Traffic management
-
క్రైమ్ వర్క్‌కూ ట్రాఫిక్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ పోలీసు విభాగం వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కేవలం ట్రాఫిక్ కోణంలోనే కాకుండా క్రైమ్ వర్క్‌కూ ఉపకరిస్తోంది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లోని ఇంటిగ్రేటెడ్ ఈ–చలాన్ డేటాతో పాటు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం (ఏఎన్పీఆర్) వల్ల అనేక కేసులు కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి స్కోచ్ సంస్థ 2022 సంవత్సరానికి సంబంధించి పోలీసు అండ్ సేఫ్టీ అంశంలో గోల్డ్, సిల్వర్ అవార్డులను బుధవారం ప్రకటించింది. ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం, వాహన చోదకులు గమ్యం చేసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం, ట్రాఫిక్ జామ్స్‌ను దాదాపు కనుమరుగు చేయడం ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థ ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) నగర పోలీసు విభాగానికి వెన్నెముకగా మారింది. నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఈ తరహా కేటుగాళ్లకు చెక్ చెప్తోంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. ట్రాకింగ్ విధానం సైతం.. నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం సైతం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి వచి్చంది. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్వేర్ ద్వారా కలుగుతోంది. ప్రస్తుతం నగరంలోని కొన్ని జంక్షన్లలో వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కకుండా ఉండేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలూ వీటి ద్వారా ప్రదర్శితమవుతున్నాయి. వాహన చోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి ఐటీఎంఎస్‌లో పెద్దపీట వేశారు. అన్ని రకాలైన ఉల్లంఘనలపై ఐటీఎంఎస్ వ్యవస్థలోని కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్‌గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతోంది. కొలిక్కి వచి్చన కేసుల్లో కొన్ని... రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ ఏడాది మార్చిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన హేమంత్ కుమార్ గుప్తా 48 గంటల్లోనే శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా స్నాచర్ వాడిన వాహనం నెంబర్ గుర్తించిన అధికారులు ఈ–చలాన్ డేటాబేస్ నుంచి యజమానికి ఫోన్ నెంబర్ సంగ్రహించారు. దీంతో ముందుకు వెళ్లిన పోలీసులు స్సైస్ జెట్ విమానం ఎక్కిన హేమంత్‌ను అందులోనే పట్టుకుని తీసుకువచ్చారు. వికారాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 11 వాహనాలను తస్కరించిన నిందితుడు సైతం ఈ డేటాబేస్ ద్వారానే చిక్కాడు. మహంకాళి, చిలకలగూడ పోలీసుస్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్న హిట్ అండ్ రన్ కేసు, ఎస్సార్‌నగర్ పరిధిలోని స్నాచింగ్ కేసు, ఇబ్రహీంపట్నానికి సంబంధించిన చోరీ కేసు తదితరాలు సైతం ఈ డేటాబేస్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. లాక్డౌన్ సమయంలో ఉల్లంఘనుల గుర్తింపు, ఫలక్నుమలో నమోదైన కిడ్నాప్ కేసుల ఛేదనలో ఏఎన్పీఆర్ డేటా ఉపయుక్తంగా మారింది. (చదవండి: ట్రేడింగ్ పేరుతో హాంఫట్ ) -
మెగా కమిషనరేట్
సాక్షి, అమరావతి బ్యూరో (కృష్ణా) : విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిని విస్తరిస్తూ మెగా కమిషనరేట్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిధిలోకి సీఆర్డీఏలోని ప్రాంతాలను తీసుకొస్తూ నూతన కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో జరుగుతున్న సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాంతిభద్రతలపై జరిగిన సమీక్షలో ఈ మేరకు డీజీపీతో చర్చించి అధ్యయనం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే విజయవాడలోని ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, దోపిడీని ఉపేక్షించవద్దని నగర సీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. ‘విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి, దోపిడీని ఉపేక్షించ వద్దు.. కాల్‌మనీ లాంటి ఘటనలు నగరంలో మళ్లీ పునరావృతం కావడానికి వీల్లేదు.. ఫిర్యాదు వస్తే సత్వరమే చర్యలు తీసుకోండి.. చట్టవిరుద్ధ కార్యకలాపాలు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపండి’ అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల అంశంపై మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమలరావుతో ముఖాముఖీ నిర్వహించిన సీఎం నగర పరిస్థితులపై మాట్లాడారు. మెగా కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదన.. రాజధాని నగరానికి తగినట్లుగా పోలీసు వ్యవస్థను పటిష్ట పరచడానికి ప్రస్తుత విజయవాడ కమిషరేట్ పరిధిలోకి సీఆర్డీఏ ప్రాంతాన్ని తీసుకువస్తూ ‘మెగా కమిషనరేట్(అమరావతి కమిషరేట్)ను ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని సీపీ ద్వారకా తిరుమలరావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కృష్ణా ఎస్పీ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం నుంచి జగ్గయ్యపేట వరకు కూడా ఈ కమిషరేట్ పరిధిలోకి వస్తుందని, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు రూరల్, గుంటూరు అర్బన్ పోలీసుల పరిధిలోని కొన్ని ప్రాంతాలను విజయవాడ కమిషనరేట్ పరిధిలోకి తేవాల్సి ఉందని తెలిపారు. అలాగే కమిషరేట్‌ను ఆరు సబ్డివిజన్లుగా విభజించి.. ఒక్కో డివిజన్‌కు ఒక్కో ఐపీఎస్ అధికారిని డీసీపీగా నియమించాల్సి ఉంటుందని, అదనంగా మరో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ పోస్టులతోపాటు కానిస్టేబుళ్లను వివిధ విభాగాలకు కేటాయించాలని ప్రతిపాదించారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ డీజీపీతోపాటు నిపుణుల కమిటీతో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీకి తెలిపారు. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే.. విజయవాడ నగరం నుంచి చెన్నై–కోల్‌కతా, విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారులు వెళ్తున్నాయని.. తద్వార ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం కావాలంటే నగరంలో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం ఒక ప్రత్యామ్నాయమని నగర సీపీ ద్వారకా తిరుమలరావు సీఎం వైఎస్ జగన్‌కు ప్రతిపాదించారు. కనకదుర్గ వారథి నుంచి గన్నవరం వరకు నేరుగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల బెంజిసర్కిల్, నిర్మలా జంక్షన్, రమేష్ ఆస్పత్రి సర్కిల్, మహానాడు, రామవరప్పాడు, ఎనికేపాడు, గూడవల్లి, గన్నవరం వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తుందన్నారు. మరో ప్రత్యామ్నాయం.. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప వరకు బైపాస్ మార్గాన్ని నిర్మించి దీనిని తాడిగడప కూడలిలోని వంద అడుగుల రోడ్డులో అనుసంధానం చేస్తే నగరంలోని బెంజిసర్కిల్‌పై ఒత్తిడి తగ్గుతుందని సీపీ వివరించారు. విజయవాడ–బందరు హైవేపై మరొకటి.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై మరో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే మార్గాన్ని నిర్మించాలని, దీనివల్ల ఎన్టీఆర్ సర్కిల్, పటమట, ఆటోనగర్ గేట్, కామయ్యతోపు, కానూరు, తాడిగడప, పోరంకి కూడళ్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను గొల్లపూడి వై జంక్షన్ వరకు పొడిగిస్తే ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోతాయని తెలిపారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్.. నగరంలో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల వాహనాల రద్దీని అంచనా వేస్తూ ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్స్ పనిచేస్తాయన్నారు. పాదచారుల కోసం.. బెంజిసర్కిల్, రమేష్ హాస్పిటల్ సర్కిళ్లో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇక్కట్లు పడుతున్నారని వారి కోసం ఈ రెండు సర్కిళ్లలో సబ్ వేలు ఏర్పాటు చేస్తే రోడ్డు మార్గం దాటేందుకు సులువుగా ఉంటుందని సీపీ వివరించారు. వీటిపైన సీఎం జగన్ స్పందిస్తూ సమగ్ర నివేదికతో రావాలని సూచించారు. అవినీతి, దోపిడీని ఉపేక్షించొద్దు.. విజయవాడ నగరంలో అవినీతి, దోపిడీని ఉపేక్షించొద్దని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. నగరంలో ప్రకంపనలు సృష్టించిన కాల్‌మనీ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అలాంటి ఘటన మళ్లీ పునరావృతం కారాదని హెచ్చరించారు. ఫిర్యాదు వస్తే సత్వరమే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కాల్‌మనీ బాధితులకు న్యాయం జరిగిందా అని ఆరా తీశారు. నగరంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. -
ట్రాఫిక్ కంట్రోల్‌కు న్యూ టెక్నాలజీ!
