సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ పోలీసు విభాగం వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కేవలం ట్రాఫిక్ కోణంలోనే కాకుండా క్రైమ్ వర్క్‌కూ ఉపకరిస్తోంది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌లోని ఇంటిగ్రేటెడ్ ఈ–చలాన్ డేటాతో పాటు ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం (ఏఎన్‌పీఆర్) వల్ల అనేక కేసులు కొలిక్కి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి స్కోచ్ సంస్థ 2022 సంవత్సరానికి సంబంధించి పోలీసు అండ్ సేఫ్టీ అంశంలో గోల్డ్, సిల్వర్ అవార్డులను బుధవారం ప్రకటించింది.
- ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం, వాహన చోదకులు గమ్యం చేసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం, ట్రాఫిక్ జామ్స్‌ను దాదాపు కనుమరుగు చేయడం ఈ లక్ష్యాలతో ఏర్పాటైన అత్యాధునిక వ్యవస్థ ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) నగర పోలీసు విభాగానికి వెన్నెముకగా మారింది.
- నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నెంబర్లకు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్‌పీఆర్) సాఫ్ట్‌వేర్ ఈ తరహా కేటుగాళ్లకు చెక్ చెప్తోంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నెంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నెంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నెంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది.
- ట్రాకింగ్ విధానం సైతం..
- నగర వ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం సైతం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి వచి్చంది. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో సంచరించే ప్రతి వాహనాన్నీ నెంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. ఏదైనా నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనమో ఏ ప్రాంతం నుంచి ఏ సమయంలో ఎక్కడికి ప్రయాణించిందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా కలుగుతోంది.
- ప్రస్తుతం నగరంలోని కొన్ని జంక్షన్లలో వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతుల్ని ఎప్పికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కకుండా ఉండేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలూ వీటి ద్వారా ప్రదర్శితమవుతున్నాయి.
- వాహన చోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి ఐటీఎంఎస్‌లో పెద్దపీట వేశారు. అన్ని రకాలైన ఉల్లంఘనలపై ఐటీఎంఎస్ వ్యవస్థలోని కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్‌గా సంబంధింత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతోంది.
- కొలిక్కి వచి్చన కేసుల్లో కొన్ని...
- రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ ఏడాది మార్చిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన హేమంత్ కుమార్ గుప్తా 48 గంటల్లోనే శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా స్నాచర్ వాడిన వాహనం నెంబర్ గుర్తించిన అధికారులు ఈ–చలాన్ డేటాబేస్ నుంచి యజమానికి ఫోన్ నెంబర్ సంగ్రహించారు. దీంతో ముందుకు వెళ్లిన పోలీసులు స్సైస్ జెట్ విమానం ఎక్కిన హేమంత్‌ను అందులోనే పట్టుకుని
- తీసుకువచ్చారు.
- వికారాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో 11 వాహనాలను తస్కరించిన నిందితుడు సైతం ఈ డేటాబేస్ ద్వారానే చిక్కాడు. మహంకాళి, చిలకలగూడ పోలీసుస్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్న హిట్ అండ్ రన్ కేసు, ఎస్సార్‌నగర్ పరిధిలోని స్నాచింగ్ కేసు, ఇబ్రహీంపట్నానికి సంబంధించిన చోరీ కేసు తదితరాలు సైతం ఈ డేటాబేస్ ద్వారానే కొలిక్కి వచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో ఉల్లంఘనుల గుర్తింపు, ఫలక్‌నుమలో నమోదైన కిడ్నాప్ కేసుల ఛేదనలో ఏఎన్‌పీఆర్ డేటా ఉపయుక్తంగా మారింది.
(చదవండి: ట్రేడింగ్ పేరుతో హాంఫట్ )
Comments
Please login to add a commentAdd a comment