Internet of Things
-
సాంకేతిక కేంద్రంగా ఇట్స్ ఫ్లో టైం
ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం సరికొత్త ఆవిష్కరణలు పరిచయమవుతూనే ఉంటాయి. అయితే ఆ ఆవిష్కరణలు అందరికీ చేరడానికి చాలా సమయమే పడుతోంది. ఈ క్రమంలో వాటిని విద్యార్థుల చెంతకు చేర్చాలన్నా.. దానిపై అవగాహన కల్పించాలన్నా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి. రోబోల తయారీ నుంచి 3డీ ప్రింటింగ్ వరకూ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నుంచి డ్రోన్ వినియోగం వరకూ వాటి తయారీ విధానం, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పనితీరును తదితర టెక్నాలజీని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కొంత మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ముందడుగేశారు.. ఇంతకీ ఆ విద్యార్థులు ఏం చేశారు? వారి ఉద్దేశం ఏంటి? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..! ⇒ఇంజినీరింగ్ విద్యార్థుల నూతన ఆవిష్కరణ⇒విద్యార్థుల చెంతకు ‘సాంకేతిక’ చదువు⇒‘ఫ్లో’ పేరుతో కొత్త తరహా ప్రయత్నం⇒గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితం⇒సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనే లక్ష్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలి్పంచాలి.. దాని వినియోగం విద్యార్థుల చెంతకు చేర్చాలి.. ఇదీ పలువురి ఇంజినీరింగ్ విద్యార్థుల సంకల్పం.. అనుకున్నదే తడవుగా సాయం కోసం పలువురిని సంప్రదించారు.. వారి సంకల్పానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వంతపాడారు.. ఆయన సాయంతో ఓ బస్సులో అన్ని సదుపాయాలతో అత్యాధునిక సాంకేతికతను వివరించే నమూనాలతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. దీనికి ‘ఫ్లో’ (ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్)ను సిద్ధం చేశారు. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫ్లో ఒక వరంగా మారనుంది... ఇదే ఫ్లో లక్ష్యం... భవిష్యత్తులో రోబోలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి. వాటిని తయారు చేయడం ఎలా? అందుకు అవసరమైన టెక్నాలజీ ఏంటి? రోబోలకు ఎందుకు అంత ప్రాధాన్యత? తయారు చేసిన రోబోలు ఎలా పనిచేస్తాయి? వాటిని వినియోగించడం ఎలా?.. తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరిస్తారు. ప్రాక్టికల్‌గా బస్‌లోని రోబోలను చూపిస్తూ విద్యార్థులకు అవగాహన కలి్పస్తారు. వాతావరణ వ్యవస్థపై... ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎంత వేడి (ఎన్ని డిగ్రీలు) ఉంది. రేపు వాతావరణం ఎలా ఉండబోతోంది. వర్షం ఎపుడు కురుస్తుందనే ముందస్తు సమాచారం. వర్షం కొలమానం, తుఫాను హెచ్చరిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. గాలులు ఎటు నుంచి ఎటువైపు ప్రయాణిస్తున్నాయి. వంటి వాతావరణ సమాచారం మనకు ముందుగానే తెలుస్తుంది. అయితే అది ఎలా సాధ్యమవుతుంది? దానికి వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం, తదితర అంశాలపై ఫ్లో బస్‌లో విద్యార్థులకు వివరిస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ)... ప్రస్తుత ఇంటర్నెట్ వ్యవస్థ ప్రపంచాన్ని మన చేతుల్లో పెడుతోంది. చిటికెలో సమాచారాన్ని చేరవేస్తోంది. కార్యాలయంలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్న ఫ్యాన్, ఏసీ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వంటివి చేయగలడు. కార్యాలయం, ఇల్లు, పొలం దగ్గర సీసీ కెమెరాల ద్వారా ఎక్కడో కూర్చుని అక్కడ ఏం జరుగుతుందో పర్యవేక్షించగలడు. ఇంట్లో సెన్సార్ వ్యవస్థతో మనం స్విచ్ ఆన్ చేయకుండానే లైటు వెలుగుతుంది. డోర్ తెరుచుకుంటుంది. రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తదితర విషయాలు తెలియజేస్తారు. డ్రోన్ వినియోగం.. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీకి మార్కెట్లో అత్యంత ఆదరణ ఉంది. వీడియోల, ఫొటోల చిత్రీకరణ, వ్యవసాయ పనుల నుంచి మొదలు వివాహాది శుభకార్యాలు, దేశ సరిహద్దుల్లో భద్రత వరకూ డ్రోన్స్ విరివిగా వినియోగిస్తున్నారు. డ్రోన్ తయారీ విధానం, వినియోగం, ఉపయోగాలపై అవగాహన కలి్పస్తారు. 3డీ ప్రింటింగ్.. 3డీ ప్రింటింగ్ అనేది అత్యాధునిక టెక్నాలజీ. గ్లాస్‌పైన, చెక్క, పింగానీ వస్తువులు, ఇలా ఎక్కడైనా చక్కని ఆకృతితో మనకు నచ్చిన చిత్రాన్ని ప్రతిబింబించేలా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది..ఈ అత్యాధునిక 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి భవన నిర్మాణాలను సైతం చేసేలా వృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీకి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘ఫ్లో’ బస్‌లో ఉచిత ప్రవేశం కల్పిస్తారు. పాఠశాల ఉపాధ్యాయులు ఫ్లో టీంను సంప్రదిస్తే వారి షెడ్యూల్ ఆధారంగా ఏ రోజు వీలుంటుందనేదీ ఉపాధ్యాయులకు తెలియజేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం పాఠశాలకు బస్ వచ్చి అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలపై అవగాహన కలి్పస్తారు. ప్రయివేటు పాఠశాలలు సైతం ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవచ్చు. అయితే పాఠశాల యాజమాన్యం నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ లోటును భర్తీ చేసేందుకే.. కేంద్ర ప్రభుత్వం 2020లో జాతీయ విద్యాపాలసీ (ఎన్ఈపీ)ని అమల్లో తెచి్చంది. ప్రతి పాఠశాలలో అత్యాధునిక టెక్నాలజీని విద్యార్థులకు బోధించాలని చెబుతోంది. ఆ సమయంలో కోవిడ్ రావడంతో కాస్త నెమ్మదించినా, తరువాత కాలంలోనూ ఆశించిన ఫలితాలు లేవు. పాఠశాలల్లో నిష్ణాతులైన శిక్షకులు లేకపోవడం, పరికరాలు అందుబాటులో లేకపోవడం, ఇతర సమస్యలు అడ్డంకిగా మారాయి. ఈ పరిస్థితుల నుంచి అధిగమించడానికి ‘ఫ్లో’ ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.