ట్రాఫిక్ కంట్రోల్కు న్యూ టెక్నాలజీ! | Internet of Things powers better traffic management in US | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ కంట్రోల్కు న్యూ టెక్నాలజీ!

Published Fri, Apr 15 2016 3:17 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ట్రాఫిక్ కంట్రోల్కు న్యూ టెక్నాలజీ! - Sakshi

ట్రాఫిక్ కంట్రోల్కు న్యూ టెక్నాలజీ!

న్యూయార్క్: ఇంటర్నెట్ ద్వారా మనిషి ఎన్నో పనులను సులభంగా చేయగలుగుతున్నాడు. అయితే ఇంటర్నెట్ టెక్నాలజీని కేవలం మనుషులే కాకుండా వస్తువులు వాటంతట అవే ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అనే కోణంలో వచ్చిన ఆలోచనే 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్'(ఐఓటీ). ఈ టెక్నాలజీని వాడుకొని వెహికిల్స్ వాటంతట అవే పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకొనే కొత్త విధానాన్ని రూపొందించారు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా శాస్త్రవేత్తలు.

దీని కోసం ఫినిక్స్ పట్టణంలోని 2.3 మైళ్ల పొడవైన రహదారిని ఎన్నుకొని శాస్త్రవెత్తలు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆ రోడ్డుపై డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి సిగ్నల్స్తో అనుసంధానించారు. వెహికిల్స్ను కమర్షియల్, ఎమర్జెన్సీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలా పలు రకాలుగా విభజించి సిగ్నల్ వ్యవస్థతో సమాచారం మార్పిడి చేసుకునేలా దీనిని తయారు చేశారు.

దీంతో ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తోంది. అంతే కాదు ఎంత సమయం తరువాత సిగ్నల్ను సమీపిస్తోందనే సమాచారం సైతం ఈ టెక్నాలజీలో ఆటోమేటిక్గా సదరు వాహనానికి అందేలాగా రూపొందించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీతో తయారుచేసిన ఈ వ్యవస్థ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కీలకమైన ముందడుగని పరిశోధనకు నేతృత్వం వహించిన లారీ హెడ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement