Joker Malware Strikes Again on Android Apps: ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం సురక్షితమేనా? చాలామందికి ఈ విషయంలో అనుమానాలు ఉంటాయి. అయితే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ (యాప్స్)లోనూ కోడ్ రూపంలో డివైజ్‌ల మీద వైరస్ దాడి చేసే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో యాప్స్ డౌన్‌లోడ్ చేసేప్పుడు కొన్ని కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే జోకర్ లాంటి మాల్‌వేర్.. డివైజ్‌లోని డాటా మొత్తాన్ని గుంజేస్తుంటుంది మరి!
2017 నుంచి తన జోరు చూపిస్తున్న ‘జోకర్’ మాల్‌వేర్ విషయంలో గూగుల్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా.. కోడింగ్ బలంగా లేని యాప్స్ ద్వారా అది ప్రభావం చూపెడుతూనే వస్తోంది. తాజాగా 14 ఆండ్రాయిడ్ యాప్స్‌లో జోకర్‌ను గుర్తించినట్లు కాస్పర్‌స్కై అనలిస్ట్ తాన్య షిష్కోవా చెబుతున్నారు. డాటాను తస్కరించే ఈ మాల్‌వేర్ .. యాప్స్‌లో కోడింగ్ మార్చేయడం ద్వారా తన పని చేసుకుంటూ పోతుందని, తద్వారా కాంటాక్ట్ లిస్ట్, డివైజ్ ఇన్ఫర్మేషన్, ఓటీపీల తస్కరణ, ఎస్సెమ్మెస్‌లను రీడ్ చేయడం చేస్తోందని షిష్కోవా చెబుతున్నారు. కోడ్‌లో దాగి ఉండే ఈ మాల్‌వేర్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే రిస్క్ కూడా ఎక్కువేనని ఆండ్రాయిడ్ యూజర్లను షిష్కోవా హెచ్చరిస్తోంది.
సూపర్ క్లిక్ వీపీఎన్, వాల్యూమ్ బూస్టింగ్ హియరింగ్ ఎయిడ్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ బబుల్ ఎఫెక్ట్స్, ప్లాష్‌లైట్ ఫ్లాష్ అలర్ట్ ఆన్ కాల్, ఈజీ పీడీఎఫ్ స్కానర్, స్మార్ట్‌ఫోన్ రిమోట్, హలోవీన్ కలరింగ్, క్లాసిక్ ఎమోజీ కీబోర్డు, వాల్యూమ్ బూస్టర్ లౌడర్ సౌండ్ ఈక్వెలైజర్, సూపర్ హీరో ఎఫెక్ట్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్ వాల్ పేపర్, డాజిలింగ్ కీబోర్డ్, ఎమోజీవన్ కీబోర్డు, నౌ క్యూఆర్ స్కాన్.. ఈ యాప్స్‌ను తక్షణమే అన్‌ఇన్‌స్టాల్ చేయడం మంచిదని షిష్కోవా చెబుతోంది.
VIDEO: జోకర్ ఏం చేస్తాడో చూడండి
Comments
Please login to add a commentAdd a comment