ఏఆర్, వీఆర్.. ఆగ్మెంట్ రియాలిటీ(ఏఆర్), వర్చువల్ రియాలిటీ(వీఆర్) ప్రస్తుత ట్రెండ్ ఇది.. ఎక్కడో ఉన్న వ్యక్తి, ప్రాంతం మన కళ్లముందున్న అనుభూతిని కలి్పస్తాయి. ఈ వ్యవస్థను ఉపయో గించి ప్రస్తుతం ప్రచారం.. గేమింగ్.. టూరిజం.. వంటి రంగాలు మంచి జోష్‌లో నడుస్తున్నాయి.. అదే ఆగ్మెంట్ రియాలిటీ టెక్నాలజీతో.. మరో వైపు వర్చువల్‌గానూ (వీఆర్) వేరే ప్రాతంలో ఉన్న వ్యక్తితో నేరుగా మాట్లాడే అవకాశం కలి్పస్తోంది.. ఈ రెండు వ్యవస్థల పనితీరును వివరిస్తారు.టెక్ టూల్స్ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్, డ్రిల్లింగ్ మెషీన్, మైక్రో ఓవెన్, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఫ్యాన్, ఇంట్లో ఉపయోగించే ఇతర ఎల్రక్టానిక్ పరికరాలు ఎలా పనిచేస్తాయి. మన జీవితంలో వాటి పాత్ర ఎంతవరకూ ఉంటుంది. వాటి తయారీ విధానం, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేస్తారు.పదివేల మందికి అవగాహన... చిన్నప్పటి నుంచి సైన్స్ పట్ల ఆసక్తి ఎక్కువ. నేషనల్ కాంగ్రెస్ సైన్స్ ప్రోగ్రాంలో పాల్గొనేవాడిని. ఎన్నో బహుమతులు వచ్చాయి. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ గ్రూప్ తీసుకున్నా. కళాశాలలో బోధన సంతృప్తిగా అనిపించలేదు. 2020లో రోబోటిక్స్‌పై స్టార్టప్ ప్రారంభించాం. ఎఫ్‌ఎల్‌ఓడబ్ల్యూ (ఫ్లో) ప్రారంభించడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సాయమందించారు. యూఎస్, ఎస్‌ఎస్‌ఐఐఈ నుంచి సుమారు కోటి రూపాయలు నిధులు సమకూరాయి. కొత్త ఇన్నోవేటివ్స్ చేపడుతున్నాం. మేము మొత్తం 18 మంది బృందంగా ఏర్పడి నడిపిస్తున్నాం. త్వరలోనే ఏపీలోనూ ఫ్లో బస్ అందుబాటులోకి వస్తుంది. – మధులాష్ బాబు, సీఈవో ఎడోద్వజ సంస్థ -
వొడాఫోన్ ఐడియా నుంచి ఐవోటీ ల్యాబ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాల టెస్టింగ్ కోసం ల్యాబ్–యాజ్–ఏ–సరీ్వస్‌లను ఆవిష్కరించినట్లు టెలికం సంస్థ వీఐ (వొడాఫోన్–ఐడియా) తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధునాతన ఐవోటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు, సీ–డాట్ సంస్థతో కలిసి ఈ సరీ్వసులు అందిస్తున్నట్లు వివరించింది. ఇంటర్ఆపరబిలిటీ తదితర ప్రమాణాలకు సంబంధించి ఇప్పటివరకు ఆటోమొబైల్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో 50 ఐవోటీ డివైజ్‌ల టెస్టింగ్‌ను పూర్తి చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం 5జీ డివైజ్‌లను కూడా పరీక్షిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాతియా తెలిపారు. -
భారత్‌లో బ్లాక్‌బెర్రీ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత సాఫ్ట్వేర్, సర్వీసెస్ అందిస్తున్న కెనడా సంస్థ బ్లాక్‌బెర్రీ భారత్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. 2023 చివరి నాటికి కెనడా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బెర్రీ ఐవోటీ విభాగానికి రెండవ అతిపెద్ద కేంద్రంగా ఇది అవతరిస్తుందని వెల్లడించింది. ఆ సమయానికి ఇక్కడ 100 మందికి పైగా ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. సాఫ్ట్వేర్ ద్వారా నియంత్రించగలిగే తదుపరి తరం వాహనాల అభివృద్ధి, ఐవోటీ పరిశ్రమలో ఆధునిక ఆవిష్కరణలు లక్ష్యంగా ఈ కేంద్రం బ్లాక్‌బెర్రీ రూపొందించిన క్యూఎన్ఎక్స్, ఐవీ ఉత్పాదనలపై పనిచేస్తుంది. ఆవిష్కరణలు, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ సర్వీసెస్ బాధ్యతలను హైదరాబాద్ బృందం చేపడుతుంది. ‘నైపుణ్యాలు, ఆవిష్కరణలలో బ్లాక్‌బెర్రీ కొనసాగిస్తున్న పెట్టుబడికి ఈ రోజు మరొక మైలురాయి. ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ ఆవిష్కర్తలకు నిలయంగా భారత ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో ఐవోటీ సాప్ట్వేర్ లీడర్‌గా వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తాం’ అని బ్లాక్‌బెర్రీ ఐవోటీ ప్రెసిడెంట్ మ్యాటిస్ ఎరిక్సన్ తెలిపారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టెల్లాంటిస్, బీఎండబ్లు్య, బాష్, ఫోర్డ్, జీఎం, హోండా, మెర్సిడెస్ బెంజ్, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ వంటి సంస్థలు బ్లాక్‌బెర్రీ క్లయింట్లుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 21.5 కోట్ల వాహనాల్లో బ్లాక్‌బెర్రీ క్యూఎన్ఎక్స్ వినియోగిస్తున్నారు. -
