‘కోటిన్నర ఉద్యోగాలు కల్పించే సత్తా ఉంది’
‘కోటిన్నర ఉద్యోగాలు కల్పించే సత్తా ఉంది’
Published Fri, Sep 15 2017 4:26 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM
సాక్షి,బెంగళూర్ః ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) వంటి నూతన టెక్నాలజీలకు కోటిన్నర ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఉందని టెలికాం కార్యదర్శి అరుణా బహుగుణ అన్నారు. కొత్త ఉద్యోగాల కల్పనలో ఐటీ రంగం వెనుకబడి ఉన్నా నూతన టెక్నాలజీలతో ఆ లోటు పూడ్చుకోవచ్చన్నారు. దేశంలోని బెంగళూర్ ఇతర ప్రాంతాల్లో ఐటీ అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతున్నా కేవలం ఐఓటీ ద్వారానే ఈ స్ధాయిలో ఉద్యోగాలు సమకూర్చుకోవచ్చన్నారు.
ఐఓటీ ఇండియా కాంగ్రెస్ సదస్సు సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఐఓటీకి పెద్దసంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగల సత్తా ఉందంటూ, ఈ జాబ్‌లు బడా కంపెనీల నుంచి కాక స్టార్టప్‌ల నుంచే ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. ఐఓటీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలో మెరుగైన విధానంతో ముందుకొస్తుందన్నారు. నూతన టెక్నాలజీలకు అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్‌పై ఐటీ, టెలికాం మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు.
Advertisement