న్యూయార్క్: ఇంటర్నెట్ ద్వారా మనిషి ఎన్నో పనులను సులభంగా చేయగలుగుతున్నాడు. అయితే ఇంటర్నెట్ టెక్నాలజీని కేవలం మనుషులే కాకుండా వస్తువులు వాటంతట అవే ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అనే కోణంలో వచ్చిన ఆలోచనే 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్'(ఐఓటీ). ఈ టెక్నాలజీని వాడుకొని వెహికిల్స్ వాటంతట అవే పరస్పరం సమాచారాన్ని మార్పిడి చేసుకొనే కొత్త విధానాన్ని రూపొందించారు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా శాస్త్రవేత్తలు. దీని కోసం ఫినిక్స్ పట్టణంలోని 2.3 మైళ్ల పొడవైన రహదారిని ఎన్నుకొని శాస్త్రవెత్తలు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఆ రోడ్డుపై డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసి సిగ్నల్స్‌తో అనుసంధానించారు. వెహికిల్స్‌ను కమర్షియల్, ఎమర్జెన్సీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలా పలు రకాలుగా విభజించి సిగ్నల్ వ్యవస్థతో సమాచారం మార్పిడి చేసుకునేలా దీనిని తయారు చేశారు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి సిగ్నల్ వ్యవస్థ పనిచేస్తోంది. అంతే కాదు ఎంత సమయం తరువాత సిగ్నల్‌ను సమీపిస్తోందనే సమాచారం సైతం ఈ టెక్నాలజీలో ఆటోమేటిక్‌గా సదరు వాహనానికి అందేలాగా రూపొందించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీతో తయారుచేసిన ఈ వ్యవస్థ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కీలకమైన ముందడుగని పరిశోధనకు నేతృత్వం వహించిన లారీ హెడ్ తెలిపారు. -
కన్నీటి గోదారి...
పుణ్య తిథుల్లోనే భక్తుల రద్దీ కొవ్వూరు నుంచి సాక్షి ప్రతినిధి : విశేష ప్రాశస్త్యం ఉన్న పుష్కరాలకు భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతోంది. మరోవైపు అధికారులు పుణ్య తిథులు, వాటి ప్రాశస్త్యాన్ని బట్టి రద్దీ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తిథి, నక్షత్రాన్ని దీనికి అనుగుణంగా ఉండే దేవతా గణాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అధికారిక అంచనాలు ఇలా.. ఈ నెల 15వ తేదీ శివనక్షత్రం, 16వ తేదీ అమవాస్య కావడంతో పిండ ప్రదానానికి శ్రేష్టమైన రోజు, 17వ తేదీ దక్షిణాయన పుణ్యకాలం ఉండటం, 18 వారాంతం కావడం, 19వ తేదీ ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న మఖ నక్షత్రం కావడం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 20వ తేదీ పుబ్బ నక్షత్రం, 21వ తేదీ ఉత్తర, 22వ తేదీ హస్త నక్షత్రాలు కావడంతో భక్తులు సాధారణ సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీ గురువారం సప్తమి, చిత్త నక్షత్రం కావడంతో పుణ్యస్నాన ఆచరణకు యోగ్యమైన రోజు. 24వ తేదీ గురువారం అష్టమి, స్వాతి నక్షత్రం రోజున పుష్కర యాత్రికుల సంఖ్య సాధారణంగా ఉంటుంది. 