ఐవోటీ మాల్వేర్ టాప్ 3 దేశాల్లో భారత్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) డివైజ్‌లకు సంబంధించి అత్యధికంగా మాల్వేర్ ఇన్ఫెక్షన్లకు కేంద్రంగా నిల్చిన టాప్ 3 దేశాల్లో భారత్ కూడా ఒకటని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ విషయంలో చైనా, అమెరికా తర్వాత స్థానాల్లో భారత్ ఉన్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం అత్యధికంగా 38 శాతం ఐవోటీ మాల్వేర్లు చైనా నుంచి, 18 శాతం అమెరికా నుంచి, 10 శా తం ఇండియా నుంచి వ్యా ప్తి చెందాయి. సాంప్రదా య ఐటీ పరికరాలు, ఆపరేషన్ టెక్నాలజీ (ఓటీ) కంట్రోలర్లు, రూటర్లు.. కెమెరాల వంటి ఐవోటీ డివైజ్లతో ఐవోటీ మాల్వేర్ ముప్పులు ఎక్కువగా ఉంటున్నాయని మైక్రోసాఫ్ట్ వివరించింది. -
ఎన్నెన్నో ‘ఏఐ’ సేవలు.. మనిషి జీవితంలో ఊహించని మార్పులు
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) సమాచార సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో మనిషి జీవితంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇన్నాళ్లూ మనకు అందని చందమామలు నట్టింట దిగుతున్నాయి. చక్రం కనిపెట్టడంతో జీవన గమనంలో పెరిగిన వేగం పారిశ్రామిక విప్లవంతో ఎన్నో సౌకర్యాలను అందించింది. ఊహల్లో మాత్రమే సాధ్యమయ్యే అంశాలు ఇప్పుడు మనిషికి చిటికెలో అమరుతున్నాయి. మన రోజువారీ జీవితాన్ని మలుపు తిప్పుతున్న సరికొత్త పరిజ్ఞానం ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’(ఐవోటీ) కాగా దానికి దన్నుగా నిలుస్తున్న శక్తి ‘కృత్రిమ మేధ’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). మన ఫిట్నెస్ స్థాయిని చూపించడం మొదలు పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం వరకు ఏఐ, ఐవోటీ మేలు కలయికతో మన కళ్లెదుటే ఆవిష్కృతమవుతున్నాయి. అద్భుత భవిష్యత్‌కు బాట ఎంతోదూరంలో లేదని అర్థమవుతోంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 వేల కోట్ల ఉపకరణాలు (డివైస్) ఇంటర్నెట్కు అనుసంధానమై ఉంటాయని అంచనా. ఇవి మన ఆన్లైన్ కార్యకలాపాలను సేకరించడం, సమాచారం పరస్పరం మార్చుకోవడం, ఏఐ ద్వారా ఇచ్చే కమాండ్స్‌ను ప్రాసెస్ చేస్తాయి. ఇంటర్నెట్ అనుసంధానానికి శక్తిని, యుక్తిని ఏఐ అందిస్తోంది. వేరియబుల్స్ (ధరించే ఉపకరణాలు) స్మార్ట్‌వాచ్ లాంటి వేరియబుల్స్ నిరంతరాయంగా మనిషి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను ట్రాక్ చేయగలవు. హార్ట్‌బీట్, ఆక్సిజన్ లెవల్, వేస్తున్న అడుగులు, ఖర్చవుతున్న శక్తి, నిద్రలో నాణ్యత.. ఇవన్నీ రికార్డు చేయగలవు. మధుమేహాన్ని కచ్చితంగా అంచనా వేసే డివైస్‌లు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. గంట గంటకూ షుగర్ లెవల్‌ను రికార్డు చేస్తున్నాయి. వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదం చేస్తోంది. మన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వ్యక్తిగత వైద్యులకు చేరవేయడంతో పాటు స్ట్రోక్ లాంటి ప్రమాదాలను ముందుగా హెచ్చరించే పరిజ్ఞానం త్వరలో సాకారం కానుంది. స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌కు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ ‘గాట్నర్’ అంచనా ప్రకారం ప్రపంచ వేరియబుల్ డివైస్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుంది. స్మార్ట్ హోమ్ మనం ఇచ్చే వాయిస్ కమాండ్‌కు ఇంట్లో వస్తువులు ప్రతిస్పందించడం గతంలో సైన్స్ ఫిక్షన్‌కు పరిమితం. ఇప్పుడది వాస్తవం. ఇంటి యజమాని అవసరాలు, అలవాట్లను గుర్తెరిగి ప్రవ ర్తించే డివైస్లతో ఇంటిని నింపేయడం సమీప భవిష్యత్‌లో సాకారమయ్యే విషయమే. ‘అలెక్సా’ ఇప్పటికే మన నట్టింట్లోకి వచ్చేసి వాయిస్ కమాండ్‌కు ప్రతిస్పందిస్తుంది. మనుషుల వ్యక్తిగత రక్షణ, ఇంటి భద్రతకు హెచ్చరికలను సంబంధిత వ్యవస్థలు/వ్యక్తులకు చేరవేసే టెక్నాలజీ కూడా రానుంది. స్మార్ట్‌హోమ్ గ్లోబల్ మార్కెట్ వచ్చే రెండేళ్లలో 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని ‘గాట్నర్’ అంచనా. స్మార్ట్ సిటీ ఇది పట్టణీకరణ యుగం. నగరా లకు వలసలు పెద్ద ఎత్తున పెరుగు తున్నాయి. పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఇంధన సామర్థ్యం వృద్ధి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల ముందున్న సవాళ్లు. ఢిల్లీలో ట్రాఫిక్ మెరుగైన నియంత్రణకు ‘ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా రియల్‌టైమ్‌లో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. ఇందులో వాడుతున్నది కృత్రిమ మేధస్సే. స్మార్ట్ ఇండస్ట్రీ మాన్యుఫ్యాక్చరింగ్ నుంచి మైనింగ్ వరకు.. ప్రతి పరిశ్రమలో సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచడానికి, మానవ తప్పిదాలను పూర్తిగా నివారించడానికి ఏఐ ఉపయోగపడుతుంది. పరిశ్రమల్లో డిజిటల్ రూపాంతరీకరణ ఇప్పటికే మొదలైంది. వచ్చే రెండు మూడేళ్లలో 80 శాతం పరిశ్రమల్లో ఏఐ వినియోగం మొదలవుతుందని అంచనా. రియల్ టైమ్ డేటా విశ్లేషణ నుంచి సప్లైచైన్ సెన్సార్ల వరకు పారిశ్రామిక రంగంలో ‘ఖరీదైన తప్పుల’ను నివారించడానికి ఏఐ దోహదం చేస్తుంది. రవాణా డ్రైవర్ అవసరంలేని వాహనాల రూపకల్పనకు పునాది వేసింది కృత్రిమ మేధ. మనిషి తరహాలో ఆలోచనను ప్రాసెస్ చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం చేస్తున్న పనులను ఏఐ ద్వారా ఉపకరణాలు చేసేస్తున్నాయి. అటానమస్ వాహనాలు మాత్రమే రోడ్డు మీద కనిపించే రోజు సమీప భవిష్యత్‌లో ఉంది. -
గాజు సీసాల్లోనే నీళ్లు!
పర్యావరణ పరిరక్షణతో పాటూ ప్లాస్టిక్ ద్వారా కలుగుతున్న కాలుష్యాన్ని నివారించే దిశగా నగరంలోని హోటల్స్‌లో పలు మార్పు చేర్పులు చేపట్టారు. ఇందులో భాగంగా హోటల్లో తాగునీటిని అందించడానికి వినియోగిస్తున్న ప్లాస్టిక్ సీసాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో గాజు సీసాలను వినియోగించాలని నిర్ణయించారు. నగరంలోని ఆతిథ్యరంగంలో మంచి మార్పునకు ఇది దోహదం చేయనుంది. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హోటళ్లలో అతిథులకు ప్లాస్టిక్ సీసాల్లో నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఒకసారి వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి కొత్తగా మార్చి వినియోగించలేక పోవడం ఒక ఎత్తయితే మరోవైపు వినియోగించిన వాటిని ధ్వంసం చేయడం కూడా ఎంతో క్లిష్టమైన, కష్టసాధ్యమైన పని. దీంతో ఇవి తీవ్రస్థాయి పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి గాజు బాటిళ్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ గ్లాస్ బాటిళ్లను వాడేసినప్పటికీ తిరిగి మళ్లీ వినియోగించడం సాధ్యమవుతుండడంతో సిటీలోని కొన్ని హోటల్స్ వీటినే ఎంచుకుంటున్నాయి. ఆటోమేటిక్‌గా.. ఆరోగ్యకరంగా.. దీని కోసం తక్కువ మానవ ప్రమేయంతో పూర్తిగా ఆటోమేటిక్‌గా నడిచే ఓ అత్యాధునిక వాటర్ ప్లాంట్‌ను హోటల్స్‌లో అమర్చుకుంటున్నారు. తద్వారా హోటల్ అవసరాలకు సరిపడా పూర్తిగా శుభ్రపరచబడిన ఆల్కలైన్ మినరల్ వాటర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వీరు చెబుతున్నారు. పూర్తి ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ యంత్రం తన ఫిల్టర్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రిస్తూ అత్యంత శుభ్రమైన తాగు నీటిని అందిస్తుంది. ఇలా తయారు చేసిన తాగు నీటిని మళ్లీ తిరిగి వినియోగించే వీలున్న రీ యూజబుల్ గాజు సీసాల ద్వారా అతిథులకు అందజేస్తున్నారు. నాలుగు దశలలో ఈ వాటర్ ప్లాంట్ పని చేస్తుంది. ముందుగా సాధారణ తాగు నీటిని పూర్తిగా శుభ్రపరచి సురక్షితమైన ఆల్కలైన్ మినరల్ వాటర్‌గా తయారు చేస్తుంది. అనంతరం యంత్రంలో ప్రవేశ పెట్టిన తాగునీటి గాజు సీసాలను పరిశుభ్రపరచి, పూర్తిగా పొడిగా మార్చిన తర్వాత వాటిలో ఈ ఆల్కలైన్ మినరల్ వాటర్‌ను నింపుతారు. ఇలా నింపిన గ్లాసు బాటిల్స్‌ను హోటల్లోని గెస్ట్ రూమ్‌లు ఇతరత్రా ప్రదేశాలలో తాగు నీటిగా వినియోగించడానికి అందిస్తారు. రోజుకు 1500 బాటిళ్ల నీరు ఉత్పత్తి... ఆకార్ హోటల్స్ గ్రూప్ పూర్తి పర్యావరణ హితంగా హోటల్స్‌ను మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్లాస్టిక్ బాటిళ్ల నివారణకు గాను మా హోటల్లో సరికొత్త వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా రోజూ 1500 గ్లాసు బాటిళ్ల నీటిని అంటే సుమారు 300 లీటర్లను అతిథులకు సరఫరా చేయవచ్చు. అలానే కాలం చెల్లిన వాటిని రీ సైకిల్ చేసి సరికొత్త బాటిళ్ల తయారీలో వినియోగించవచ్చు. –సౌమిత్రి పహారి, జీఎం, హోటల్ మెర్క్యుర్ హైదరాబాద్ కెసీపీ (చదవండి: రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు) -
కొత్త టెక్నాలజీ గురూ..! కిలో మీటర్ దూరంలో ఉన్నా వైఫైని వినియోగించుకోవచ్చు..!
టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్ది మానవుని జీవన విధానం మరింత సులభతరం అయ్యింది. ఇప్పటికే డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' వంటి టెక్నాలజీలు వర్క్ కల్చర్‌ను పూర్తిగా మార్చేయగా..ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అదే దారిలో పయనిస్తుంది. తాజాగా ఐఓటీ టెక్నాలజీతో మీరు కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే డివైజ్‌లను వినియోగించుకునేందుకు ఈ 'వైఫై హాలో'(wifi halow) ఉపయోగపడనుంది. 'వైఫై హాలో' అంటే? 'వైఫై హాలో' అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఐఓటీ ప్రొడక్ట్‌లు స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ ఎయిర్ కండీషనర్స్ తో పాటు స్మార్ట్ హోం సెక్యూరిటీ సిస్టం, వేరబుల్ హెల్త్ మానిటర్స్, బయో మెట్రిక్ సైబర్ సెక్యూరిటీ స్కానర్స్'ను కిలోమీటర్ దూరంలో ఉన్నా వైఫై ద్వారా ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ వ్యాప్తంగా వైఫై నెట్ వర్క్‌లను అందించే 'వైఫై అలయన్స్' సంస్థ తెలిపింది. పరిమిత సంఖ్యలో వైఫై కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉన్న స్మార్ట్ డివైజెస్‌లో పనిచేస్తుందని చెప్పింది. వైఫై టెక్నాలజీ కోసం కొత్త ఎక్విప్మెంట్ అవసరం లేదని,ప్రస్తుతం మన రోజూ వారి జీవితంలో భాగమైన వైఫై సెటప్‌తోనే ఈ వైఫై హాలో పనిచేస్తుందని వెల్లడించింది. ఏ అప్లికేషన్లలో వైఫై హాలోని వినియోగించుకోవచ్చు? వైఫై హాలో'ని ఇళ్లు, సంస్థల్లో ఉండే స్మార్ట్ పరికరాలను కనెక్ట్ చేయడంతో పాటు వివిధ రకాలైన అప్లికేషన్లలో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ మానిటర్లు, వ్యవసాయ క్షేత్రాల్లో (స్మార్ట్ అగ్రికల్చర్)సెన్సార్లను కనెక్ట్ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. తద్వారా టెక్నాలజీ పరంగా మరింత అప్ డేట్ కావొచ్చని నిపుణులు చెబుతుండగా.. తక్కువ సమయంలో పెద్దమొత్తంలో ఉన్న డేటాను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఉపయోగడపడే వైఫై నెట్ వర్క్‌కు ప్రత్యామ్నాయం కాదని అంటున్నారు. 'వైఫై హాలో'ఎలా పని చేస్తుంది? వైఫై హాలో టెక్నాలజీ ఇళ్లులో, లేదంటే రైల్వే స్టేషన్లలో వినియోగించే వైఫై కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. సాధారణ వైఫై నెట్‌వర్క్‌లు వినియోగించడం వల్ల ఖర్చయ్యే కరెంట్ కంటే..తక్కువ స్థాయిలో కరెంట్ వినియోగంతో దూరంలో ఉన్నా సరే ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. బ్యాండ్ విడ్త్ పరంగా వైఫై హాలో సాధారణ వైఫై బ్యాండ్ విడ్త్ 2.4జీహెచ్‌జెడ్ నుండి 5జీహెచ్‌జెడ్'ల కంటే తక్కువ స్థాయిలో అంటే కేవలం 1జిహెచ్‌జెడ్ తో పనిచేసేలా డెవలప్ చేస్తున్నట్లు వైఫై అలయన్స్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. చదవండి: నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...! -
IOT: వ్యవసాయాన్ని శాసించనున్న ఐఓటీ
సాక్షి, అమరావతి: భవిష్యత్‌లో వ్యవసాయాన్ని శాసించేది శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) విధానాలేనని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఉత్పత్తి వ్యయాన్నీ తగ్గించడానికి, పర్యావరణ పరిరక్షణకు వ్యవసాయంలోనూ నాలుగు ఆర్ (ఆర్ ఆర్ ఆర్ ఆర్)లు సరైన స్థలం (రైట్ ప్లేస్), సరైన సమయం (రైట్ టైం), సరైన ఉత్పాదకాలు (రైట్ ఇన్పుట్స్), సరైన మొత్తం (రైట్ ఎమౌంట్) ప్రధాన పాత్ర పోషించనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరైన డేటా ఉన్నప్పుడే.. సాంకేతికత, పర్యావరణ డేటాను ఉపయోగించడం, కచ్చితమైన వ్యవసాయానికి, స్థిరత్వానికి చాలా ముఖ్యం. 2020–21 ఆర్థిక సర్వే ప్రకారం జీడీపీలో వ్యవసాయం వాటా 19.9 శాతం. అంతకుముందటేడాది 2019–20తో పోలిస్తే ఇది 2.1% ఎక్కువ. దేశ వ్యవసాయ రంగాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టినా ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలతో ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో ఇదంతా భాగం. 2050 నాటికి పంట ఉత్పత్తిని 60 నుంచి 100 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్ ఆహార అవసరాలను తీర్చడానికి శాస్త్రవేత్తలు ప్రధానంగా అగ్రిబిజినెస్‌పై ఆధారపడుతున్నారు. అందుకే వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మేధస్సును జోడిస్తున్నారు. సమీపభవిష్యత్‌లో వ్యవసాయ ఉత్పాదకతను ఇంటర్నెట్ సంబంధిత వ్యవహారాలు (ఐఓటీ), ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, వెబ్ ఆధారిత జియో ట్రాకింగ్ పద్ధతులు, కృత్రిమ మేధస్సు, బిగ్ డేటా, క్లౌడ్, మెషిన్ లెర్నింగ్ వంటివి శాసిస్తాయని, దిగుబడులను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు. డేటా పరిరక్షణ పెద్ద సమస్యే.. సాగు రంగ సమాచారాన్ని సేకరించడం ఒక ఎత్తయితే దాన్ని కాపాడడం, ఉపయోగించుకోవడం మరో ఎత్తు. పెద్దఎత్తున ధనంతో ముడిపడిన సమస్య. వ్యవసాయ రంగానికి భారీఎత్తున నిధులు కేటాయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. తొలిదశలో భూమి, నీటి సంరక్షణపై దృష్టి సారించింది. టాటా కిసాన్ కేంద్రం (టీకేకే), ఫసల్ వంటి కంపెనీలు ఇప్పటికే దేశంలో సాంకేతిక సహకారంతో సమాచారాన్ని సేకరించి కచ్చితమైన వ్యవసాయ విధానం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. డేటా సేకరణ ఎవరి కోసం? ఈ డేటా సేకరణ ఎవరి కోసం అనేదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వైపు వ్యవసాయాన్ని నడిపించేందుకు ఈ డేటా పనికి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతు సంఘాలు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నాయి. చిన్న సన్నకారు రైతులకు ఈ డేటాలు, సాంకేతికత పనికి రాదని, చిన్నకమతాలను దృష్టిలో పెట్టుకుని సాంకేతికతను తయారు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలా చేయాలంటే కూడా సమాచారం అవసరం అని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. వ్యవసాయంలో నాలుగు ఆర్లు.. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ప్రకారం, ఖచ్చితమైన వ్యవసాయం ప్రాథమికంగా నాలుగు ఆర్లపై ఆధారపడి ఉంది. అవి.. ’సరైన సమయంలో’ ’సరైన ఇన్పుట్’ ’సరైన స్థలం’ ’సరైన వ్యయం’ (మొత్తం). వీటితో పాటు ఉత్పాదకతను మెరుగుపరచడానికి ’సరైన పద్ధతి’ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కోరుకున్న ఫలితాల సాధనకు పెద్దఎత్తున సమాచారాన్ని క్రోడీకరించాలి. సాంకేతికతను అన్వయించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే మెరుగైన వ్యవసాయ పద్ధతులకు శ్రీకారం చుట్టారు. మనలాంటి దేశాలలో ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇది సాగురంగంలో సానుకూల మార్పును ప్రభావితం చేయనుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
Artificial Intelligence: సర్వాంతర్యామి ఏఐఓటీ!
