పసిడి ధరలు 25 శాతం లాభపడ్డాయి. ఎందుకంటే? గతేడాది(2019)లో అమెరికా, చైనా మధ్య నడిచిన వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులకు దారితీశాయి. ఆపై చైనాలో పుట్టి యూరోపియన్ దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కారణంగా అల్లకల్లోల పరిస్థితులు తలెత్తాయి. దీంతో పలు దేశాలు లాక్‌డవున్‌ల విధింపువైపు మొగ్గు చూపాయి. ఫలితంగా ఆరోగ్య, ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయి. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు పెట్టుబడులు బంగారంవైపు మళ్లుతుంటాయి. దీనికితోడు ఇంతక్రితం స్టాక్ మార్కెట్లు, రియల్టీ ధరల పతనంతో చౌకగా లభిస్తున్న నిధులు బంగారంలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులుగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపుతోపాటు.. భారీ లిక్విడిటీని కల్పిస్తుండటంతో ఇటీవల పసిడితోపాటు తిరిగి స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చూస్తే.. కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 6 నెలల్లోనే.. కొద్ది రోజులుగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్‌లు)లోకి నిధులు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో జూన్ చివరికల్లా ఈటీఎఫ్‌ల హోల్డింగ్స్ 3621 టన్నులకు చేరాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరాల ప్రకారం ఇవి ఈటీఎఫ్‌ల చరిత్రలోనే అత్యధికంకాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(జనవరి-జూన్)లో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్‌లు నికరంగా 734 టన్నులను జమ చేసుకున్నాయి. వీటి విలువ 39.5 బిలియన్ డాలర్లు! ఇవి 2009లో జమ అయిన మొత్తం 646 టన్నులతో పోల్చినా అధికంకావడం విశేషం! దేశీయంగా దేశీయంగానూ పసిడికి డిమాండ్ పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ. 2040 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. 2010 జనవరి తదుపరి 2020లో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ. 3,530 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు వేల్యూ రీసెర్చ్ పేర్కొంది. గతేడాది జూన్ నుంచీ చూస్తే బంగారం ధరలు దాదాపు 42 శాతం ర్యాలీ చేసినట్లు తెలియజేసింది. ర్యాలీ ఓకే.. కానీ దేశీయంగా కోవిడ్-19 ప్రభావంతో ఉపాధి కోల్పోవడం, వేతనాలలో కోత, బిజినెస్‌లు మందగించడం వంటి అంశాలు బంగారు ఆభరణాలు, పసిడి కొనుగోళ్లను దెబ్బతీస్తున్నట్లు బులియన్ వర్తకులు తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ఇకపై బంగారం ధరలు భారీగా ర్యాలీ చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇకపైన కూడా పటిష్టంగా కదిలే వీలున్నట్లు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా చెబుతున్నారు. రానున్న 12-18 నెలల కాలంలో 10 గ్రాముల ధర రూ. 55,000 వరకూ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే అంటే ఎంసీఎక్స్‌లో వారాంతాన ఆగస్ట్ కాంట్రాక్ట్ ధర రూ. 48,900 వద్ద ముగిసింది. రానున్న కాలంలో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు, కోవిడ్ నేపథ్యంలో కేంద్ర బ్యాంకుల చర్యలు వంటి అంశాలు బంగారం ధరల్లో ఆటుపోట్లకు కారణంకావచ్చని విశ్లేషిస్తున్నారు. దీంతో ధరలు పతనమైతే రూ. 44,200 స్థాయిలో పసిడికి సపోర్ట్ లభించవచ్చని సుమీత్ భావిస్తున్నారు. రక్షణ కోసమైతే ప్రస్తుత స్థాయిలో పసిడిని లాభాల కోసం కొనుగోలు చేయడం సమంజసంకాదని మనీసేఫ్ ఫైనాన్షియిల్ సర్వీసెస్ వ్యవస్థాపకులు అజయ్ కే వాడేకర్ చెబుతున్నారు. హెడ్జింగ్‌కు అంటే.. పోర్ట్‌ఫోలియోల రిస్క్‌ను తగ్గించుకునే బాటలో వినియోగించుకోవచ్చని తెలియజేశారు. పసిడి ధరల్లో గత కొద్ది రోజులుగా నమోదవుతున్న ర్యాలీ స్పీడ్ ఇకపై నీరసించవచ్చని భావిస్తున్నారు. పసిడిలో పెట్టుబడుల కోసం గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్లను పరిగణించవచ్చని సూచించారు. -
పెరిగిన బంగారం ధరలు.. లాభపడదామా..?
బంగారం ధరలు గడిచిన ఏడాది కాలంలో 40 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో బంగారానికి తప్పకుండా చోటు ఇవ్వాలన్నది నిపుణుల సూచన. ఆ దిశగా బంగారంలో పెట్టుబడులు పెడితే మంచిదే. కానీ, ప్రత్యేక అవసరాల కోసం, స్వల్ప కాల అవసరాల కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారూ ఉన్నారు. ప్రస్తుత విపత్తు సమయంలో ప్రతికూలతలను గట్టెక్కేందుకు... సార్వభౌమ బంగారం బాండ్లలో (గోల్డ్ బాండ్స్/ఎస్జీబీ) పెట్టుబడులను తీసేసుకోవాలని అనుకునే వారు లేకపోలేదు. బంగారం ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసిన వారు వాటిని విక్రయించుకోవడం ఎంతో సులభం. కానీ, భారత ప్రభుత్వం జారీ చేసే సౌర్వభౌమ బంగారం బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం ఆప్షన్లు పరిమితం. ∙ ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ ప్రధాన సూచీ 21 శాతం మేర నష్టపోతే, ఇదే సమయంలో బంగారం ధరలు 17 శాతం మేర ప్రియంగా మారాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఈ బంగారం, బంగారంలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, ఎస్‌జీబీలో పెట్టుబడులపై లాభాల వర్షం కురిసింది. ముఖ్యంగా ఎస్‌జీబీల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండింది. భౌతిక బంగారంలో పెట్టుబడులను నిరుత్సాహపరచడం, బంగారంలో పెట్టుబడులకు డిజిటల్ దిశగా మళ్లించడమే ఎస్జీబీని తీసుకురావడంలోని ఉద్దేశ్యం. ఈ ప్రయోజనం కొంత వరకు నెరవేరిందనే చెప్పుకోవాలి. భాతిక బంగారంతో పోలిస్తే ఎస్‌జీబీలో పెట్టుబడులపై వార్షికంగా 2.50% వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో బంగారం ధరలు పెరిగితే రెండు విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఎస్జీబీ మొదటి ఇష్యూ 2015 నవంబర్‌లో సిరీస్–1 పేరుతో వచ్చింది. అప్పటి నుంచి చూస్తే బంగారం ధరల్లో ర్యాలీ కారణంగా పెట్టుబడి 84 శాతం వృద్ధి చెందింది. అదే విధంగా 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ మాసంలో ఎస్జీబీ ఇష్యూలో ఇన్వెస్ట్‌మెంట్‌పైనా రాబడి 48 శాతంగా ఉంది. విక్రయించడానికి సరైన సమయమేనా..? చరిత్రను పరిశీలిస్తే.. ప్రతీ మార్కెట్ సైకిల్ (వివిధ సందర్భాలు)లోనూ బంగారం ర్యాలీ చేసినట్టు ఆధారాల్లేవు. బంగారానికి సురక్షిత పెట్టుబడి సాధనమనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ల పతనాల్లో బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు పోటీపడతారు. ఫలితంగా ఆయా సందర్భాల్లో బంగారం ధరల్లో ర్యాలీ నడుస్తుంటుంది. 2019 మధ్య భాగం నుంచి బంగారంలో ర్యాలీ రావడానికి తోడ్పడిన పరిణామం.. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధమనే చెప్పుకోవాలి. దాంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై పంజా విసరడం, ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాల్లోకి జారిపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రపంచదేశాలు, కేంద్ర బ్యాంకులు అన్ని చేతులతోనూ నిధులను పంప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ.. సహజ శక్తి తిరిగి ఆర్థిక వ్యవస్థల్లోకి వచ్చి చేరాలంటే అందుకు కొంత కాలం పడుతుందని.. 2021 వరకు ఒత్తిళ్లు కొనసాగుతాయన్న అంచనాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. కనుక బంగారంలో ర్యాలీ మరికొంత కాలం పాటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు పెట్టుబడుల్లో 5–10 శాతాన్ని బంగారానికి కేటాయించుకోవచ్చు. కనుక పెట్టుబడుల కోణంలో ఎస్‌జీబీల్లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే వాటిని కొనసాగించుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుత లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు.. లేదా కొంత మేర పెట్టుబడులను దీర్ఘకాలానికి ఈక్విటీల కోసం కేటాయించుకోవాలనుకుంటే.. ఎస్‌జీబీల నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. సెకండరీ మార్కెట్... సార్వభౌమ బంగారం బాండ్ (ఎస్జీబీ)లో పెట్టుబడులకు 8 ఏళ్ల కాలవ్యవధి. కాకపోతే 5వ ఏట చివరి నుంచి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఆ లోపు విక్రయించాలంటే అందుకు సెకండరీ మార్కెట్ ఒక్కటే అవకాశం. 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 37 సిరీస్‌ల ఎస్జీబీ ఇష్యూలు ముగిశాయి. ఇవన్నీ కూడా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో క్యాష్ విభాగంలో ట్రేడవుతున్నాయి. కాకపోతే సెకండరీ మార్కెట్లో ఎస్జీబీలను విక్రయించాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలన్నా అందుకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ఉండడం అవసరం. అదే విధంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో తగినంత లిక్విడిటీ (ట్రేడింగ్ పరిమాణం) ఉంటేనే వీటిని సరైన ధరలకు విక్రయించుకోవడం వీలవుతుంది. కానీ, చాలా వరకు ఎస్జీబీ ఇష్యూలకు ట్రేడింగ్ వ్యాల్యూమ్ చాలా తక్కువగా ఉంటోంది. ఎన్ఎస్ఈలో గడిచిన ఏడాది కాలంలో సగటు రోజువారీ ట్రేడింగ్ విలువ రూ.1.2 కోట్లుగానే ఉండడం గమనార్హం. కొన్నింటిలో మాత్రం ఈ ఇబ్బం ది లేదు. మొత్తం 37 సిరీస్‌లలో 12 సిరీస్‌ల్లో.. గడిచిన 3 నెలల్లో చూస్తే రోజువారీ ట్రేడింగ్ 100 యూనిట్లు, అంతకంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఎస్జీబీఏయూజీ27 (ఎన్ఎస్ఈ కోడ్), ఎస్జీబీఎన్వోబీ24, ఎస్జీబీఏయూజీ24, ఎస్జీబీఎంఏవై25, ఎస్జీబీఎస్ఈపీ24ల్లో రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 801–340 యూనిట్ల మధ్య ఉండడాన్ని గమనించాలి. కాకపోతే ప్రతీ రోజూ ఇంతే స్థాయిలో ట్రేడింగ్ పరిమాణం ఉండడం లేదు. ముఖ్యంగా ఎక్కువ మంది బ్రోకర్లు ఎస్బీజీల క్రయ విక్రయాలకు అనుమతించడం లేదు. ఎందుకంటే రెండు డిపాజిటరీల మధ్య (ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) ఈ బాండ్లకు సంబంధించి సెటిల్మెంట్ అవకాశం లేదు. అయితే, అటువైపు విక్ర యించేవారు, ఇటు కొనుగోలు చేసే వారు ఒకే డిపాజిటరీ పరిధిలో (అయితే ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్) ఉంటే క్రయ విక్రయాలకు ఇబ్బంది లేదు. అమ్మే వ్యక్తి, కొనుగోలు చేసే వ్యక్తి డీమ్యాట్ ఖాతాలు వేర్వేరు డిపాజిటరీల్లో ఉంటేనే సమస్య. ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు... హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, జెరోదా ఎస్జీబీ యూనిట్ల కొనుగోలు, అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రతీ రూ.100 విలువపై 10 పైసల నుంచి 50 పైసల వరకు బ్రోకరేజీ చార్జీలుగా చెల్లించాలి. ఎస్జీబీ అంటే... ఎనిమిదేళ్ల కాల వ్యవధి కలిగిన బంగారం బాండ్. ఇందులో ఒక ఇన్వెస్టర్ ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్లో చెల్లింపులు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్. ఏ ఇష్యూలో అయినా రిటైల్ ఇన్వెస్టర్లు ఆన్లైన్ చెల్లింపులు చేయడం ద్వారా గ్రాముపై రూ.50 డిస్కౌంట్ పొందొచ్చు. గడువు తీరే నాటికి మార్కెట్ రేటు ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. అదే విధంగా బాండ్లో పెట్టుబడి విలువపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని చెల్లించడం జరుగుతుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం బంగారాన్ని కొద్ది కొద్దిగా సమకూర్చుకోవాలని అనుకునే వారికి, బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనాల్లో ఇది మెరుగైనదని నిపుణుల విశ్లేషణ. ఇందులో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుంది. వడ్డీ ఆదాయం లభిస్తుంది. పూర్తి కాలం ఉంచుకుంటే లాభాలపై పైసా పన్ను కట్టక్కర్లేదు. ఇవన్నీ సానుకూలతలు. ఇన్వెస్ట్ చేసిన ధర కంటే బం గారం ధరలు కిందకు పడిపోయి దీర్ఘకాలం పాటు అదే స్థాయిల్లో కొనసాగితే నష్టాలు ఎదుర్కోవాలి. ఆర్బీఐ విండో.. ఎస్జీబీలకు ఐదేళ్లు లాకిన్. ఐదవ ఏట, ఆరవ ఏట, ఏడవ ఏట చివర్లో ఈ బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం 30 రోజుల ముందుగా ఆర్బీఐ బైబ్యాక్ విండో ప్రారంభమవుతుంది. పన్ను బాధ్యత ఎస్‌జీబీల్లో పెట్టుబడులను పూర్తి ఎనిమిదేళ్లు కొనసాగించితే మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపుంటుంది. గడువులోపే సెకండరీ మార్కెట్ లేదా ఆర్బీఐ బైబ్యాక్ విండో ద్వారా విక్రయించినట్టయితే పన్ను చెల్లించాలి. 36 నెలల్లోపు విక్రయించడం వల్ల లాభం సమకూరితే.. ఆ మొత్తాన్ని వ్యక్తిగత వార్షిక ఆదాయంలో చూపించి, నిర్ణీత శ్లా్లబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. -
పసిడి పరుగు పటిష్టమే
తీవ్ర ఒడిదుడుకులు ఎదురయినా, సమీపకాలంలో పసిడి పటిష్టమేనన్నది నిపుణుల వాదన. అమెరికా–చైనా మధ్య చర్చ మధ్య మధ్యలో చర్చలు జరిగినా, వాణిజ్య యుద్ధంపై కొనసాగుతున్న తీవ్ర అనిశ్చితి, సౌదీ చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడుల నేపథ్యంలో భౌగోళికంగా ఉద్రిక్తతలు వంటి అంశాలు పెట్టుబడులకు తక్షణ ఆకర్షణీయ మెటల్‌గా పసిడిని కొనసాగిస్తున్నాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్‌లో 1,524 డాలర్ల వద్ద ముగిసింది. వారంవారీగా చూస్తే, ఇది దాదాపు 20 డాలర్ల పెరుగుదల. శుక్రవారంతో ముగిసిన గడచిన 15 రోజుల్లో రెండుసార్లు పసిడి 1,500 డాలర్ల లోపునకు పడింది. ఇది బంగారానికి పటిష్టస్థాయి. ఈ స్థాయి దిగువనకు పడిపోయినా, వెంటనే పసిడి 1,500 డాలర్లపైకి లేచింది. అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితి, దీనితో ఆ దేశ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం తగ్గింపు (ప్రస్తుతం 2 నుంచి 1.75 శ్రేణిలో) వంటి అంశాలు పసిడికి మద్దతునిచ్చేవే కావడం గమనార్హం. దేశీయంగానూ పటిష్టమే.. దేశీయంగానూ పసిడి ధర సమీప భవిష్యత్తులో పటిష్టంగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి దీనికి కారణమన్నది వారి విశ్లేషణ. పలు పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం 72–70 శ్రేణిలో కొనసాగుతోంది. చమురు ధర పెరుగుదల భయాల నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి ధర శుక్రవారం రూ.37,697 వద్ద ముగిసింది. 1,600 డాలర్ల వరకూ... ఔన్స్‌కు 1,600 డాలర్ల వరకూ పసిడి ర్యాలీ చేసే అవకాశం ఉంది. అయితే వాణిజ్య చర్చలు, మార్కెట్ అంశాలు వంటివి పసిడిని 1,400 డాలర్ల నుంచి 1,600 డాలర్ల శ్రేణిలో నిలిపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ధర ఎక్కడ ఉన్నది ముఖ్యం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి పట్ల ఇన్వెస్టర్ ధోరణి ఎలా ఉంది అన్నది ఇక్కడ కీలకం. ఈ దిశలో పసిడికి సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. – క్రిస్టినా హూపర్, ఇన్వెస్కో చీఫ్ గ్లోబల్ మార్కెట్ వ్యూహకర్త -
బంగారం 1,530 డాలర్ల పైన... ర్యాలీయే
బంగారం గత మంగళవారం ఆరున్నరేళ్ల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత వారం మొత్తం మీద ఆర్జించిన లాభాలను కోల్పోయింది. డిసెంబర్ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం నష్టపోయి ఔన్స్‌కు 1532.60 డాలర్లుగా ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా ప్రతీకార చర్యలను చైనా వాయిదా వేయడం సానుకూల స్పందనకు దారితీసినట్టు టీడీ సెక్యూరిటీస్ గ్లోబల్ స్ట్రాటజీ హెడ్ బార్ట్ మెలెక్ తెలిపారు. వారం మొత్తం మీద లాభాలను కోల్పోయినప్పటికీ, బంగారం కీలక మద్దతు స్థాయి 1,530 డాలర్లకు పైనే నిలిచింది. ఇది కొనసాగితే భవిష్యత్తులో ధరలు పెరిగేందుకే అవకాశం ఉందని బ్లూలైన్ ఫ్యూచర్స్ ప్రెసిడెంట్ బిల్ బరూచ్ తెలిపారు. బంగారం 1,530 డాలర్ల పైన ఉన్నంత వరకు తాను బుల్లిష్‌గానే ఉంటానని, 1,530 డాలర్లకు దిగువన ముగిస్తే 1,500 దిశగా తగ్గుతుందని బరూచ్ చెప్పారు. ఈ వారంలో బంగారం మరింత కన్సాలిడేషన్‌కు అవకాశాలు లేకపోలేదని ఎక్కువ మంది అనలిస్టులు భావిస్తున్నారు. ‘‘బంగారం కొంత మేర దిగువకు వెళ్లొచ్చు. అమెరికా డేటా క్షీణతను సూచిస్తే, ఫెడ్ మరింత డోవిష్‌గా వ్యవహరిస్తుంది. దాంతో ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు పెరగడంతోపాటు, బంగారం అధిక స్థాయికి వెళుతుంది. గణనీయంగా పెరగడాన్ని చూడొచ్చు. దిగువ వైపున 1,488 మద్దతుగా వ్యవహరిస్తుంది’’ అని మెలెక్ వివరించారు. పావెల్ వ్యాఖ్యలపై దృష్టి... స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్‌లో వచ్చే శుక్రవారం అమెరికా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు. దీనికంటే ముందు ఆగస్ట్ నెలకు సంబంధించి అమెరికా ఉద్యోగ గణాంకాల డేటా బయటకు రానుంది. సెప్టెంబర్ 18 నాటి ఫెడ్ రేట్ల నిర్ణయానికి ముందు పావెల్ చివరి ప్రసంగం ఇదే. ఈ నెలలో మరో విడత రేట్ల కోత ప్రణాళికను ఆయన ప్రకటించొచ్చని క్యాపిటల్ ఎకమనిక్స్ యూఎస్ ఎకనమిస్ట్ ఆండ్రా్యూ హంటర్ తెలిపారు. -
బడ్జెట్ షాక్ : భారీగా ఎగిసిన పుత్తడి
సాక్షి, ముంబై : బులియన్ మార్కెట్‌కు బడ్జెట్ షాక్ తగిలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విలువైన లోహాలపై సుంకాన్ని పెంచడంతో ధరలు అమాంతం పుంజుకున్నాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం భారీగా పుంజుకుంది. దేశీయ బంగారు ఫ్యూచర్స్ మార్కెట్లో 2 శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 712 ఎగిసి రూ. 34929 వద్ద కొనసాగుతోంది. రాజధాని నగరం ఢిల్లీలో 99.9 స్వచ్ఛతగల బంగారం ధర 10 గ్రా. 590 రూపాయలు పెరిగి రూ. 34,800గా ఉంది. 8 ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ కూడా 200 ఎగిసి రూ.27వేలు పలుకుతోంది. మరో విలువైన మెటల్ వెండి కూడా ఇదే బాటలో ఉంది. ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర 633 రూపాయలు ఎగిసి 38410 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్స్ ధర 1,415 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. అమెరికా జాబ్‌డేటా, వడ్డీరేటుపై ఫెడ్ ప్రకటన తదితర అంశాల నేపథ్యంలో ఈ వారంలో ధరలు 2 శాతానికి పైగా పెరిగిన పుత్తడి వరుసగా ఏడవ వారం కూడా లాభాల పరుగుతీస్తోంది. మరోవైపు దిగుమతి సుంకం పెంపువార్తలతో జ్యుయల్లరీ షేర్లు 2-7శాతం పతనమయ్యాయి. టైటాన్ కంపెనీ 3.1 శాతం, గోల్డియం ఇంటర్నేషనల్ 6.7 శాతం, లిప్సా జెమ్స్ 3 శాతం, పీసీ జ్యుయలర్ 4.84 శాతం, రినయిన్స్ జ్యుయల్లరీ 2 శాతం, తంగమాయి జ్యువెలరీ 5.8 శాతం, త్రిభువన్ దాస్ భీంజీ జవేరి 6.4 శాతం నష్టపోతున్నాయి. కాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బంగారం , ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 12.5శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతమున్న 10 శాతం నుంచి బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 12.5 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. చదవండి : ఆదాయ పన్ను రిటర్న్స్ : ఊరట -
ఆధిక్యంలో ట్రంప్: భగ్గుమంటున్న బంగారం
వైట్ హౌస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో పసిడి పరుగులు తీస్తోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను అధిగమించి దూసుకుపోతుండటంతో, బంగారం 3 శాతం జంప్ చేసి ఐదు వారాల గరిష్టానికి నమోదవుతోంది. బంగారాన్ని సురక్షితమైన సాధనంగా భావిస్తున్న ఇన్వెస్టర్లు, పెట్టుబడులను దానిలోకి తరలిస్తున్నారు.. దీంతో బులియన్‌కు ఫుల్ జోష్‌గా ఉంది. స్పాట్ గోల్డ్ ఒక్క ఔన్స్‌కు 2.9 శాతం పెరిగి 1,311 డాలర్లుగా నమోదవుతోంది. బులియన్ కూడా 1,312.80 డాలర్లకు ఎగిసింది. అక్టోబర్ 4 తర్వాత ఇదే బలమైన నమోదు. ట్రంప్ గెలిస్తే, కమొడిటీలకు లబ్ది చేకూరుతుందని ముందు నుంచి భావిస్తూ రావడంతో, బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో మూడోవంతు ఓటింగ్ ప్రకియ ముగిసింది. కీలకరాష్ట్రాల్లో ఓటింగ్ నువ్వానేనా అన్నట్టు సాగుతోంది. ఎన్నికల ఫలితాలు కూడా అంచనాలు తారుమారు చేస్తూ వస్తున్నాయి. హిల్లరీ గెలుస్తుందని ముందస్తు అంచనాలు ప్రకటించినప్పటికీ, ఆమెను అధిగమించి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తారుమారు చేస్తున్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌తో, అమెరికా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆసియన్ మార్కెట్లోనూ డాలర్ భారీగా పతనమవుతోంది. దీంతో దేశీయ సూచీలు నష్టాల్లో ప్రారంభమవచ్చని విశ్లేషకులంటున్నారు.