
హెల్త్ ట్రాకర్లు చాలావరకు అన్ని ఆభరణాల రూపాల్లోనూ వచ్చేసినట్టు, అనేక రకాల స్లీప్ ట్రాకర్లు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వేలికి ధరించే ఈ ‘ఔరా రింగ్ జెన్3’ నిద్ర వ్యవధి, నాణ్యతను ట్రాక్ చేస్తుంది. వీటితోపాటు హృదయ స్పందన, శ్వాస విధానాలు, శరీర కదలికలను కూడా పర్యవేక్షించి, ‘స్లీప్ ఫిట్‌నెస్ స్కోర్’ను ఇస్తుంది. మొబైల్‌కు అనుసంధానం చేసుకొని, యాప్ సాయంతో ఉపయోగించుకోవచ్చు. ధర రూ. 21,414.
స్మార్ట్ పరుపు
మంచి నిద్రకు మంచి పరుపు చాలా ముఖ్యం. మెత్తటి పరుపులు నిద్రకు అనుకూలంగా ఉంటాయి. కాని, ఇప్పుడు వచ్చే ఈ స్మార్ట్ పరుపులు మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. ఇవి నిద్ర అలవాట్లు, కదలికలను పర్యవేక్షించడానికి వీటిలో సెన్సార్లు ఉంటాయి. మీరు ఎంత బాగా నిద్రపోతున్నారనే విషయాన్ని ట్రాక్ చేసి, సమాచారం ఇస్తాయి. సౌకర్యవంతంగా ఉండటానికి శరీర ఉష్ణోగ్రతను అనుకూలంగా మార్చి, హాయిగా నిద్రపోయేలా చేస్తాయి.