ఇందుకలదు... అందులేదు.. అన్నట్లు ఇప్పుడు ఏ వస్తువును చూసినా ఇంటర్నెట్తో పనిచేసేలా రూపొందుతున్నాయి. మా కారులో ఇంటర్నెట్ ఉందంటూ బ్రిటిష్ కంపెనీ ఎంజీ గొప్పగా ప్రచారం చేసుకుంది.. టాటా, మహింద్రా కూడా తమ కారులో ఇంటర్నెట్ ఆధారిత టెక్నాలజీలున్నట్లు ప్రకటించాయి.. కార్లే కాదు.. ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు కూడా స్మార్ట్‌గా మారాయి. అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లోనూ నెట్ హల్చల్ చేస్తోంది. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)కి కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) తోడైతే?.. అద్భుతాలు సాధ్యమవుతాయి. చేతికి తొడుక్కునే వాచీ.. ఆరోగ్య వివరాలన్నీ సేకరించి, అత్యవసర పరిస్థితి వస్తే ఫ్యామిలీ డాక్టర్‌కు మెసేజ్ పెడుతుంది. పాలు పాడవుతున్నాయి.. తాజా పాలు తెచ్చుకోమని రిఫ్రిజిరేటర్ మనకు చెబుతుంది. సాయంత్రం ఆరు గంటలకు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి వేడినీళ్లు సిద్ధంగా ఉంచమని మనమూ బాత్రూమ్లో ఉండే గీజర్‌ను ఆదేశించవచ్చు. నగరమంతా సూర్యాస్తమయం కావడమే తడవు వీధి దీపాలు వెలిగేలా.. సూర్యోదయంతోనే ఆరిపోయేలా కూడా చేయవచ్చు. మనిషన్న వాడి అవసరం లేకుండానే.. పరిశ్రమల్లోనూ మరింత సమర్థంగా ఉత్పత్తి, యంత్రాల నిర్వహణ సాధ్యం అవుతాయి. అవన్నీ కాదు కానీ... ఇంట్లో, ఊళ్లో, ఆఫీసుల్లో యంత్రాలతో మనం పనిచేయించుకునే తీరుతెన్నుల్లో విప్లవాత్మక మార్పులు మాత్రం తథ్యం. మూడు టెక్నాలజీలు కీలకం.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విజయవంతానికి, సమర్థ వినియోగానికి మూడు టెక్నాలజీలు కీలకం. కృత్రిమ మేథ: మనుషుల మాదిరిగానే ఇంటర్నెట్కు అనుసంధానమైన పరికరాలు కూడా పరిస్థితులను అర్థం చేసుకుని కొత్త విషయాలను తెలుసుకుని తదనుగుణంగా పని చేయడం ఐఓటీకి అవసరం. 5జీ నెట్వర్క్: సెకనుకు వంద గిగాబైట్ల గరిష్ట వేగా న్ని అందుకోగల 5జీ నెట్వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకొస్తే.. ఐఓటీ పరికరాల నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేయొచ్చు. బిగ్ డేటా: ఐఓటీ కారణంగా అందుబాటులోకి వచ్చే సమాచారం వందల.. వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేసేందుకు ఇప్పుడున్న పద్ధతులు సరిపోవు. వినూత్నమైన కొత్త పద్ధతుల ద్వారా సమాచార విశ్లేషణకు ఈ బిగ్ డేటా టెక్నాలజీలు ఉపయోగపడతాయి. ఒక దశ తర్వాత ఐఓటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కలిసి ‘ఏఐఓటీ’ అనే సరికొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. కృత్రిమ మేథ, 5జీ నెట్వర్క్, బిగ్ డేటా సాయంతో సమాచార విశ్లేషణ, వినిమయం వేగంగా, సాఫీగా సాగిపోతూ ఉంటుంది. నాలుగు రంగాల్లో ఏఐఓటీ.. వేరబుల్స్ స్మార్ట్‌వాచ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటివి ఉదాహరణలు. స్మార్ట్‌వాచీల్లో ఉపయోగించే సెన్సర్ల కారణంగా గుండెకొట్టుకునే వేగం, రక్తపోటు వంటి ఆరోగ్య సంబంధిత సమాచారం తెలుస్తుంది. అలాగే వర్చు వల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి వా టిని వైద్యం, పర్యాటక రంగం తదితరాల్లో ఉపయో గిస్తున్నారు. ఇవి మరింత వృద్ధి చెందనున్నాయి. స్మార్ట్‌హోం ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిత్యం సమాచార సేకరణ, తదనుగుణంగా కొన్ని పనులు చక్కబెట్టడం. హోం ఆటోమేషన్ అనేది ఏఐఓటీలో ఇప్పుడు హాట్ టాపిక్. కేవలం నోటి మాటతోనే టీవీ, వీడియోలు ఆన్ చేయడం, కిచెన్‌లో కాఫీ పెట్టడం వంటివి చేయగలగడం ఇప్పటికే కొందరికి అనుభవంలోని విషయం. స్మార్ట్ సిటీ చెత్తకుండీల్లో ఐఓటీ సెన్సర్లు ఏర్పాటు చేశామనుకోండి.. నిండగానే తొలగించే సమయమైందని మున్సిపల్ సిబ్బందికి సందేశం వెళ్తుంది. నగరాల్లో ఏఐఓటీ పరికరాల ద్వారా ఒనగూరే ప్రయోజనాల్లో ఇది మచ్చుకు ఒకటి మాత్రమే. వెలుతురుకు అనుగుణంగా వీధిదీపాలను ఆన్/ఆఫ్ చేయడం, ప్రజా రవాణా మరింత మెరుగు చేయడం వంటివి కూడా స్మార్ట్ సిటీల ద్వారా చేయవచ్చు. ఇవన్నీ మనకు సౌకర్యం కల్పించడంతోపాటు వనరులను ఆదా చేస్తాయి కూడా. స్మార్ట్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఒక కారు తయారు కావాలంటే.. చిన్న నట్టును కూడా మనిషే బిగించాలి. రోబోల రంగ ప్రవేశంతో మనిషి అవసరం గణనీయంగా తగ్గింది. ఏఐఓటీతో ఇది మరింత వేగం పుంజుకోనుంది. ఒక్క కారు తయారీలోనే కాదు.. అన్ని రకాల పరిశ్రమల్లోనూ తెలివైన, సమాచారం ఆధారంగా పనిచేసే ఏఐఓటీ పరికరాలు మానవ తప్పిదాలకు అవకాశం లేకుండా, అతితక్కువ వనరుల వృథాతో పనులు పూర్తి చేస్తాయి. -
