
క్రీడాకారులకు ప్రత్యేక యాప్స్
రూ.వెయ్యి నుంచి రూ.90 వేల రేంజిలో
సాక్షి, సిటీబ్యూరో: వాచ్ రూపాంతరం చెంది స్మార్ట్ వాచ్‌గా మారింది. భిన్నమైన ఫీచర్లతో దూకుడు ప్రదర్శిస్తోంది. మార్కెట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన పనితీరుకలిగిన స్మార్ట్ వాచ్‌లో అందుబాటులోకి వచ్చాయి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని, మన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు డేటా రూపంలో పొందుపరుచుకోవచ్చు. అడ్వెంచర్, వాటర్ స్పోర్ట్స్ అవసరాలకు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. యాపిల్, ఒప్పో, హువావే, ఫిట్ బిట్, నాయిస్, సామ్సంగ్, టైటాన్ మొదలైన కంపెనీలు స్మార్ట్ వాచ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. సుమారు రూ.వెయ్యి నుంచి రూ.90 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి.
పిల్లల కోసం..
చిన్న పిల్లలను తల్లిదండ్రులు ట్రాక్ చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జీపీఎస్ సాయంతో పిల్లల సమాచారాన్ని ట్రాక్ చేయొచ్చు.
ఆరోగ్యంపై అలర్ట్స్..
ఇందులో గుండె పనితీరుకు సంబంధించిన నోటిఫికేషన్లు, రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయి, ఈసీజీ, ఇతర ఆరోగ్య వివరాల సమాచారం అందిస్తాయి. ఫాల్ డిటెక్షన్, క్రాష్ డిటెక్షన్ హార్డ్ ఫాల్, కార్ క్రాష్ సందర్భంలో అత్యవసర సేవలతో అనుసంధానం చేయగలవు. మహిళలకు భద్రత, రుతుచక్రం ట్రాకింగ్‌లోనూ ఈ స్మార్ట్ వాచ్ ఉపయుక్తం.
ఇవి చదవండి: ప్రపంచ బీర్ దినోత్సవం : క్రాఫ్ట్ బీర్ ఇంత పాపులర్?!
Comments
Please login to add a commentAdd a comment