25వ తేదీ శనివారం విశాఖ నక్షత్రం, ఆఖరి రోజుకావడంతో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్నానం చేసే అవకాశం ఉంది. ఎప్పుడేం జరిగింది? రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమైన రాజమండ్రి పుష్కర్ ఘాట్ మంగళవారం తెల్లవారుజాము నుంచే జనసంద్రంగా మారింది. తొలిరోజు దాదాపు లక్ష మంది భక్తుల తరలివచ్చారు. వారిని నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వ అధికారులు, పోలీసుల వైఫల్యం కారణంగా 27 మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఎప్పుడేం జరిగిందంటే...? ►తెల్లవారుజామున 3 గంటల నుంచే పుష్కర్‌ఘాట్‌కు భక్తుల రాక. ► 5.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. ► 5.50 గంటలకు కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆగమనం. ► 6 గంటల నుంచి పుష్కరాల ప్రారంభోత్సవానికి వేదపండితుల మంత్రోచ్ఛరణలు. ► 6.28 గంటలకు సీఎం చంద్రబాబు, జయేంద్ర సరస్వతి స్వామి పుష్కర స్నానం చేశారు. ► 6.45 గంటల నుంచి చంద్రబాబు తన పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. ► 7.30 గంటలకు చంద్రబాబు పుష్కరఘాట్ నుంచి బయటకు వెళ్లారు. ►8 గంటల వరకు పుష్కరఘాట్ వెలుపల చంద్రబాబు బట్టలు మార్చుకున్నారు. ► 8.30 గంటలకు పుష్కరఘాట్ నుంచి సీఎం కాన్వాయ్ బయల్దేరింది. ►8.30 గంటలకు పుష్కరఘాట్ మొదటి గేటును తెరిచారు. అప్పటివరకు నిరీక్షిస్తున్న భక్తులు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ► 9 గంటలకు స్నానం చేసిన భక్తులు బయటకు వస్తుండగా.. బయట ఉన్న వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ► 9.30 గంటలకు మూడు గేట్లు ఒక్కసారిగా తెరవడంతో భక్తుల మధ్య తోపులాట ప్రారంభమైంది. ►9.30 నుంచి 10.30 వరకూ భక్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ► 10.30 గంటలకు భక్తులను నిలువరించేందుకు పోలీసులు, అధికారుల ప్రయత్నించారు. ►11 గంటలకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ► 11 గంటలకు అప్పటికే మృతి చెందిన వారిని ఒకచోటుకి తరలించారు. ►11.30 గంటలకు ఆక్టోపస్ (బ్లాక్ కమెండోల) బృందం రంగ ప్రవేశం చేసింది. ► 11.30 గంటల నుంచి భక్తులు ఘాట్‌లో ప్రవేశించడంపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. ►12 గంటల నుంచి పుష్కరఘాట్‌లో భక్తుల రద్దీ తగ్గింది. పుష్కరాల్లో మృతులు వీరే.. గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతిచెందారు. వీరిలో 24 మంది మహిళలు కాగా, ఇద్దరు పురుషులు, మరొక బాలుడు ఉన్నారు. వీరిలో ఇద్దరిని గుర్తించాల్సి వుంది. మృతుల్లో 15 మంది ఉత్తరాంధ్రవాసులే ఉన్నారు. మృతి చెందిన వారు.. 1. దేశినీడి కృష్ణవేణి(52), వేమగిరి-రాజమండ్రి 2. బి.రాజ్యలక్ష్మీ(50), ఉండి-పశ్చిమగోదావరి జిల్లా 3. గొర్రెల మంగమ్మ(60), వెలమతోట- వైజాగ్ 4. ఎ.గౌరి(16), వైజాగ్ 5. పుట్టు నాగలక్ష్మీ(42), బలగ-శ్రీకాకుళం 6. పర్వతాల రాజేశ్వరి(32), పోలీస్ కాలనీ-నెల్లూరు జిల్లా 7. ఎల్.బి.పేరమ్మ(53), నెల్లూరు 8. లంబ తిరుపతమ్మ(40), కాశీపురం-శ్రీకాకుళం 9. ఎం.మహాలక్ష్మీ(65)-వైజాగ్ 10. పాండవుల విజయలక్ష్మీ(61), చినముసలివాడ-వైజాగ్ 11. మైగాపుల లక్ష్మణరావు(65), తాడేపల్లిగూడెం 12. ఎ.బయ్యారమ్మ(45)-వైజాగ్ 13. పి.మీనాక్షి(65), జంషెడ్పూర్ 14. ఎం.అనంతలక్ష్మీ(30), ధవళేశ్వరం 15. జడ్డు నరసమ్మ(50), సరసనపల్లి-శ్రీకాకుళం 16. బి.ప్రశాంత్‌కుమార్(15), బలగ-శ్రీకాకుళం 17. కొత్తకోట కళావతి(60), బొద్దూరు-శ్రీకాకుళం 18. కె.జానకమ్మ(55)-నెల్లూరు 19. పైలా పెంటమ్మనాయుడు(60), సరసనపల్లి-శ్రీకాకుళం 20. సి.రంగస్వామి(60), జయశ్రీనగర్-బెంగుళూరు 21. మట్టపర్తి సత్యవతి(55), ధవళేశ్వరం 22. ఎస్.అమ్మాయమ్మ(75), శ్రీకాకుళం 23. అమలాపురం పైడితల్లి(55), బొబ్బిలి-విజయనగరం 24. పుట్నూరి అమరావతి(45), ఆమదాలవలస-శ్రీకాకుళం 25. ఆదిపాక నారాయణమ్మ(60), కొత్తవలస, విజయనగరం జిల్లా + ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వీరిద్దరూ మహిళలే. గాయపడినవారు వీరే.. పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడినవారి వివరాలు: బిక్కిన వెంకటలక్ష్మి (రాజమండ్రి లాలాచెరువు), హరి కిరణ్మయి (పలాస), యండమూరి రత్నం (యానాం), సురేష్(విశాఖపట్నం), హనుమంతరావు (రాజమండ్రి), గనివాడ కృష్ణవేణి (విజయనగరం), ఇందిర (శ్రీకాకుళం), సత్యవతి (సింహాచలం), కన్నూరి బాబూజీ (తేజపురం-విశాఖ జిల్లా), శకుంతల (కృష్ణపురం), స్వర్ణలత (పలాస), రమాదేవి (రాజమండ్రి తిలక్ రోడ్డు) తీవ్రంగా గాయపడ్డారు. వీరితోపాటు 49 మంది స్వల్పంగా గాయపడ్డారు. వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 150 మంది చికిత్స పొందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ఒక్కసారిగా వెనుకవైపు నుంచి తోసివేశారు మేము తెల్లవారుజామున వచ్చినా.. 8. 30 వరకూ ఘాట్‌లోకి రానివ్వలేదు. ఒక్కసారిగా భక్తులందరూ ఘాట్‌లోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 20 మంది వరకూ వచ్చాం. తొక్కిసలాటలో మా బంధువులు పోట్నూరి అమరావతి, భరతం ప్రశాంతి, కొత్తకోట కళావతి మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. గాయాలపాలైనవారిని సకాలంలో హాస్పటల్‌కు తీసుకువెళ్లి ఉంటే కొంతమంది అయినా బతికేవారు. - సొంగల తేజ, శ్రీకాకుళం అంతమందికీ ఒకే ఒక్క అంబులెన్స్ సంఘటన జరిగిన సమయంలో పుష్కర ఘాట్‌లో ఒకే ఒక్క అంబులెన్స్ ఉండడంతో గాయాలపాలైనవారికి సకాలంలో వైద్య సేవలు అందించలేకపోయారు. దీంతో చాలామంది మృతి చెందారు. గాయాలపాలైనవారికి పట్టించేందుకు కనీసం మంచినీళ్లు కూడా లేవు. చచ్చిపోతున్నాం మంచినీళ్లు ఇవ్వమన్నా వినిపించుకున్న నాథుడు లేడు. ముఖ్యమంత్రి తన స్నానానికి భక్తులను బలి తీసుకున్నారు. - జి.అప్పలనాయుడు, నరసన్నపల్లి, రేగిడి మండలం, శ్రీకాకుళం సౌకర్యాలు సరిగా లేవు పుష్కరాల రేవులో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉంటే ఇంత తొక్కిసలాట జరిగి ఉండేది కాదు. ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వీఐపీలకు వేరే ఘాట్ ఉన్నా సీఎం చంద్రబాబు ఇదే ఘాట్‌లో స్నానం చేయడంవల్ల స్నానం చేసేందుకు ఆలస్యమై, తొందరలో తొక్కిసలాట జరిగింది. - వెంకటేష్, శ్రీకాకుళం జిల్లా అమ్మ చనిపోయింది.. స్నానం చేసేందుకు మా అమ్మ, నేను, మా అబ్బాయి కలిసి వెళ్లాం. స్నానాల రేవులోంచి బయటకు వచ్చేవారు ఒకే దారి అవడంతో రద్దీ అధికమైంది. ఈ తొక్కిసలాటలో మా అమ్మ చనిపోయింది దేవుడా... -జనపాల అరుణకుమారి, విశాఖజిల్లా .