అదిరిపోయే టీవీ, ఇంట్లో ఉన్న అన్నీ డివైజ్‌లకు కనెక్ట్ చేయొచ్చు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హయర్ తాజాగా ఎస్8 ఆండ్రాయిడ్ టీవీల శ్రేణిలో కొత్తగా మరో రెండు టీవీలను ఆవిష్కరించింది. వీటిలో 55 అంగుళాల టీవీ రేటు రూ. 1,10,990గాను, 65 అంగుళాల టీవీ ధర రూ. 1,39,990గాను ఉంటుంది. 4కే హెచ్డీఆర్ పిక్చర్ నాణ్యత, ఆల్–స్క్రీన్ డిస్ప్లే, ఫ్రంట్ స్పీకర్ డిజైన్ తదితర ఫీచర్లు వీటిలో ఉంటాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 9.0 వెర్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన ప్రత్యేకతలతో ఇది ఇంట్లోని అన్ని స్మార్ట్ డివైజ్‌లకు ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) హబ్‌గా కూడా ఉపయోగపడుతుందని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. -
డిజిటల్లో అగ్రగామిగా భారత్
గాంధీనగర్: డిజిటల్ రంగంలో భారత్ త్వరలోనే అగ్రగామిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ‘డిజిటల్ రంగం ప్రతీ రోజు, ప్రతీ క్షణం కొత్త పుంతలు తొక్కుతున్న దేశం ఏదైనా ఉందంటే.. అది భారత్ మాత్రమేనని ఘంటాపథంగా చెప్పగలను. మొబైల్ డేటా విభాగంలో ప్రపంచ దేశాల జాబితాలో 155వ స్థానంలో ఉండే భారత్ కేవలం 24 నెలల్లోనే నంబర్ వన్ స్థాయికి చేరింది. అలాగే నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో కూడా వచ్చే 24 నెలల్లో అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. పండిట్ దీన్‌దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భారతదేశం.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ అని ఆయన పేర్కొన్నారు. -
టెకీల టార్గెట్ ఇదే
ఫ్రాంక్ఫర్ట్: క్లెయింట్ల నుంచి కొత్త ప్రాజెక్టులు తగ్గిపోవడం, మందగమనంతో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఐటీ కంపెనీలు నూతన టెక్నాలజీపై దృష్టిసారించాయి. డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రొబోటిక్స్‌పై ఆసక్తి కనబరుస్తున్న సంస్థలు వీటిని వీలైనంతగా ప్రమోట్ చేస్తూ మెరుగైన సేవలతో క్లయింట్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో జర్మనీ ఐటీ దిగ్గజం సాఫ్ట్వేర్ ఏజీ నూతనంగా ఐఓటీ వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. సంస్థ లాభాలు దారుణంగా పడిపోవడంతో కొత్త టెక్నాలజీలకు మొగ్గుచూపింది. జనవరిలో ప్రత్యేక ఐఓటీ విభాగాన్ని నెలకొల్పుతామని సాఫ్ట్వేర్ ఏజీ స్పష్టం చేసింది. ఐఓటీ ఆధారిత రెవెన్యూలు త్వరితగతిన వృద్ధి చెందుతాయని కంపెనీ సీఎఫ్ఓ జిన్హార్డ్ చెప్పారు. మరోవైపు సంస్థ డిజిటల్ బిజినెస్ ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో నూతన టెక్నాలజీలపై పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకూ కసరత్తు చేస్తోంది. పలు కంపెనీలు ఇక ఐఓటీ వంటి నూతన టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు యోచిస్తుండటంతో ఈ విభాగంలో టెకీలకు మంచి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. -
‘కోటిన్నర ఉద్యోగాలు కల్పించే సత్తా ఉంది’
సాక్షి,బెంగళూర్ః ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి నూతన టెక్నాలజీలకు కోటిన్నర ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఉందని టెలికాం కార్యదర్శి అరుణా బహుగుణ అన్నారు. కొత్త ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం వెనుకబడి ఉన్నా నూతన టెక్నాలజీలతో ఆ లోటు పూడ్చుకోవచ్చన్నారు. దేశంలోని బెంగళూర్ ఇతర ప్రాంతాల్లో ఐటీ అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతున్నా కేవలం ఐఓటీ ద్వారానే ఈ స్ధాయిలో ఉద్యోగాలు సమకూర్చుకోవచ్చన్నారు. ఐఓటీ ఇండియా కాంగ్రెస్ సదస్సు సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఓటీకి పెద్దసంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగల సత్తా ఉందంటూ, ఈ జాబ్‌లు బడా కంపెనీల నుంచి కాక స్టార్టప్‌ల నుంచే ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. ఐఓటీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో మెరుగైన విధానంతో ముందుకొస్తుందన్నారు. నూతన టెక్నాలజీలకు అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్‌పై ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. -
ఎల్ఈడీ బల్బులతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
లండన్: స్మార్ట్ ఎల్ఈడీ (లైట్ ఎమిటింగ్ డయోడ్) లైట్లను ఉపయోగించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను కనెక్ట్ చేయవచ్చని శాస్త్రవేత్తలంటున్నారు. బొమ్మలు, మన ఇంట్లో ఉండే వివిధ రకాల వస్తువులకు బల్బుల నుంచి వచ్చే కాంతి ద్వారా నెట్‌వర్క్‌ను అనుసంధానించవచ్చని వారు చెబుతున్నారు. ఇళ్లలో వాడే ఎల్ఈడీ బల్బులు కాంతిని ప్రసరించడంతోపాటు లైటు సెన్సార్లుగా కూడా పనిచేస్తాయి. ఇవి ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని సందేశాలు పంపుకోగలవు, వస్తువులకు కనెక్ట్ అవ్వగలవు. గృహోపకరణాలు, ధరించదగిన వస్తువులు, సెన్సార్లు, బొమ్మలను బల్బుల కాంతితో కలిపి ఉంచడానికి ఎల్ఈడీల ద్వారా వీలవుతుంది. ఈ పరిశోధనను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు చేశారు. -
ట్రాఫిక్ కంట్రోల్‌కు న్యూ టెక్నాలజీ!
న్యూయార్క్: ఇంటర్నెట్ ద్వారా మనిషి ఎన్నో పనులను సులభంగా చేయగలుగుతున్నాడు. అయితే ఇంటర్నెట్ టెక్నాలజీని కేవలం మనుషులే కాకుండా వస్తువులు వాటంతట అవే ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అనే కోణంలో వచ్చిన ఆలోచనే 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్'(ఐఓటీ). ఈ టెక్నాలజీని వాడుకొని వెహికిల్స్ వాటంతట అవే పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకొనే కొత్త విధానాన్ని రూపొందించారు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా శాస్త్రవేత్తలు. దీని కోసం ఫినిక్స్ పట్టణంలోని 2.3 మైళ్ల పొడవైన రహదారిని ఎన్నుకొని శాస్త్రవెత్తలు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆ రోడ్డుపై డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి సిగ్నల్స్‌తో అనుసంధానించారు. వెహికిల్స్‌ను కమర్షియల్, ఎమర్జెన్సీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలా పలు రకాలుగా విభజించి సిగ్నల్ వ్యవస్థతో సమాచారం మార్పిడి చేసుకునేలా దీనిని తయారు చేశారు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తోంది. అంతే కాదు ఎంత సమయం తరువాత సిగ్నల్‌ను సమీపిస్తోందనే సమాచారం సైతం ఈ టెక్నాలజీలో ఆటోమేటిక్‌గా సదరు వాహనానికి అందేలాగా రూపొందించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీతో తయారుచేసిన ఈ వ్యవస్థ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కీలకమైన ముందడుగని పరిశోధనకు నేతృత్వం వహించిన లారీ హెడ్ తెలిపారు. -
ఇంటెల్ చేతికి ఆల్టెరా.. 16.7 బిలియన్ డాలర్ల డీల్
న్యూయార్క్: చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ తాజాగా ఆల్టెరా కార్ప్‌ను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం 16.7 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. 47 సంవత్సరాల కంపెనీ చరిత్రలో ఇది అత్యంత భారీ డీల్ కానుంది. ఆల్టెరా షేరు ఒక్కింటికి ఇంటెల్ 54 డాలర్లు చెల్లించనుంది. ఇందుకోసం ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంటెల్ తెలిపింది. డేటా సెంటర్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) తదితర వ్యాపార విభాగాల కస్టమర్లకు మరింత మెరుగైన ఉత్పత్తులను అందించేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని పేర్కొంది. ఫోన్ నెట్‌వర్క్‌లు, సర్వర్ సిస్టమ్స్, కార్లు మొదలైన వాటికి అవసరమయ్యే ప్రాసెసర్లను ఆల్టెరా డిజైన్ చేస్తుంది. -
ఆరేళ్లలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ విశ్వరూపం!
2020 నాటికి 92 వేల కోట్ల పరిశ్రమను సృష్టించడమే లక్ష్యం దేశంలో ఇంటర్నెట్ పరిశ్రమ అభివృద్ధి పాలసీ ముసాయిదాకు రూపకల్పన న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన ఇంటర్నెట్ మరింత వేగంగా విస్తరిస్తూ.. అరచేతిలోనే ప్రపంచాన్ని చూపెడుతోంది. ప్రతిరంగంలోనూ ఇంటర్నెట్ అనేక పరికరాలకు అనుసంధానం అవుతూ ఎన్నో సేవలను అందిస్తోంది. అందుకే.. ఇంటర్నెట్తో అనుసంధానమై పనిచేసే పరికరాలకు సంబంధించిన ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ)’ పరిశ్రమ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది. దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధిపర్చాలన్న లక్ష్యానికి తోడుగా ఐవోటీ పరిశ్రమను అభివృద్ధిపర్చాలని కేంద్రం భావిస్తోంది. మరో ఆరేళ్లనాటికి ఈ పరిశ్రమను రూ.92 వేల కోట్ల పరిశ్రమగా అభివృద్ధిపర్చాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ‘ఐవోటీ పాలసీ ముసాయిదా’ను రూపొందించింది. వివిధ రంగాల్లో ఈ పాలసీ కింద అమలు చేసేందుకు అనేక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఐవోటీ పాలసీ అమలు వల్ల దేశంలో ఇంటర్నెట్తో అనుసంధానమై పనిచేసే పరికరాల సంఖ్య ఆరేళ్లకే 20 కోట్ల నుంచి 270 కోట్లకు పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2011 నాటికే 1,250 కోట్ల ఇంటర్నెట్ అనుసంధానిత పరికరాలు ఉండగా, మరో ఆరేళ్లలో ఆ సంఖ్య 5 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. ఐవోటీ అంటే... వివిధ పరికరాలు ఇంటర్నెట్ ద్వారా ఒకదానికి ఒకటి అనుసంధానమై పనిచేయడాన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ)గా పిలుస్తారు. ఇంటర్నెట్ ద్వారా అనుసంధానమై పనిచేసే పరికరాలను తయారుచేసి, నిర్వహించే పరిశ్రమనే ఐవోటీ పరిశ్రమగా పేర్కొంటారు. అయితే ఐవోటీ పరిశ్రమ సేవలు ప్రస్తుతం దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరిస్తున్నాయి. వ్యవసాయం, ఆరోగ్య సేవలు, ఇంధన రంగం, భద్రత, విపత్తుల నిర్వహణ.. ఒకటేమిటి దాదాపు అన్నిరంగాల్లోనూ ఎన్నో సమస్యలకు రిమోట్‌తో అనుసంధానమయ్యే పరికరాల ద్వారా మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ పరిష్కారాలు పొందేందుకు ఐవోటీ వీలు కల్పిస్తుంది. ఐవోటీ పరికరాల ద్వారా.. వీధిలైట్లు సమయం ప్రకారం లేదా వెలుతురు లభ్యతను బట్టి ఆటోమేటిక్‌గా వెలిగేలా, ఆరిపోయేలా చేయొచ్చు. ట్రాఫిక్ సిగ్నళ్లను ఆటోమేటిక్‌గ్గా నియంత్రించొచ్చు. రిజర్వాయర్ల నుంచి పబ్లిక్ కుళాయిల వరకూ నీటి ప్రవాహం, నాణ్యతను పర్యవేక్షించొచ్చు. స్మార్ట్ పర్యావరణ పరికరాలతో వాయుకాలుష్యాన్ని పర్యవేక్షించవచ్చు.