సాంకేతిక కేంద్రంగా ఇట్స్‌ ఫ్లో టైం | Drone use from the Internet of Things | Sakshi
Sakshi News home page

సాంకేతిక కేంద్రంగా ఇట్స్‌ ఫ్లో టైం

Published Wed, Jun 26 2024 7:09 AM | Last Updated on Wed, Jun 26 2024 10:00 AM

Drone use from the Internet of Things

ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం సరికొత్త ఆవిష్కరణలు పరిచయమవుతూనే ఉంటాయి. అయితే ఆ ఆవిష్కరణలు అందరికీ చేరడానికి చాలా సమయమే పడుతోంది. ఈ క్రమంలో వాటిని విద్యార్థుల చెంతకు చేర్చాలన్నా.. దానిపై అవగాహన కల్పించాలన్నా.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి. రోబోల తయారీ నుంచి 3డీ ప్రింటింగ్‌ వరకూ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ నుంచి డ్రోన్‌ వినియోగం వరకూ వాటి తయారీ విధానం, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పనితీరును తదితర టెక్నాలజీని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కొంత మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు ముందడుగేశారు.. ఇంతకీ ఆ విద్యార్థులు ఏం చేశారు? వారి ఉద్దేశం ఏంటి? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..!  

⇒ఇంజినీరింగ్‌ విద్యార్థుల నూతన ఆవిష్కరణ
⇒విద్యార్థుల చెంతకు ‘సాంకేతిక’ చదువు
⇒‘ఫ్లో’ పేరుతో కొత్త తరహా ప్రయత్నం
⇒గ్రేటర్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితం
⇒సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనే లక్ష్యం      

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలి్పంచాలి.. దాని వినియోగం విద్యార్థుల చెంతకు చేర్చాలి.. ఇదీ పలువురి ఇంజినీరింగ్‌ విద్యార్థుల సంకల్పం.. అనుకున్నదే తడవుగా సాయం కోసం పలువురిని సంప్రదించారు.. వారి సంకల్పానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వంతపాడారు.. ఆయన సాయంతో ఓ బస్సులో అన్ని సదుపాయాలతో అత్యాధునిక సాంకేతికతను వివరించే నమూనాలతో ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. దీనికి ‘ఫ్లో’ (ఫ్యూచరిస్టిక్‌ ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌)ను సిద్ధం చేశారు. దీనిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఫ్లో ఒక వరంగా మారనుంది... 

ఇదే ఫ్లో లక్ష్యం... 
భవిష్యత్తులో రోబోలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి. వాటిని తయారు చేయడం ఎలా? అందుకు అవసరమైన టెక్నాలజీ ఏంటి? రోబోలకు ఎందుకు అంత ప్రాధాన్యత? తయారు చేసిన రోబోలు ఎలా పనిచేస్తాయి? వాటిని వినియోగించడం ఎలా?.. తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరిస్తారు. ప్రాక్టికల్‌గా బస్‌లోని రోబోలను చూపిస్తూ విద్యార్థులకు అవగాహన కలి్పస్తారు. 

వాతావరణ వ్యవస్థపై... 
ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎంత వేడి (ఎన్ని డిగ్రీలు) ఉంది. రేపు వాతావరణం ఎలా ఉండబోతోంది. వర్షం ఎపుడు కురుస్తుందనే ముందస్తు సమాచారం. వర్షం కొలమానం, తుఫాను హెచ్చరిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. గాలులు ఎటు నుంచి ఎటువైపు ప్రయాణిస్తున్నాయి. వంటి వాతావరణ సమాచారం మనకు ముందుగానే తెలుస్తుంది. అయితే అది ఎలా సాధ్యమవుతుంది? దానికి వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం, తదితర అంశాలపై ఫ్లో బస్‌లో విద్యార్థులకు వివరిస్తారు.  

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ)... 
ప్రస్తుత ఇంటర్నెట్‌ వ్యవస్థ ప్రపంచాన్ని మన చేతుల్లో పెడుతోంది. చిటికెలో సమాచారాన్ని చేరవేస్తోంది. కార్యాలయంలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్న ఫ్యాన్, ఏసీ ఆన్‌ చేయడం, ఆఫ్‌ చేయడం వంటివి చేయగలడు. కార్యాలయం, ఇల్లు, పొలం దగ్గర సీసీ కెమెరాల ద్వారా ఎక్కడో కూర్చుని అక్కడ ఏం జరుగుతుందో పర్యవేక్షించగలడు. ఇంట్లో సెన్సార్‌ వ్యవస్థతో మనం స్విచ్‌ ఆన్‌ చేయకుండానే లైటు వెలుగుతుంది. డోర్‌ తెరుచుకుంటుంది. రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్నటువంటి అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ తదితర విషయాలు తెలియజేస్తారు. 



డ్రోన్‌ వినియోగం.. 
ప్రస్తుతం డ్రోన్‌ టెక్నాలజీకి మార్కెట్‌లో అత్యంత ఆదరణ ఉంది. వీడియోల, ఫొటోల చిత్రీకరణ, వ్యవసాయ పనుల నుంచి మొదలు వివాహాది శుభకార్యాలు, దేశ సరిహద్దుల్లో భద్రత వరకూ డ్రోన్స్‌ విరివిగా వినియోగిస్తున్నారు. డ్రోన్‌ తయారీ విధానం, వినియోగం, ఉపయోగాలపై అవగాహన కలి్పస్తారు. 

3డీ ప్రింటింగ్‌.. 
3డీ ప్రింటింగ్‌ అనేది అత్యాధునిక టెక్నాలజీ. గ్లాస్‌పైన, చెక్క, పింగానీ వస్తువులు, ఇలా ఎక్కడైనా చక్కని ఆకృతితో మనకు నచ్చిన చిత్రాన్ని ప్రతిబింబించేలా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది..ఈ అత్యాధునిక 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి భవన నిర్మాణాలను సైతం చేసేలా వృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీకి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. 

ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘ఫ్లో’ బస్‌లో ఉచిత ప్రవేశం కల్పిస్తారు. పాఠశాల ఉపాధ్యాయులు ఫ్లో టీంను సంప్రదిస్తే వారి షెడ్యూల్‌ ఆధారంగా ఏ రోజు వీలుంటుందనేదీ ఉపాధ్యాయులకు తెలియజేస్తారు. ఆ షెడ్యూల్‌ ప్రకారం పాఠశాలకు బస్‌ వచ్చి అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలపై అవగాహన కలి్పస్తారు. ప్రయివేటు పాఠశాలలు సైతం ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవచ్చు. అయితే పాఠశాల యాజమాన్యం నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 

ఆ లోటును భర్తీ చేసేందుకే.. 
కేంద్ర ప్రభుత్వం 2020లో జాతీయ విద్యాపాలసీ (ఎన్‌ఈపీ)ని అమల్లో తెచి్చంది. ప్రతి పాఠశాలలో అత్యాధునిక టెక్నాలజీని విద్యార్థులకు బోధించాలని చెబుతోంది. ఆ సమయంలో కోవిడ్‌ రావడంతో కాస్త నెమ్మదించినా, తరువాత కాలంలోనూ ఆశించిన ఫలితాలు లేవు. పాఠశాలల్లో నిష్ణాతులైన శిక్షకులు లేకపోవడం, పరికరాలు అందుబాటులో లేకపోవడం, ఇతర సమస్యలు అడ్డంకిగా మారాయి. ఈ పరిస్థితుల నుంచి అధిగమించడానికి ‘ఫ్లో’ ఉపయోగపడుతుందని నిర్వాహకులు 
చెబుతున్నారు.

ఏఆర్, వీఆర్‌.. 
ఆగ్మెంట్‌ రియాలిటీ(ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌) ప్రస్తుత ట్రెండ్‌ ఇది.. ఎక్కడో ఉన్న వ్యక్తి, ప్రాంతం మన కళ్లముందున్న అనుభూతిని కలి్పస్తాయి. 

ఈ వ్యవస్థను ఉపయో గించి  ప్రస్తుతం ప్రచారం.. గేమింగ్‌.. టూరిజం.. వంటి రంగాలు మంచి జోష్‌లో నడుస్తున్నాయి.. అదే ఆగ్మెంట్‌ రియాలిటీ టెక్నాలజీతో.. మరో వైపు వర్చువల్‌గానూ (వీఆర్‌) వేరే ప్రాతంలో ఉన్న వ్యక్తితో నేరుగా మాట్లాడే అవకాశం కలి్పస్తోంది.. ఈ రెండు వ్యవస్థల పనితీరును వివరిస్తారు.

టెక్‌ టూల్స్‌

ఫ్రిజ్, ఏసీ, వాషింగ్‌ మెషీన్, డ్రిల్లింగ్‌ మెషీన్, మైక్రో ఓవెన్, రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే ఫ్యాన్, ఇంట్లో ఉపయోగించే ఇతర ఎల్రక్టానిక్‌ పరికరాలు ఎలా పనిచేస్తాయి. మన జీవితంలో వాటి పాత్ర ఎంతవరకూ ఉంటుంది. వాటి తయారీ విధానం, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేస్తారు.

పదివేల మందికి అవగాహన... 
చిన్నప్పటి నుంచి సైన్స్‌ పట్ల ఆసక్తి ఎక్కువ. నేషనల్‌ కాంగ్రెస్‌ సైన్స్‌ ప్రోగ్రాంలో పాల్గొనేవాడిని. ఎన్నో బహుమతులు వచ్చాయి. ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ గ్రూప్‌ తీసుకున్నా. కళాశాలలో బోధన సంతృప్తిగా అనిపించలేదు. 2020లో రోబోటిక్స్‌పై స్టార్టప్‌ ప్రారంభించాం. ఎఫ్‌ఎల్‌ఓడబ్ల్యూ (ఫ్లో) ప్రారంభించడానికి  ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సాయమందించారు. యూఎస్, ఎస్‌ఎస్‌ఐఐఈ నుంచి సుమారు కోటి రూపాయలు నిధులు సమకూరాయి. కొత్త ఇన్నోవేటివ్స్‌ చేపడుతున్నాం. మేము మొత్తం 18 మంది బృందంగా ఏర్పడి నడిపిస్తున్నాం. త్వరలోనే ఏపీలోనూ ఫ్లో బస్‌ అందుబాటులోకి వస్తుంది.  
– మధులాష్‌ బాబు, సీఈవో ఎడోద్వజ సంస్థ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement